వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: జింబాబ్వే అధ్యక్షుడిపై సైన్యం తిరుగుబాటు?, అసలు నిజం ఇదీ..

బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం వచ్చిన 1980 నుంచి నేటి వరకూ జింబాబ్వేలో ముగాబే(93) పాలన కొనసాగుతోంది. ఇటీవల అధ్యక్షుడికి, సైన్యానికి మధ్య వివాదాలు చోటు చేసుకోవడం కూడా తిరుగుబాటు ప్రచారానికి మరింత ఊతమిచ్చా

|
Google Oneindia TeluguNews

హరారే: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై తిరుగుబాటును సైన్యం ఖండించింది. అధ్యక్షుడు చుట్టూ ఉన్న క్రిమినల్స్ ను మట్టుబెట్టడానికే ఆపరేషన్ మొదలుపెడుతున్నామని, అంతమాత్రానికే తిరుగుబాటు అంటూ ప్రచారం చేయడం తగదని స్పష్టం చేసింది.

ఖండించిన సైన్యం

ఖండించిన సైన్యం

తిరుగుబాటుకు సంబంధించి జింబాబ్వే సైన్యం అక్కడి అధికారిక మీడియాతో మాట్లాడింది. క్రిమినల్స్ ను మట్టుబెట్టాలనే చర్యను ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంగా అభివర్ణించడం సరికాదని సైన్యం అభిప్రాయపడింది.

ముగాబే రక్షణకు హామి

ముగాబే రక్షణకు హామి

అధ్యక్షుడు ముగాబే కుటుంబం ప్రస్తుతం క్షేమంగా ఉందని జింబాబ్వే సైన్యం ప్రకటించింది. అంతేకాదు, ముగాబే రక్షణకు తాము హామి ఇస్తున్నామని తెలిపింది. తమ లక్ష్యం అధ్యక్షుడి వెంట ఉన్న క్రిమినల్సేనని స్పష్టం చేసింది. తమ టార్గెట్ పూర్తయితే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

సైన్యం మోహరించడంతో

సైన్యం మోహరించడంతో

మంగళవారం అధ్యక్షుడి ప్రైవేటు నివాసం చుట్టూ భారీగా సైనిక వాహనాలు చుట్టుముట్టడంతో కలకలం రేగింది. ఈ ప్రాంతంలో కాల్పులు కూడా చోటు చేసుకున్నట్టు వార్తలు రావడంతో జింబాబ్వేలో సైనిక తిరుగుబాటు జరుగుతోందన్న ప్రచారం జరిగింది.

బలం చేకూర్చేలా పరిణామాలు

బలం చేకూర్చేలా పరిణామాలు


కాగా, బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం వచ్చిన 1980 నుంచి నేటి వరకూ జింబాబ్వేలో ముగాబే(93) పాలన కొనసాగుతోంది. ఇటీవల అధ్యక్షుడికి, సైన్యానికి మధ్య వివాదాలు చోటు చేసుకోవడం కూడా తిరుగుబాటు ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ముగాబేకు చెందిన జాను-పీఎఫ్ పార్టీ.. ఆర్మీ చీఫ్ జనరల్ కాన్ స్టాంటినోపై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం కూడా ప్రచారానికి బలం చేకూర్చాయి.

English summary
imbabwe is on edge amid reports that soldiers have been deployed to the streets of the capital Harare in what could be the most serious challenge yet to President Robert Mugabe's decades-long grip on power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X