• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జింబాబ్వే వ్యవహారం: భార్యకు పట్టం కట్టాలనుకున్న అధ్యక్షుడు.. ముందే పసిగట్టిన ఆర్మీ

By Ramesh Babu
|

హరారే: జింబాబ్వేలో రాబర్ట్‌ ముగాబే ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది. 37 ఏళ్లుగా దేశాన్ని తన ఉక్కు గుప్పిట్లో పెట్టుకున్న 93 ఏళ్ల ముగాబేపై సైన్యం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. భార్య గ్రేస్‌కు అధికారం కట్టబెట్టాలని ముగాబే చేసిన ప్రయత్నాలను ముందే పసిగట్టిన ఆర్మీ.. పాలనా పగ్గాలను ఆయన నుంచి లాగేసుకుంది.

అంతేకాదు, అధ్యక్షుడిని గృహ నిర్బంధంలో ఉంచి.. దేశం మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకుంది. హరారేలో పార్లమెంట్‌ భవనం సహా దేశంలోని కీలక ప్రాంతాలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికార జాను-పీఎఫ్‌ ఆఫీసు దగ్గర ఆర్మీ బలగాలు, యుద్ధ ట్యాంకులు భారీగా మోహరించాయి.

 దద్దరిల్లిన హరారే వీధులు...

దద్దరిల్లిన హరారే వీధులు...

సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో బుధవారం ఆ దేశ రాజధాని హరారే వీధులు భారీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి. ముగాబే నివాసం సమీపంలోనూ కాల్పుల శబ్దాలు వినిపించాయి. 1980లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్‌ ముగాబే గెలుపొందుతూ వచ్చారు. సైనిక చర్యలో భాగంగా ముగాబేని గృహ నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత రాజధాని హరారే వీధుల్లో ఆర్మీ బలగాలు కవాతు నిర్వ హించాయి.

 కీలక ప్రాంతాలు ఆర్మీ చేతిలో...

కీలక ప్రాంతాలు ఆర్మీ చేతిలో...

హరారేలో పార్లమెంట్‌ భవనం సహా దేశంలోని కీలక ప్రాంతాలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఆర్మీ భారీగా మోహరించింది. జాతీయ వార్తా సంస్థ జింబాబ్వే స్టేట్‌ బ్రాడ్‌కాస్టర్‌ (జెడ్‌బీసీ), అధికార జాను-పీఎఫ్ (జింబాబ్వే ఆఫ్రికన్‌ నేషనల్‌ యూనియన్‌-పాట్రియొటిక్‌ ఫ్రంట్‌) పార్టీ కేంద్ర కార్యాలయాలను సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. ఆర్థికమంత్రి ఇగ్నాటియస్‌ చాంబోను కూడా సైన్యం తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 సైనిక చర్య వెనుక దురుద్దేశం లేదు...

సైనిక చర్య వెనుక దురుద్దేశం లేదు...

అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో తాము సైనిక చర్యకు పాల్పడలేదని జింబాబ్వే ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కాన్‌స్టాంటినో చివెంగా తెలిపారు. ముగాబేతో తనకు వ్యక్తిగత కక్ష్యలు లేవని, దేశంలో పేట్రేగిపోయిన అవినీతిని నిర్మూలించాలన్నదే తమ ధ్యేయం అన్నారు. ముగాబే స్థానాన్ని ఎమర్సన్‌ మ్నంగాగ్వతో భర్తీ చేయాలని మిలిటరీ కుట్రపన్నిందనే ఆరోపణలున్నాయని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు.

 బెడిసికొట్టిన ముగాబే వ్యూహం..

బెడిసికొట్టిన ముగాబే వ్యూహం..

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తీసుకున్న అవివేక నిర్ణయాలతో కేవలం 10 రోజుల్లోనే అంతా తలకిందులైంది. ఉపాధ్యక్ష పదవి నుంచి ఎమర్సన్‌ మ్నంగాగ్వను తొలగించి, భార్య గ్రేస్‌ ముగాబే (52)కు అధికారం కట్టబెట్టాలని ఆయన భావించారు. యూత్‌ లీడర్లు గ్రేస్‌కు, వెటరన్‌ లీడర్లు మ్నంగాగ్వకు మద్దతివ్వడంతో పార్టీ రెండుగా చీలింది. మ్నంగాగ్వకు ఆర్మీ మద్దతు ఉందని, అందుకే ముగాబేపై తిరుగుబాటుచేశారని ప్రచారం జరుగుతోంది.

ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది...

ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉంది...

జింబాబ్వేలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ దేశ ఆర్మీ జనరల్‌ సిబుసిసో మోయో మీడియాతో మాట్లాడారు. ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా ఉందని, వారి రక్షణకు తాము హామీ ఇస్తున్నామని తెలిపారు. ఆయన చుట్టూ ఉన్న కొందరు దేశానికి సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, అలాంటి వారిని మాత్రమే సైన్యం లక్ష్యంగా చేసుకుందని, తమ పని పూర్తయిన తర్వాత మళ్లీ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.

 ముగాబే క్షేమం.. నాతో మాట్లాడారు...

ముగాబే క్షేమం.. నాతో మాట్లాడారు...

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జేకబ్‌ జుమా.. జింబాబ్వే అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడారు. ‘‘నేను మా ఇంట్లోనే మిలటరీ నిర్బంధంలో ఉన్నాను. క్షేమంగానే ఉన్నాను.'' అని ముగాబే తనతో చెప్పారని జుమా తెలిపారు. మరోవైపు ఆర్థిక సంక్షోభం కారణంగా నగదు కోసం జింబాబ్వే దేశ ప్రజలు బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు.

 అప్రమత్తంగా ఉండండి...

అప్రమత్తంగా ఉండండి...

మరోవైపు జింబాబ్వేలో ఉన్న తమ పౌరులను అమెరికా అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌరులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. జింబాబ్వేలో చోటుచేసుకున్న పరిణా మాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది. జింబాబ్వే లో తలెత్తిన అంతర్గత సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. ఆ దేశంలో తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల కారణంగా జింబాబ్వేలోని యూఎస్‌ రాయబారి కార్యా లయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపింది. కాగా, జింబాబ్వేలో ఉన్న భారతీయలు క్షేమంగా ఉన్నారని అక్కడి భారత రాయబార వర్గాలు వెల్లడించాయి.

English summary
Zimbabwe's military leaders have seized control of the impoverished southern African nation, placing longtime leader Robert Mugabe under house arrest and deploying armored vehicles to the streets of the capital, Harare. Mugabe, 93, the world's oldest living leader, was unable to leave his home, according to Jacob Zuma, the President of neighboring South Africa. Troops were reportedly stationed at Zimbabwe's Parliament and the presidential palace. In a dramatic televised statement early Wednesday, an army spokesman denied a military takeover was underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more