వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: జింబాబ్వే సంక్షోభంలో 'డ్రాగన్' హస్తం, ముగాబెను గద్దె దించడం వెనుక!..

ముగాబే పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

హరారే: జింబాబ్వే రాజకీయ సంక్షోభంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. జను పీఎఫ్ పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమర్సన్ ను పార్టీ నుంచి ముగాబే తొలగించడంతో అసలు వివాదం మొదలైంది.

విలాస జీవితం: షాపింగ్‌కు ఏటా రూ,. 20కోట్లు, మొగాబే దంపతుల లైఫ్ స్టైల్విలాస జీవితం: షాపింగ్‌కు ఏటా రూ,. 20కోట్లు, మొగాబే దంపతుల లైఫ్ స్టైల్

ముగాబే వారసుడు ఎమర్సనే అని జనం భావిస్తున్న తరుణంలో ఆయన పోకడలు మరోలా ఉండటం అక్కడి ప్రజలకు, సైన్యానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. కేవలం తన భార్య గ్రేస్ కు పట్టం కట్టాలన్న ఉద్దేశంతో పోరాట వారసత్వం ఉన్న ఎమర్సన్ ను పార్టీ నుంచి తొలగించడం సైన్యానికి రుచించలేదు.

విలాస జీవితం: షాపింగ్‌కు ఏటా రూ,. 20కోట్లు, మొగాబే దంపతుల లైఫ్ స్టైల్విలాస జీవితం: షాపింగ్‌కు ఏటా రూ,. 20కోట్లు, మొగాబే దంపతుల లైఫ్ స్టైల్

 ఎవరీ ఎమర్సన్:

ఎవరీ ఎమర్సన్:

జను పీఎఫ్ పార్టీలో ఎమర్సన్ కీలకమైన వ్యక్తిమాత్రమే కాదు. నాలుగుదశాబ్దాల క్రితం వలసపాలకులకు వ్యతిరేకంగా జింబాబ్వే చేసిన పోరాటంలో ముగాబేతో పాటు పాల్గొన్నవాడు. బ్రిటీష్ పాలన నుంచి జింబాబ్వేకు స్వాతంత్ర్యం తెచ్చి పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించినవాడు. అలాంటి ఎమర్సన్ ను కాదని, తన భార్యను అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టే దిశగా ముగాబే అడుగులు వేయడం జింబాబ్వే ప్రజలకు నచ్చలేదు. దీంతో సైన్యమే చొరవ తీసుకుని ఆయనను నిలువరించే పరిస్థితి ఏర్పడింది.

చైనా హస్తం ఉందా?:

చైనా హస్తం ఉందా?:

ముగాబే ప్రజా వ్యతిరేక పోకడలను సైన్యం నిలువరించడంలో చైనా హస్తం ఉందా? అన్న అనుమానాలు కూడా తాజాగా తెర పైకి వచ్చాయి. ముగాబేను సైన్యం హౌజ్ అరెస్ట్ చేయడానికి ముందు.. సైన్యాధ్యక్షుడు కాన్ స్టాంటినో చివెంగా చైనాలో పర్యటించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముగాబేను గద్దె దించే వ్యవహారంపై ఇరువురి మధ్య చర్చలు జరిగి ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.

 జింబాబ్వే-చైనా సంబంధాలు:

జింబాబ్వే-చైనా సంబంధాలు:

1970 నుంచి జింబాబ్వేతో చైనా బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉంది. ముగాబేతో స్నేహ హస్తాన్ని కొనసాగించిన చైనా.. జింబాబ్వేలోని వ్యవసాయరంగం, షిప్పింగ్ ఇలా దాదాపు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చింది. జింబాబ్వేకు అప్పటి సోవియట్ రష్యా ఆయుధాలను సరఫరా చేయడానికి విముఖత చూపడంతో.. చైనానే జింబాబ్వేకు ఆయుధాలు కూడా సమకూర్చింది. జింబాబ్వే కొత్త పార్లమెంటు నిర్మాణం విషయంలోను చైనా చొరవ తీసుకుంది.

 విభేదాలు:

విభేదాలు:

గత కొన్నేళ్లుగా చైనా-ముగాబే మధ్య సన్నిహిత వాతావరణం దెబ్బతిన్నది. చైనాతో ఆయుధాల ఒప్పందాన్ని ముగాబే 2008లో రద్దు చేశారు. ఆయుధాలను తిప్పి పంపించారు. ఈ చర్య చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఆయుధాలపై అప్పటికే జింబాబ్వే బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడంతో చైనా కూడా ఏమి అనలేకపోయింది.

అయితే ఆ దేశానికి అందిస్తున్న రక్షణ సహాయాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ముగాబే పాలనపై అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది. దీంతో తాజా పరిణామాల వెనుక డ్రాగన్ హస్తం కూడా ఉందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.

 సంతోషంలో జింబాబ్వే ప్రజలు:

సంతోషంలో జింబాబ్వే ప్రజలు:

ముగాబే పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనను హౌజ్ అరెస్ట్ చేస్తే అక్కడి ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవలేదు. సరికదా.. ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినందుకు అక్కడి ప్రజలు సంబరాలు కూడా జరుపుకున్నారు.

గ్రేస్ ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలన్న ముగాబే చర్యలకు చెక్ పెట్టడంతో పాటు..ఆ స్థానంలో ఎమర్సన్ ను అధ్యక్షుడిని చేయడం కోసమే సైన్యం ఈ తిరుగుబాటు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. న్యాయబద్దంగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. అవినీతిలో కూరుకుపోయిన జను-ఎఫ్ పార్టీ అక్కడి ఏడు పార్టీల సంకీర్ణంపై గెలుస్తుందా? అన్నది అనుమానమే.

English summary
Robert Mugabe, the 93-year-old African leader who ruled Zimbabwe for 37 years was fired by the ruling party, the Zimbabwe African National Union-Patriotic Front (ZANU-PF), and his wife, Grace Mugabe, was expelled from the party for inciting division on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X