వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు సిద్ధమైన టైంలో: జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే రాజీనామా

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే మంగళవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్లమెంటు స్పీకర్ ధ్రవీకరించారు. ముగాబే నుంచి రాజీనామా లేఖ అందినట్లు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హరారే: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే మంగళవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్లమెంటు స్పీకర్ ధ్రవీకరించారు. ముగాబే నుంచి రాజీనామా లేఖ అందినట్లు చెప్పారు.

ఓ వైపు ముగాబేను అభిశంసన తీర్మానం ద్వారా తొలగింపునకు పార్లమెంట్‌ సిద్ధమైన సమయంలో ఆయన రాజీనామా చేశారు. ముగాబే రాజీనామాతో హరారే వీధుల్లో పండగ వాతావరణం కనిపించింది.

దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమర్సన్‌ను ముగాబే తొలగించడం, ఆపై అధికార పగ్గాలను తన భార్య గ్రేస్‌కు అప్పగించేందుకు సిద్ధపడడం వంటి పరిణామాల నేపథ్యంలో సైన్యం ఆయనను ఇటీవల అతని ఇంట్లోనే బంధించింది.

Zimbabwe President Robert Mugabe has resigned says Parliament Speaker

ఈ నేపథ్యంలో అధికార జడ్‌ఏఎన్‌యూ పీఎఫ్‌ పార్టీ ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఇరవై నాలుగు గంటల్లో పదవి నుంచి దిగకపోతే అభిశంసన ఎదుర్కోవాలని హెచ్చరించింది.

గడువు ముగిసినా రాజీనామా చేయకపోవడంతో అభిశంసన ద్వారా ముగాబేను తొలగించేందుకు పార్లమెంట్‌ సమావేశమైంది. ఈ క్రమంలో ఆయన తన రాజీనామాను సమర్పించారు. 1980లో ముగాబే జింబాబ్వే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

English summary
Robert Mugabe resigned Tuesday as Zimbabwe's president, submitting a letter to parliament that ended his 37-year rule and triggered massive celebrations in the streets of the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X