వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జింబాబ్వే అధ్యక్షుడిపై బాంబు దాడి: కొద్దిలో బయటపడ్డానని చెప్పిన ఎమ్మెర్సన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హరారే: జింబాబ్వే అధ్యక్షులు ఎమ్మెర్సన్‌ మన్నంగాగ్వాపై బాంబుదాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. జింబాబ్వేలోని బుల్‌అవే వైట్‌సిటీ స్టేడియంలో అధికార పార్టీ మీటింగ్‌కు ఆయన హాజరైన సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ సమావేశంలో ఎమ్మర్సన్‌ ప్రసంగం ముగిసిన వెంటనే బాంబు పేలుడు చోటు చేసుకుంది. భద్రతాదళాలు ఆయనను సురక్షితంగా తరలించారు. ఈ దాడిలో ఉపాధ్యక్షుడు చివాంగ , ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు. వీరితో పాటు మరికొందరు గాయపడ్డారు.

Zimbabwes President Mnangagwa calls assassination attempt cowardly act

కొద్దిలో తాను ప్రమాదం నుంచి బయపడ్డానని అధ్యక్షులు మన్నంగాగ్వా తెలిపారు. తనకు కొద్ది దూరంలో ఈ పేలుడు చోటు చేసుకుందన్నారు.

జులై 30న జరగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభ నిర్వహించారు. రాబర్టు ముగాబే 37 ఏళ్ల పాలన అంతమైన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవి. 93 ఏళ్ల ముగాబే ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి వైదొలగి ఎమ్మర్సన్‌ను నియమించారు.

English summary
Zimbabwe's President Emmerson Mnangagwa has survived an apparent bomb attack at a rally in the city of Bulawayo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X