• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డకౌట్ బోయ్ పృథ్వీ షా.. డగౌట్‌కే: ఢిల్లీ కేపిటల్స్ కొత్త ఓపెనర్‌గా పించ్ హిట్టర్‌? లైనప్‌ ఛేంజ్

|

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగింపు దశకు వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13 ఎడిషన్‌లో కీలక మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. ఫైనల్‌కు ఎవరు వెళ్లాలో తేల్చి పారేసే మ్యాచ్ ఇది. ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా ఈ పోరు కొనసాగనుంది. ఇందులో విజయం సాధించిన టీమ్.. ఫైనల్‌లో అడుగు పెడుతుంది. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొడుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం ఫైనల్ మ్యాచ్.

ఢిల్లీ కేపిటల్స్ బ్యాటింగ్ లైనప్‌లో భారీ మార్పులు..

ఢిల్లీ కేపిటల్స్ బ్యాటింగ్ లైనప్‌లో భారీ మార్పులు..

సెమీ ఫైనల్ వంటి మ్యాచ్ కావడంతో ఢిల్లీ కేపిటల్స్.. బ్యాటింగ్ లైనప్‌పై దృష్టి సారించింది. భారీ మార్పులను చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ఓపెనర్ పృథ్వీ షాను తుదిజట్టులోకి తీసుకోకపోవచ్చు. వరుసగా విఫలమౌతోన్న పృథ్వీ షాకు బదులుగా మార్కస్ స్టోయినిస్‌ను ఓపెనర్‌గా పంపించవచ్చని తెలుస్తోంది. శిఖర్ ధవన్‌తో కలిసి స్టోయినిస్ ఇన్నింగ్‌ను ప్రారంభిస్తారనే అంచనాలు ఉన్నాయి. షిమ్రోన్ హెట్మెయిర్‌ను బ్యాటింగ్ లైనప్‌లో ముందుకు జరపొచ్చని అంటున్నారు. భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉన్నా.. లేదా లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా.. హిట్టర్లకు ప్రాధాన్యత ఇచ్చేలా ఢిల్లీ కేపిటల్స్ వ్యూహాలను రూపొందిస్తోంది.

డకౌట్ బోయ్‌ డగౌట్‌కే..

డకౌట్ బోయ్‌ డగౌట్‌కే..

ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా వరుసగా విఫలమౌతున్నాడు. అతని ఫెయిల్యూర్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే.. చివరి ఎనిమిది మ్యాచుల్లో అతను సాధించిన వ్యక్తిగత పరుగులు 49 మాత్రమే. ఈ ఎనిమిది మ్యాచుల్లో అతని అత్యధిక స్కోరు 19. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా మూడు సార్లు పృథ్వీ షా సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. అతని ఆత్మవిశ్వాసం దాదాపుగా అడుగంటి పోయింది. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులకు పృథ్వీ షా బోల్తా కొడుతున్నాడు. వికెట్లను పారేసుకుంటున్నాడు.

శిఖర్ ధవన్-స్టోయినిస్

శిఖర్ ధవన్-స్టోయినిస్

ఈ పరిస్థితుల మధ్య పృథ్వీ షాను తుది జట్టులోకి తీసుకోకపోవడానికే అవకాశాలు ఉన్నాయి. అతనికి బదులుగా స్టోయినిస్‌తో ఇన్నింగ్‌ను ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. అజింక్య రహానే అందుబాటులో ఉన్నప్పటికీ..ఓపెనర్‌గా పంపించకపోవచ్చు. వన్‌డౌన్‌గా అతని స్థానాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా లేదా అజింక్య రహానే.. క్రీజ్‌లో ఎక్కువ సేపు కుదురుకోలేకపోతున్నారని, వారు త్వరగా అవుట్ అయితే.. మిగిలిన బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పడుతోంది. ఫలితంగా- శ్రేయాస్ అయ్యర్ వంటి మినిమం గ్యారంటీ బ్యాట్స్‌మెన్ కూడా భారీ షాట్లను ఆడలేకపోతున్నాడు.

 గుడ్ పెయిర్..

గుడ్ పెయిర్..

శిఖర్ ధవన్, మార్కస్ స్టోయినిస్‌లను ఓపెనర్లుగా పంపించగలిగితే.. భారీ స్కోర్‌ సాధించడమో లేదా.. లక్ష్యాన్ని తేలిగ్గా అందుకోవడమో సాధ్యపడుతుందని ఢిల్లీ కేపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. ఇద్దరికిద్దరూ భారీ షాట్లను ఆడగలరు. కొత్తబంతిని ధీటుగా ఎదుర్కొనగలరు. వారిద్దరూ క్రీజ్‌లో కుదురుకోగలిగితే మాత్రం.. సగం మ్యాచ్‌ గెలిచినట్టేననే అభిప్రాయాలు ఉన్నాయి. దూకుడుగా ఆడటానికే ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందని భావిస్తోంది. ఈ సీజన్‌లో స్టోయినిస్ ట్రాక్ రికార్డు మెరుగ్గానే ఉంది. 15 మ్యాచ్‌లను ఆడిన అతను 314 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 150.23గా నమోదైంది. బ్యాటింగ్ యావరేజ్ 26.16.

English summary
The Capitals' response to that flaky top order, in particular Prithvi Shaw's form - 49 runs in his last eight innings - has been to drop Shaw first and then to add a steady top-order batsman at the expense of that middle-overs chaos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X