• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండో నాకౌట్: సన్‌రైజర్స్‌కు హైఓల్టేజ్ షాక్: ఆ బ్యాట్స్‌మెన్ అవుట్: విశాఖ సీన్ రిపీట్?

|

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టోర్నమెంట్ చివరి మ్యాచ్‌లల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయి ఆడుతోంది. వరుస విజయాలతో దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి ఎవరనేది లెక్క చేయట్లేదు. నిలవాలంటే గెలవాలనే ధోరణితో ఓ ఆట ఆడేస్తోంది. లీగ్ దశలో చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింట్లో గెలుపొందింది. అందులో మూడు హ్యాట్రిక్ విజయాలు ఉన్నాయి. అదే విజృంభణను ప్లేఆఫ్‌లోనూ కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో స్థిరత్వాన్ని సాధించింది. నిలకడగా రాణిస్తోంది.

సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం..

సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం..

ఇంకొన్ని గంటల్లో రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఆడబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టబోతోంది. లీగ్ దశలో ఢిల్లీ కేపిటల్స్‌పై డేవిడ్ వార్నర్ సేనదే ఆధిపత్యం. చివరి నాకౌట్ మ్యాచ్‌లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. రెండో నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఇప్పుటిదాకా ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు తిరుగులేదు. ఢిల్లీని ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

2019 రిపీట్ కాకూడదనే..

2019 రిపీట్ కాకూడదనే..

ప్లేఆఫ్ దశలో ఇప్పుటి పరిస్థితులు 2019లోనూ కనిపించాయి. ఐపీఎల్-2019 సీజన్ 12వ ఎడిషన్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్‌ జరిగింది మన విశాఖపట్నంలోనే. విశాఖపట్నం స్టేడియంలో జరిగిన నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ టాప్ స్కోరర్. 35 పరుగులు చేశాడతను. ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ఇంకా ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. 165 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా, రిషబ్ పంత్ భారీ భాగస్వామ్యాన్ని అందించారు. పృథ్వీ షా 56 పరుగులు, రిషబ్ పంత్ 49 పరుగులు చేశారు.

వారిద్దరూ ఫామ్‌లో లేరు..

వారిద్దరూ ఫామ్‌లో లేరు..

ఈ సారి దీనికి ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఆ మ్యాచ్‌ కంటే భిన్నంగా కనిపిస్తోంది. పృథ్వీ షా ఏ మాత్రం ఫామ్‌లో లేడు. ఈ ఐపీఎల్‌లో వరుసగా విఫలం అవుతున్నాడు. ఇప్పటికే నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్‌పై జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ అతను సున్నాకే అవుట్ అయ్యాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో పృథ్వీ షాను ఆడించడం కూడా అనుమానమే. రిషబ్ పంత్‌దీ అదే దారి. అతను ఫామ్‌లో లేడు. రిథమ్‌ను అందిపుచ్చుకోలేకపోతున్నాడు.

వృద్ధిమాన్ సాహాకు గాయం..

వృద్ధిమాన్ సాహాకు గాయం..

ఇదిలావుండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో అతను ఆడకపోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతనికి బదులుగా బెయిర్‌స్టోను తుది జట్టులోకి తీసుకోవచ్చు. గాయాల బారిన పడిన విజయ్ శంకర్, షాన్ మార్ష్, భువనేశ్వర్ కుమార్.. టోర్నీ మొత్తానికే దూరం అయ్యారు. తాజాగా వృద్దిమాన్ సాహా కూడా గాయపడటం జట్టు విజయావకాశాలపై ప్రభావాన్ని చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గోస్వామిని ఆడించడానికి కారణం అదే. ఆ మ్యాచ్‌లో అతను రాణించలేకపోయాడు.

English summary
In Qualifier 2 of IPL 2020, the Sunrisers Hyderabad (SRH) will go head-to-head with Delhi Capitals (DC) on Sunday at the Sheikh Zayed Stadium in Abu Dhabi. Sunrisers had defeated the Capitals in both the league stage encounters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X