వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎల్-2020 విన్నర్ ఎవరో తేల్చేసిన లీప్ ఇయర్: కప్ ఆ జట్టుదే : టోర్నీ ట్రెడీషన్ కూడా అదే

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్.. సరికొత్త ఛాంపియన్‌ ఆవిర్భవిస్తుందనే సంకేతాలను పంపించినట్టయింది. ఈ సారి కొత్త జట్టు ఐపీఎల్ విజేతగా నిలవడానికి అవకాశం ఉందనిపించేలా చేసింది. ఐపీఎల్-2020 కప్‌ను కొత్త జట్టు కైవసం చేసుకుంటుందనడానికి కొన్ని రుజువులు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి.. ఈ మెగా టోర్నమెంట్ ట్రెడీషన్ ఆధారంగా చేసుకుని చూస్తే. ఆ ట్రెడీషన్‌ను కొనసాగించేలా కొత్త జట్టు ఢిల్లీ కేపిటల్స్.. ఫైనల్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇదివరకే ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది.

Recommended Video

MI VS DC: New Team Has Won IPL Every Leap Year, Is this #DelhiCapitals Year? | #IPL2020Finals

ఐపీఎల్ ఫైనల్‌‌‌కు చేరిన తెలుగోళ్ల టీమ్: ఉత్తరాంధ్ర నుంచి: పుష్కర కాలానికి బోణీ: ఛాంపియన్‌గా?ఐపీఎల్ ఫైనల్‌‌‌కు చేరిన తెలుగోళ్ల టీమ్: ఉత్తరాంధ్ర నుంచి: పుష్కర కాలానికి బోణీ: ఛాంపియన్‌గా?

సన్‌రైజర్స్‌ను ఓడించి..

సన్‌రైజర్స్‌ను ఓడించి..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్..మొత్తం 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. 190 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 172 పరుగుల వద్దే ఆగిపోయింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 172 పరుగులు చేసింది. విజయం కోసం చివరికంటా పోరాడినప్పటికీ.. ఫలితం రాలేదు. బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురయ్యారు. భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యారు. ఒక్క పరుగు తేడాతో మూడు వికెట్లను కోల్పోయారు.

తొలిసారిగా ఫైనల్‌లో ఎంట్రీ..

తొలిసారిగా ఫైనల్‌లో ఎంట్రీ..

ఈ విజయంతో ఢిల్లీ కేపిటల్స్ తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అడుగు పెట్టింది. ఏ ఐపీఎల్ సీజన్‌కైనా ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఆ జట్టు ఒక్కసారి కూడా ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీ కేపిటల్స్.. విజయం సాధించడమంటూ జరిగితే.. అదీ ఓ రికార్డే అవుతుంది. తొలిసారి ఫైనల్‌లో ప్రవేశించి.. కప్‌ను ఎగరేసుకెళ్లిన జట్ల సరసన చేరుతుంది.

లీప్ ఇయర్ ప్రిడిక్షన్ ఏంటీ?

లీప్ ఇయర్ ప్రిడిక్షన్ ఏంటీ?

ఐపీఎల్ టోర్నమెంట్‌కు, లీప్ ఇయర్‌కు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ప్రతి లీప్ ఇయర్‌లోనూ ఓ కొత్త ఛాంపియన్‌ను అందించింది ఐపీఎల్ మెగా టోర్నీ. దీని ప్రకారం చూసుకుంటే.. ఈ సారి ఛాంపియన్‌గా నిలిచేది ఢిల్లీ కేపిటల్స్. నిజానికి- ఐపీఎల్ ఆరంభమైంది కూడా లీప్ ఇయర్‌లోనే. 2008లో ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. అది లీప్ ఇయర్. ఆ లీప్ సంవత్సరంలో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. ఇప్పటిదాకా మళ్లీ ఆ జట్టు ఐపీఎల్ కప్‌ను ముద్దాడలేదు.

 2012లో లీప్ ఇయర్స్‌లో..

2012లో లీప్ ఇయర్స్‌లో..


2008 తరువాతి లీప్ ఏడాది 2012. ఆ సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ ఛాాంపియన్‌గా ఆవిర్భవించింది. ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి మరీ కోల్‌కత నైట్ రైడర్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 190 పరుగుల టార్గెట్‌ను కోల్‌కత ఛేదించింది. ఓపెనర్ బిస్లా, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ జాక్వెస్ కల్లిస్ ధాటికి అంత భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. ఇంకో రెండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది కోల్‌కత. ఐపీఎల్ కప్‌ను గెలవడం ఆ జట్టుకు అదే తొలిసారి.

2016 లీప్ ఇయర్‌లో..

2016 లీప్ సంవత్సరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స బెంగళూరును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 208 పరుగుల భారీ స్కోర్‌ను సాధించగా.. బెంగళూరు జట్టు గట్టి పోటీ ఇచ్చింది గానీ..గెలవలేకపోయింది. 200 పరుగులను మాత్రమే చేయగలిగింది. ఆ మ్యాచ్‌లో సన్ రైజర్స్ టీమ్‌లో డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్. 38 బంతుల్లో 69 పరుగులు చేశాడు. బెంగళూరు తరఫున క్రిస్ గేల్ భారీ సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 38 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.

ఇక నెక్స్ట్ లీప్ సంవత్సరం ఇదే..

ఇక నెక్స్ట్ లీప్ సంవత్సరం ఇదే..

2016 తరువాతి లీప్ ఇయర్ ఇదే. ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభం నుంచీ కొనసాగుతూ వస్తోన్న ఈ లీప్ ఇయర్ ట్రెడీషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే- ముంబై ఇండియన్స్ ఇదివరకే ఛాంపియన్‌గా నిలిచింది. ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటిదాకా కప్‌ కొట్టలేదు.. సరికదా.. ఫైనల్‌లో అడుగు కూడా పెట్టలేదు ఇప్పటిదాకా. లీప్ ఏడాది సంప్రదాయం కొనసాగుతుందని భావిస్తే.. ఢిల్లీ కేపిటల్స్ విన్నర్‌గా నిలవడం లాంఛనప్రాయమే. ముంబై ఇండియన్స్ దీన్ని బ్రేక్ చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

English summary
In every leap year a new champion will rising in the IPL tournament. Rajasthan Royals won the title in 2008 leap year. In 2012 Kolkata Knight Riders bags the Cup. Sunrisers Hyderabad become a winner in the another leap year, thats 2016. 2020 is another leap year in this row. Now, new team Delhi Capital enter in the final of the IPL 2020. is this time DelhiCapitals' year?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X