• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐపీఎల్‌లో గ్లామర్ డోస్: దుబాయ్ స్టేడియంలో ముగ్గురు అందగత్తెలు: ఆ ఒక్క టీమ్ కోసం ఛీర్ అప్

|

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో క్రమంగా గ్లామర్ డోస్ పెరుగుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల్లేకుండా, ఛీర్ గర్ల్స్ గ్లామర్ రహితంగా చప్పగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్‌లో ఇప్పుడిప్పుడే కాస్త కళ కనిపిస్తోంది. దుబాయ్ స్టేడియంలో ముగ్గురు అందగత్తెలు వీక్షకులకు కనువిందు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం సాయంత్రం దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆ ముగ్గురూ కెమెరా కంటికి చిక్కారు.

విరాట్ కోహ్లీ భార్య.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

విరాట్ కోహ్లీ భార్య.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ దుబాయ్ స్టేడియంలో తళుక్కున మెరిశారు. రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు జట్టు ఘన విజయాన్ని సాధించిన వెంటనే ఆమె.. చప్పట్లు కొడుతూ, ఛీర్ అప్ చేస్తూ కనిపించారు. బెంగళూరు టీమ్ ఫ్రాంఛైజీ, టీమ్ మేనేజ్‌మెంట్‌తో కలిసి ఆమె మ్యాచ్ మొత్తాన్నీ ఆస్వాదించారు. ఆమె శనివారం ఉదయమే దుబాయ్‌కు చేరుకున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్‌తో కలిశారు. మ్యాచ్ ప్రారంభం నుంచీ ఆమె స్టేడియంలోనే సరదాగా గడిపారు. ఐపీఎల్-2020 మ్యాచ్‌లకు అనూష్క శర్మ హాజరు కావడం ఇది రెండోసారి.

యజువేంద్ర చాహల్ కాబోయే భర్య కూడా

యజువేంద్ర చాహల్ కాబోయే భర్య కూడా

మరో వంక- టాప్ యూట్యూబర్ ధనశ్రీ వర్మ వీఐపీ బాక్స్‌లో కనిపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కాబోయే భార్య ఆమె. ఈ ఏడాది ఆగస్టులోనే వారిద్దిరికీ నిశ్చితార్థమైంది. వచ్చే ఏడాది వివాహం జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్-2020 టోర్నమెంట్ ప్రారంభం నుంచీ ఆమె సోషల్ మీడియాకే పరిమితమౌతూ వచ్చారు. బెంగళూరు టీమ్ విజయం సాధించిన ప్రతీసారీ.. తన కాబోయే భర్త వికెట్లను తీసినప్పుడూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా రెస్పాండ్ అవుతూ వచ్చిన ఆమె.. ఈ సారి లైన్‌లోకొచ్చారు. లైవ్ మీద కనిపించారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరు కావడం ఆమెకు ఇదే తొలిసారి.

ఆర్సీబీ డగౌట్‌లో నవనీత..

ఆర్సీబీ డగౌట్‌లో నవనీత..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మసాజ్ థెరపిస్ట్, సపోర్టింగ్ స్టాఫ్‌ నవనీత గౌతమ్ కూడా అదే మ్యాచ్‌లో ఉత్సాహంగా కనిపించారు. నవనీత గౌతమ్ కూడా ఆర్సీబీ వైపే ఛీర్ అప్ చేశారు. బెంగళూరు డగౌట్‌లో కనిపించడం ఆమెకు కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా ఆమె టీమ్ మెంబర్స్‌తో కనువిందు చేశారు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం, ఏబీ డివిలియర్స్ రెచ్చిపోయి ఆడటం వంటి పరిణామాలతో నవనీత గౌతమ్‌లో ఉత్సాహం రెట్టింపయినట్టు కనిపించింది. జట్టు ప్లేయర్లతో పాటు విజయాన్ని ఎంజాయ్ చేశారు. అనూష్క శర్మ, ధనశ్రీ వర్మ, నవనీత గౌతమ్.. బెంగళూరు టీమ్‌ వైపే ఉన్నారు.

  IPL 2020: RCB v RR Highlights: AB de Villiers Fastest 50 in IPL 2020 | Rahul Tewatia Brilliant Catch
  ఒకే ఫ్రేమ్‌లో అనూష్క శర్మ, ధనశ్రీ వర్మ..

  ఒకే ఫ్రేమ్‌లో అనూష్క శర్మ, ధనశ్రీ వర్మ..

  అంతకుముందు- అనూష్క శర్మ, ధనశ్రీ వర్మ స్టేడియంలో కలుసుకున్నారు. బెంగళూరు టీమ్ ప్లేయర్ పార్థివ్ పటేల్, యాక్టర్-కమేడియన్ డానిష్ సెట్, ఇతర టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యులతో కలిసి వారు గ్రూప్ ఫొటో దిగారు. దాన్ని ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. షేరింగ్ సమ్ హ్యాపీ మూవ్‌మెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్ అంటూ కామెంట్స్ పెట్టారు. అనూష్క శర్మ రెండోసారి ఎమిరేట్స్‌కు వచ్చారు. ధనశ్రీ వర్మకు ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఆమె ప్రత్యక్షంగా చూశారు. ఇక నవనీతా గౌతమ్.. ముందు నుంచీ జట్టుతో పాటే ఉంటున్నారు.

  English summary
  Dhanashree Verma, the fiancee of cricketer Yuzvendra Chahal, attended her first Indian Premier League (IPL) match on Saturday. She was joined by actor Anushka Sharma and others. RCB's Massage Therapist Navneeta Gautam also in the Stadium.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X