• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధోనీపై అక్షర్ పటేల్ కక్షసాధింపు: నాలుగేళ్లుగా రగులుతున్న పగ: ఒక్క రాత్రితో ఫినిష్

|

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని తన ఖాతాలో జమ చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతులారా ఓడిపోయింది. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో ఏ క్షణంలోనైనా.. ఎలాంటి అద్భుతాలైనా చోటు చేసుకోగలవనడానికి మరో ఉదాహరణగా నిలిచిందా మ్యాచ్. గెలిచి తీరుతుందనుకున్న మ్యాచ్‌ను పోగొట్టుకుంది చెన్నై. పోరాడితే పోయేదేమీ లేదనే తరహాలో తెగించిన ఢిల్లీ కేపిటల్స్.. విజయాన్ని అందుకుంది.

సైంధవుడిలా అడ్డుపడ్డ అక్షర్..

ఢిల్లీ కేపిటల్స్ ఓటమిపాలు కావడం ఖాయమనుకున్న మ్యాచ్ అది. చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయల్సిన దశలో ఢిల్లీ ఉండటం, అపార అనుభవం ఉన్న రవీంద్ర జడేజా చేతికి ధోనీ బంతిని అప్పగించడం వంటి పరిణామాలతో ఓటమి లాంఛనప్రాయమేననే అభిప్రాయం వీక్షకుల్లో ఏర్పడింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య చివరి ఓవర్‌ను ఎదుర్కొన్న అక్షర్ పటేల్.. అద్భుతాన్నే ఆవిష్కరించాడు. తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేర్చాడు. ఐపీఎల్-2020 సీజన్‌లో తిరుగు లేదని నిరూపించాడు.

అయిదు బంతుల్లో 23 పరుగులు..

వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అలెక్స్ క్యారీ అవుటైన తరువాత క్రీజ్‌లోకి దిగాడు అక్షర్ పటేల్. పించ్ హిట్టర్‌గా పేరున్నప్పటికీ.. అడపా దడపా మాత్రమే షాట్లు ఆడతాడనే అపవాదూ ఉందనిపై. మరో ఎండ్‌లో ఉన్న శిఖర్ ధావన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు ఢిల్లీ కేపిటల్స్ ఫ్యాన్స్. వారి అంచనాలు తలకిందలను చేస్తూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అక్షర్ పటేల్. తాను ఎదుర్కొన్న అయిదంటే అయిదు బంతుల్లోనే 21 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్ 2,3,5 బంతులను సిక్సర్లుగా మలిచాడు.

ధోనీపై పగ సాధించాడా?

ఈ మ్యాచ్‌ ధోనీ సేన చేతుల్లో నుంచి జారిపోవడానికి ప్రధాన కారణం.. అక్షర్ పటేల్. తన పిడుగుల్లాంటి షాట్లతో ధోనీ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. నాలుగేళ్ల కిందటి తన పగనూ చల్లార్చుకున్నట్టయింది అతనికి. అక్షర్ పటేల్ మూడు బంతుల్లో 18 పరుగులు చేయడం, ఆ 18 పరుగులు కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణం కావడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు ధోనీ తన బౌలింగ్‌లో పిండుకున్న పరుగులను ఈ రూపంలో బదులు తీర్చేసుకున్నాడని అంటున్నారు ఫ్యాన్స్.

ఏంటా నాలుగేళ్ల పగ..

2016 నాటి మాట ఇది. ఫిక్సింగ్ ఆరోపణల మీద చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనీ.. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. అప్పట్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడాడు అక్షర్ పటేల్. ఐపీఎల్-2016 సీజన్‌లో రైజింగ్ ఫుణే ఇన్నింగ్‌లో కింగ్స్ పంజాబ్ తరపున చివరి ఓవర్‌ను వేశాడు అక్షర్ పటేల్. ఆ ఓవర్‌లో ధోనీ నాలుగు సిక్సులను బాదాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే 23 పరుగులను పిండుకున్నాడు. ఆరు బంతుల్లో 23 పరుగులను రాబట్టాడు. ఆ పరుగులతోనే పంజాబ్‌పై పుణే జట్టు ఘన విజయాన్ని సాధించింది.

గుర్తు చేసిన వీరేంద్ర సెహ్వాగ్..

అప్పటి పగను తాజాగా షార్జా స్టేడియంలో అక్షర్ పటేల్ తీర్చుకున్నట్టయిందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి గుర్తు చేశాడు. ఈ మేరకు అతను ఓ ట్వీట్ చేశాడు. నాలుగేళ్ల కిందట ధోనీ విజృంభణకు అక్షర్ పటేల్ బలి అయ్యాడని, ఇప్పుడు అతని మీద ప్రతీకారం తీర్చుకున్నటయిందనీ చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ భఆరీగా పరుగులు సాధించినా.. ఓటమి తప్పకపోవడానికి శిఖర్ ధావన్, అక్షర్ పటేల్ కారణమని అన్నాడు.

English summary
‘Axar Patel Takes His Revenge On MS Dhoni’- Fans On Twitter Go Bonkers As Axar Patel Storms Delhi Capitals To A Last Over Win Against CSK. Axar Patel handed a thrilling victory to DC in the final over by smashing 21 runs off just 5 balls and this got everyone bewildered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X