• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీక్ స్టేజ్‌లో ఐపీఎల్: ప్లేఆఫ్ షెడ్యూల్ ఇదే. ఫైనల్ అక్కడే: లీగ్ దశలో ఇక హైఓల్టేజ్ మ్యాచ్‌లు

|

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ ముగింపు దశకు చేరుకుంటోంది. లీగ్ దశలో ఇంకొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఫస్ట్ ఎలిమినేటర్ ఎవరనేది కూడా తేలిపోయింది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్‌లో తొలి ఎలిమినేటర్‌గా మారింది. ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలగింది. ఇక ఆ జట్టు ఆడబోయేది రెండు మ్యాచ్‌లే. ఈ రెండింటి తరువాత స్వదేశానికి తిరుగుముఖం పడుతుందా జట్టు. లీగ్ దశలో ఇక ప్రతి మ్యాచ్‌ కూడా మరింత ఆసక్తికరంగా మారబోతోంది.

  IPL 2020 Play Off Schedule | Qualifier 1 | Eliminator | Qualifier 2 | IPl 2020 Final

  ఎల్లో ఆర్మీ..అవమానకరంగా: ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్ నుంచి ధోనీసేన అవుట్: తొలి టీమ్‌‌గాఎల్లో ఆర్మీ..అవమానకరంగా: ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్ నుంచి ధోనీసేన అవుట్: తొలి టీమ్‌‌గా

  ప్రతి మ్యాచ్‌కూ ఎలిమినేటర్ ఖాయంగా..

  ప్రతి మ్యాచ్‌కూ ఎలిమినేటర్ ఖాయంగా..

  ఐపీఎల్-2020 టోర్నమెంట్‌లో ప్రతి మ్యాచ్ కూడా ఆయా జట్లకు జీవన్మరణ సమస్యగా మారబోతోన్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ ఎలిమినేటర్ ఎవరనేది తేలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ టోర్నమెంట్‌లో ఏడు టీమ్స్ మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్‌కు చేరబోయేది నాలుగు జట్లే. ప్లేఆఫ్ బెర్తులను ఖాయం చేసుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇలాంటిదే. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి రాజస్థాన్ రాయల్స్.. తెగించి పోరాడింది. విజయాన్ని అందుకుంది.

  అన్నీ హైఓల్టేజ్ మ్యాచ్‌లే..

  అన్నీ హైఓల్టేజ్ మ్యాచ్‌లే..


  ఇక లీగ్ దశలో జరిగే ప్రతి మ్యాచ్ కూడా హైఓల్టేజ్‌గా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడే రెండు మ్యాచ్‌లు కూడా అత్యంత ప్రమాదకరంగా పరిణమించబోతున్నాయి. మరో జట్టు ప్లేఆఫ్ అవకాశాలను ధోనీసేన దెబ్బ కొట్టే ప్రమాదం లేకపోలేదు. చెన్నై, రాజస్థాన్ జట్లు రెండు చొప్పున, మిగిలినవన్నీ మూడు చొప్పన మ్యాచ్‌లను ఆడనున్నాయి. లీగ్ దశ ముగిసిన తరువాత ప్లేఆఫ్ ఆరంభం అవుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) విడుదల చేసింది.

  తొలి మ్యాచ్ దుబాయ్‌లో..ఫైనల్ కూడా అక్కడే..

  తొలి మ్యాచ్ దుబాయ్‌లో..ఫైనల్ కూడా అక్కడే..

  వచ్చేెనెల 5వ తేదీన ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. 5, 6, 8 తేదీల్లో ప్లేఆఫ్స్ నిర్వహిస్తారు. 10వ తేదీన ఫైనల్ ఉంటుంది. ప్లేఆఫ్ దశలో తొలి మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. ఫైనల్‌కు క్వాలిఫై అయ్యే జట్టును తేల్చేసే మ్యాచ్ ఇది. 6న ఎలిమినేటర్, 8న సెకెండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఉంటాయి. 10న దుబాయ్‌లోనే ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తాు. 8న జరిగే సెకెండ్ క్వాలిఫయర్‌లో గెలిచే జట్టు ఫైనల్‌లో తొలి క్వాలిఫయర్ టీమ్‌ను ఢీ కొడుతుంది.

  ఆ రెండు స్టేడియాల్లోనే

  ఆ రెండు స్టేడియాల్లోనే

  ప్లేఆఫ్ దశలో ఏ ఒక్క మ్యాచ్‌ను కూడా షార్జా స్టేడియంలో షెడ్యూల్ చేయలేదు. దీనికి కారణం.. మిగిలిన రెండింటితో పోల్చుకుంటే.. అతి చిన్నది కావడమే. దుబాయ్‌లో తొలి క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించడానికి కారణాలు లేకపోలేదు. ఫైనల్ మ్యాచ్ నిర్వహించే సమయంలో బుర్జ్ ఖలీఫా టవర్‌పై లేజర్ లైటింగ్‌ను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేజర్ లైటింగ్ రూపంలో ఈ టవర్ మీదే ముగింపు ఉత్సవాల వేడుకలను నిర్వహించడం, కొందరు ప్రముఖులు హాజరు కానుండటంతో దుబాయ్ స్టేడియాన్ని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

  English summary
  BCCI have finally revealed the playoffs dates and also the venue for this year's IPL season's finale. Dubai International Stadium will host the final on November 10, whereas Abu Dhabi will host the Eliminator as well as the Qualifier 2 on November 6 and 8 respectively.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X