వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: బ్రాడ్ హాగ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవెన్‌‌లో కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు నో ప్లేస్

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: కరోనా అడ్డంకులను అధిగమించి సూపర్ సక్సెస్ అయిన ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. లీగ్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. అయితే లీగ్ దశలో నిలకడగా రాణించిన ఆటగాళ్లతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఐపీఎల్ 2020 బెస్ట్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను ఎంపిక చేయకుండా హగ్ అందర్ని ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను విస్మరించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. టోర్నీలో పెద్దగా రాణించని ధోనీ, రోహిత్‌లను కూడా హగ్ పక్కన పెట్టేసాడు.

ఓపెనర్లుగా గబ్బర్, మయాంక్
రెండు సెంచరీలతో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర ధావన్, సెంచరీ సాధించిన కింగ్స్ పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌లను తన బెస్ట్ ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. గాయంతో కొన్ని మ్యాచ్‌లకు మయాంక్ దూరమైనా 156.45 స్ట్రైక్‌రేట్‌తో 424 రన్స్ చేశాడు. ఇక ధావన్ 14 మ్యాచ్‌ల్లో 145.02 స్ట్రైక్ రేట్‌తో 525 రన్స్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఒంటి చేత్తో విజయాలందిస్తున్న డేవిడ్ వార్నర్‌ను కూడా హగ్ పక్కనపెట్టేశాడు. 14 మ్యాచ్‌ల్లో 136.69 స్ట్రైక్ రేట్ వార్నర్ 529 రన్స్ చేశాడు.

IPL 2020: Brad Hogg Picks the best Eleven of IPL, KL Rahul and Virat finds no place

ఇక మూడో స్థానంలో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కాదని ముంబై ఇండియన్స్ ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను బ్రాడ్ హగ్ తన టీమ్‌లోకి తీసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 14 మ్యాచ్‌ల్లో 150.18 స్ట్రైక్‌రేట్‌తో 410 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 14 మ్యాచ్‌ల్లో 122.01 స్ట్రైక్ రేట్‌తో 460 రన్స్ చేశాడు. వికెట్ కీపర్‌గా ఏబీ డివిలియర్స్‌ను తీసుకున్న హగ్..ఐదో స్థానంలో ఇయాన్ మోర్గాన్‌ను ఎంచుకున్నాడు. ఏబీడీ 163.78 స్ట్రైక్ రేట్‌తో 398 రన్స్ చేశాడు. ఆల్‌రౌండర్‌గా ముంబై హిట్టర్ హార్దిక్ పాండ్యాను తీసుకున్నాడు.

ఇక జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, జోఫ్రా ఆర్చర్‌లతో తన పేస్‌త్రయాన్ని పూర్తి చేసిన బ్రాడ్ హగ్.. కగిసో రబడాను విస్మరించాడు. ఈ సౌతాఫ్రికా పేసర్ 25 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్‌ను తన టీమ్ స్పిన్నర్లుగా ఎంపిక చేశాడు. టోర్నీలోని ఏడు జట్ల ఆటగాళ్లకి తన టీమ్‌లో చోటిచ్చిన బ్రాడ్ హగ్.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు నుంచి కనీసం ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాతో ఇటీవల ఎంపిక చేసిన భారత్ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు చెలరేగగా.. తన టీమ్‌లో కోహ్లీకి బదులుగా అతనికి చోటిచ్చిన హగ్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాడు.

బ్రాడ్ హగ్ బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్:
శిఖర్ ధావన్ (ఢిల్లీ), మయాంక్ అగర్వాల్ (పంజాబ్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై), ఏబీ డివిలియర్స్ (బెంగళూరు), ఇయాన్ మోర్గాన్ (కోల్‌కతా), హార్దిక్ పాండ్యా (ముంబై), జోప్రా ఆర్చర్ (రాజస్థాన్), రషీద్ ఖాన్ (హైదరాబాద్), మహ్మద్ షమీ (పంజాబ్), జస్‌ప్రీత్ బుమ్రా (ముంబై),చాహల్ (బెంగళూరు)

English summary
Brad Hogg picks the best XI after league stage of IPL 2020; leaves out KL Rahul and Virat Kohli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X