వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతనంటే విరాట్ కోహ్లీకి జ్వరం: సైంధవుడిలా అడ్డు: సన్ రైజర్స్ పేసర్ చేతిలో దారుణ పరాభవం

|
Google Oneindia TeluguNews

అబుధాబి: విరాట్ కోహ్లీ.. బ్యాట్ తిప్పుతూ, కాలర్ ఎగరేస్తూ.. క్రీజ్‌లోకి అడుగు పెట్టాడంటే అవతలి జట్టు బౌలర్లలో వణకు మొదలవుతుంది. అతనికి బంతులను సంధించేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు. ఏ మాత్రం లైన్ అండ్ లెంగ్త్ తప్పినా.. ఆ బాల్ పడేది స్టాండ్స్‌లోొనే. నో డౌట్స్. అద్భుతమైన యార్కర్లను కూడా సిక్సులుగా మలిచిన గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ. మూడు ఫార్మట్ల క్రికెట్‌లోనూ తిరుగులేని ప్లేయర్. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 మ్యాచ్‌లు, టెస్టుల్లో తనదైన ముద్రను వేశాడు. రికార్డులను కొల్లగొడుతున్నాడు.

కోహ్లీకి చెమటలు పట్టించే బౌలర్..

కోహ్లీకి చెమటలు పట్టించే బౌలర్..

అలాంటి విరాట్ కోహ్లీ.. ఓ బౌలర్ కొరుకుడు పడట్లేదు. బౌలర్లకు చుక్కలు చూపించే విరాట్ కోహ్లీకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో చెమటలు పట్టిస్తున్నాడు. ఆ బౌలర్‌ను ఎదుర్కొనలేక విరాట్ కోహ్లీ చేతులెత్తేస్తున్నాడు. అతను ఎదురుపడిన ప్రతీసారీ భారీ షాట్లను ఆడలేకపోతున్నాడు. కోహ్లీని మించిన అనుభవజ్ఙుడా అంటే అదీ కాదు. ఇప్పటిదాకా ఆ బౌలర్ ఒక్క వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను కూడా ఆడలేదు. రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లను ఆడాడంతే.. అది కూడా పసికూన జింబాబ్వే మీద.

ఐపీఎల్‌లో ఏడుసార్లు అవుట్..

ఐపీఎల్‌లో ఏడుసార్లు అవుట్..

అతనే- సందీప్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ తురుఫుముక్క. అండర్ రేటెడ్ ప్లేయర్. వరుసగా రాణిస్తోన్న అతనికి లభించాల్సినంత పేరు గానీ, గుర్తింపు గానీ లభించట్లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్‌ 13వ ఎడిషన్‌లో కూడా సందీప్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లను ఆడిన సందీప్ శర్మ.. 13 వికెట్లను పడగొట్టాడు. 7.34 ఎకానమీని నమోదు చేసుకున్నాడు. 34 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు. ఈ సీజన్ అదే అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.

ఏ బౌలర్‌కూ సాధ్యం కాని విధంగా..

ఏ బౌలర్‌కూ సాధ్యం కాని విధంగా..

విరాట్ కోహ్లీపై ఏ బౌలర్‌కు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు అతని పేరిటే ఉంది. ఐపీఎల్ టోర్నమెంట్లలో ఇప్పటిదాకా ఏడుసార్లు అతను విరాట్ కోహ్లీని బలి తీసుకున్నాడు. ఏ బౌలర్‌ కూడా ఇన్నిసార్లు కోహ్లీని అవుట్ చేయలేదు. అన్ని ఐపీఎల్ సీజన్లకు కలిపి సందీప్ శర్మ నుంచి 50 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ చేసిన పరుగులు 69 మాత్రమే. ఏడుసార్లు తన వికెట్‌ను సమర్పించేసున్నాడు. సందీప్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ యావరేజ్‌గా చేసిన పరుగులు 9.85 మాత్రమే. దీన్ని బట్టి అతను ఏ రేంజ్‌లో విరాట్ కోహ్లీని క్రీజ్‌లో కట్టి పడేశాడో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే ఓ సారి అవుట్..

ఇప్పటికే ఓ సారి అవుట్..

ఇప్పటికే సందీప్ శర్మ బౌలింగ్ దెబ్బ ఎలా ఉంటుందనేది విరాట్ కోహ్లీ చవి చూశాడు ఈ సీజన్‌లోనే. లీగ్ దశలో షార్జా క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సందీప్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన స్కోర్ ఏడే. సందీప్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 120 పరుగులకే ఆలౌట్ కాగా.. అయిదు వికెట్లను కోల్పోయి.. లక్ష్యాన్ని అందుకుంది డేవిడ్ వార్నర్ టీమ్.

మరోసారి ఎదురెదురు..

మరోసారి ఎదురెదురు..

ఈ ఇద్దరూ మరోసారి ఎదురెదురు పడబోతున్నారు. ప్లేఆఫ్‌కు చేరుకున్న ఈ రెండు జట్లూ ఈ సాయంత్రం అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఢీ కొనబోతున్నాయి. ఈ సారి కూడా అందరి దృష్టీ విరాట్ కోహ్లీ, సందీప్ శర్మ ఫైటింగ్ మీదే నిలిచింది. ఎప్పట్లాగే తనకు అలవాటైన రీతిలో విరాట్ కోహ్లీ.. సందీప్ శర్మకు వికెట్‌ను సమర్పించుకుంటాడా? లేక భారీ షాట్లను ఆడి, అతనిపై పైచేయి సాధిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. స్పీడ్ తక్కువతో సందీప్ శర్మ విసిరే గుడ్ లెంగ్త్ బంతులను ఎదుర్కొనడం విరాట్ కోహ్లీకి గగనంలా మారిందంటూ కామెంటేటర్లు సైతం వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

English summary
Sunrisers Hyderabad bowler Sandeep Sharma has got the Royal Challengers captain Virat Kohli in the IPL as Seven times. The most by any bowler. The good-length deliveries from Sharma that have troubled Kohli the most dismissing him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X