• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంపైర్‌ను శాసించిన ధోనీ: వైడ్ సిగ్నల్ ఇవ్వబోయి.. మహీ కోపాగ్నిని చూసి: వణికిన రీఫెల్

|

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సెకెండ్ స్పెల్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టి కరిపించింది. 20 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో నమోదు చేసిన చెన్పై సూపర్ కింగ్స్ ఓటములకు బ్రేక్ పడింది. ఈ టోర్నమెంట్‌లో మరింత ముందుకెళ్లే అవకాశాలను సృష్టించుకుంది.

167 పరుగుల స్కోరును కాపాడిన చెన్నై బౌలర్లు..

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్‌లో ప్రయోగాలు చేసింది. మిడిల్ ఆర్డర్‌లో రావాల్సిన ఆల్‌రౌండర్ సామ్ కుర్రన్‌ను ముందుకు జరిపింది. ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. డుఫ్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించిన కుర్రన్.. ధాటిగా ఆడాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే డుఫ్లెసిస్ అవుట్ అయినప్పటికీ.. కుర్రన్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. 21 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌గా వచ్చిన షేన్ వాట్సన్, మిడిల్ ఆర్డర్‌‌లో అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా రాణించడంతో 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది చెన్నై. ఓ మోస్తరు స్కోరును కాపాడుకోగలిగారు చెన్నై బౌలర్లు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లను 147 పరుగుల వద్దే కట్టడి చేశారు.

అంపైర్‌పై ధోనీ ఫైర్..

సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 11 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన సమయంలో బౌలింగ్ దిగాడు శార్దుల్ ఠాకూర్. 19వ ఓవర్ రెండో బంతిని వైడ్ యార్కర్‌గా వేశాడు. దానితో ఓ పరుగు హైదరాబాద్ స్కోరుబోర్డులో చేరింది. ఆ తరువాతి బంతిని కూడా బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వేయడానికి ప్రయత్నించాడు. అదీ వైడ్ యార్కర్‌గానే మారింది. క్రీజ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రషీద్ ఖాన్ దాన్ని అందుకోలేకపోయాడు. వైడ్ లైన్ మీదుగా వెళ్తోన్న బంతిని ఆడటానికి ప్రయత్నించాడతను. కనెక్ట్ కాలేదు.

వైడ్ సిగ్నల్ ఇవ్వబోయి..

దీనితో స్టెయిట్ అంపైర్ పాల్ రీఫెల్.. ఆ బంతిని వైడ్‌గా ప్రకటించబోయాడు. రెండు చేతులను బార్లా చాపబోయాడు. అదే సమయంలో ధోనీ గట్టిగా అరిచాడు. అది వైడ్ కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వికెట్ల వెనకల నుంచి ధోనీ పిచ్ వద్దకు వచ్చాడు. శార్దుల్ ఠాకూర్‌

అతనితో జత కలిశాడు. అది వైడ్ కాదని చెప్పాడు. దీనితో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వైడ్ సిగ్నల్ ఇవ్వలేదు. నిజానికి- అది వైడ్ బాల్. రీప్లే ఈ విషయం స్పష్టంగా కనిపించింది. వైడ్ బాల్‌ను నిర్ధారించడానికి ఉద్దేశించిన ట్రామ్‌ లైన్‌ అవతలి వైపు నుంచి ఆ బాల్ దూసుకెళ్లడం రీప్లేలో కనిపించింది.

English summary
Another umpiring howler was witnessed during the match between Chennai Super Kings and Sunrisers Hyderabad here on Tuesday. Umpire Paul Reiffel changed his decision and didn't signal a wide ball after CSK captain MS Dhoni expressed his anger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X