వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020 Qualifier 1:ఢిల్లీ సత్తా చాటుతుందా..? మరో సారి ఫైనల్‌కు ముంబై వెళుతుందా..?

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ఓవైపు నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు... మరోవైపు పుష్కర కాలం ప్రయత్నించినా కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరని జట్టు.. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. చరిత్రను కాసేపు పక్కనబెడితే.. ఈ సారి బలం, బలగం ప్రకారం రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. అయితే అనుభవం పరంగా ముంబైకి కాస్త అడ్వాంటేజ్ ఉన్నా.. ఈ సీజన్‌లో ఢిల్లీ ఓ రేంజ్‌లో దూసుకొచ్చింది. మరి ముంబైని ఆపి.. ఫస్ట్ క్వాలిఫయర్‌తోనే టైటిల్ వేటలో కాలుమోపుతుందా? లేక మరో మ్యాచ్ వరకు ఆగుతుందా? చూడాలి!!

కరోనా అడ్డంకులను అధిగమించి సూపర్ సక్సెస్ అయిన ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. లీగ్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకసారి పరాజయం సహా ముంబై జట్టు ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఐదుసార్లు ఫైనల్‌ చేరగా... తొలి సీజన్‌ నుంచి ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌కే పరిమితమైంది. తాజా ఫామ్, బలాబలాలపరంగా చూస్తే ముంబైదే పైచేయిగా కనిపిస్తున్నా... లీగ్‌ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం ఖాయం.

IPL 2020: DC vs MI: Who will race to the finals, here is the Match Preview

ఈ సీజన్‌లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగింది. 14 లీగ్‌ మ్యాచ్‌లలో 8 గెలిచి, 6 ఓడింది. అయితే తొలి 9 మ్యాచ్‌ల్లో 7 గెలిచి ఊపు మీద కనిపించిన టీమ్‌ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన తర్వాత చివరకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ముందంజ వేసింది. ఈ విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యువ, సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌తో ఢిల్లీ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నా, సమష్టిగా సత్తా చాటడంలో విఫలమవుతోంది.

ఓపెనర్‌ ధవన్‌ రెండు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలతో అదిరే ఫామ్‌లో ఉన్నాడు. కానీ యువ ఆటగాళ్లు పృథ్వీ షా, పంత్‌ ఆశించిన మేర ఆడకపోవడం ఢిల్లీకి ఆందోళన కలిగిస్తోంది. ఆరంభంలో భారీ స్కోర్లు చేసిన కెప్టెన్‌ అయ్యర్‌ బ్యాట్‌నుంచి తర్వాతి మ్యాచ్‌ల్లో అవే మెరుపులు కనిపించడంలేదు. ఎట్టకేలకు గత మ్యాచ్‌లో రహానె ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి శుభపరిణామం. బౌలింగ్‌కు సంబంధించి.. పేసర్లు రబాడ, నోకియా, స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. అయితే లీగ్ దశలో ముంబైతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ ఓడిపోయింది. మరీ ఈ మ్యాచ్‌లోనైనా విజయాన్నందుకుంటుందో లేదో చూడాలి.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో లీగ్‌ దశలో తిరుగులేని విజయాలు సాధించిన నాలుగు సార్లు విజేత ముంబై..లీగ్‌ చివరి పోరులో ఆ దూకుడు ప్రదర్శించలేకపోయింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లతో ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్‌లో ప్రధాన పేసర్లు బుమ్రా, బౌల్ట్‌కు విశ్రాంతినిచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక..తొడ కండర గాయంతో నాలుగు పోటీలకు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోలుకొని హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆడడం ముంబైకి సానుకూలాంశం. ఆ మ్యాచ్‌లో విఫలమైన స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ ఢిల్లీతో పోరులో మళ్లీ తన బ్యాటును ఝళిపించాల్సి ఉంటుంది. అటు బ్యాట్స్‌మెన్‌..ఇటు బౌలర్లు సూపర్‌ ఫామ్‌లో ఉండడం ముంబైకి ప్లస్‌ పాయింట్‌.

ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని భారీ స్కోరు అందించగలరు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్‌లపై ప్రధానంగా జట్టు ఆధారపడుతోంది. ఈ ముగ్గురు టోర్నీలో 400కు పైగా పరుగులు సాధించారు. చివర్లో అలవోకగా సిక్సర్లు బాదే పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోతే తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌ల ఎనిమిది ఓవర్లను ఎదుర్కోవడం ఎలాంటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. వీరిద్దరిని మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పేయగల సమర్థులు.

ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై జట్టే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 162 పరుగులు చేయగా... ముంబై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గత శనివారం జరిగిన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ పేలవంగా ఆడి 110 పరుగులు చేయగా, ముంబై 14.2 ఓవర్లలోనే గెలిచింది. ఓవరాల్‌గా 24 సార్లు తలపడగా 14-12తో ముంబై లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో మాత్రం చెరొక మ్యాచ్ గెలిచాయి.

English summary
IPL 2020, Qualifier 1, DC vs MI Preview: Who will win Delhi Capitals vs Mumbai Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X