వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

DC vs SRH : ఈసారైనా సన్ రైజర్స్ బోణీ చేస్తుందా... లేక ఢిల్లీ హ్యాట్రిక్‌ కొడుతుందా..?

|
Google Oneindia TeluguNews

ఐపీఎల్-2020లో భాగంగా మంగళవారం(సెప్టెంబర్ 29) ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అబుదాబీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయం కోసం ఢిల్లీ.. సీజన్‌లో బోణీ కొట్టేందుకు హైదరాబాద్ బరిలో దిగుతున్నాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ అట్టడుగున ఉన్నా... గత ట్రాక్ రికార్డు ప్రకారం ఢిల్లీపై హైదరాబాద్‌దే పైచేయి. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 15 సార్లు తలపడగా.... ఇందులో 9 సార్లు సన్ రైజర్స్ విజయం సాధించింది. ఢిల్లీ జట్టు 6 సార్లు మాత్రమే విజయం సాధించింది.

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ-సన్ రైజర్స్ మధ్య ఇప్పటివరకూ 14 మ్యాచ్‌లు భారత్‌లో జరగ్గా... ఒక మ్యాచ్ యూఏఈలో జరిగింది. ఆ ఒక్క మ్యాచ్‌లో‌నూ ఢిల్లీపై సన్ రైజర్సే గెలుపొందింది. అయితే ఈ రెండు జట్ల మధ్య గత ఏడాది జరిగిన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీనే పైచేయి సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల తేడాతో ఢిల్లీ చేధించింది. ఆ మ్యాచ్‌లో రిషబత్ రెండు ఫోర్లు,ఐదు సిక్సులతో చెలరేగి ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు.

IPL 2020 DC Vs SRH Preview Delhi eye on hattrick srh yet to register a win

ఢిల్లీపై ఇప్పటివరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ యావరేజ్ స్కోర్ 146 కాగా... సన్ రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ యావరేజ్ స్కోరు 154. ఐపీఎల్‌లో ఢిల్లీ తరుపున అత్యధిక పరుగులు(328) చేసిన ఆటగాడు రిషబ్ పంత్ కాగా... సన్ రైజర్స్ తరుపున డేవిడ్ వార్నర్ 329 పరుగులతో ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక ఢిల్లీ తరుపున అత్యధిక వికెట్లు(6) తీసింది అమిత్ మిశ్రా కాగా... సన్ రైజర్స్ తరుపున భువనేశ్వర్ 11 వికెట్లతో టాప్ బౌలర్‌గా ఉన్నాడు.

ప్రస్తుత ఐపీఎల్‌లో గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి ఢిల్లీ మంచి ఊపు మీద ఉన్నది. యువ ఆటగాడు పృథ్వీ షా ఆ మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌తో 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు,మొదటి మ్యాచ్‌లోనూ సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ మంచి విజయాన్ని నమోదు చేసింది.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తమ గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఓటమిపాలైంది. సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు,మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీపై 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడిపోయింది. అయితే సన్ రైజర్స్ జట్టులో వార్నర్,మనీష్ పాండే,సాహా,బెన్ స్టో రూపంలో మంచి హిట్టర్స్ ఉండటంతో తమదైన రోజున ఆ జట్టు మ్యాజిక్ చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వరుస ఓటముల నేపథ్యంలో ఈసారైనా రైజర్స్ బోణీ కొడుతుందా లేక ఢిల్లీ హ్యాట్రిక్‌కి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి.

English summary
ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ-సన్ రైజర్స్ మధ్య ఇప్పటివరకూ 14 మ్యాచ్‌లు భారత్‌లో జరగ్గా... ఒక మ్యాచ్ యూఏఈలో జరిగింది. ఆ ఒక్క మ్యాచ్‌లో‌నూ ఢిల్లీపై సన్ రైజర్సే గెలుపొందింది. అయితే ఈ రెండు జట్ల మధ్య గత ఏడాది జరిగిన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీనే పైచేయి సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల తేడాతో ఢిల్లీ చేధించింది. ఆ మ్యాచ్‌లో రిషబత్ రెండు ఫోర్లు,ఐదు సిక్సులతో చెలరేగి ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X