వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిస్నీస్టార్‌కు కోట్ల రూపాయలను గుమ్మరించిన ఐపీఎల్-2020: నెలన్నర రోజుల్లో దిమ్మతిరిగే ఆదాయం

|
Google Oneindia TeluguNews

ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నెలన్నర రోజుల పాటు కొనసాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 మ్యాచ్‌లు.. అఫీషియల్ బ్రాడ్ క్యాస్టర్‌ డిస్నీ స్టార్ ఇండియాకు కనక వర్షాన్ని కురిపించాయి. కోట్ల రూపాయలను గుమ్మరించాయి. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకపోయినప్పటికీ.. టికెట్ల ద్వారా ఆదాయం రాకపోయినప్పటికీ.. దిమ్మ తిరిగే ఆదయాాన్ని ఆర్జించిందా బ్రాడ్ క్యాస్టర్. టికెట్లను విక్రయించి ఉంటే.. ఈ ఆదాయం మరింత పెరిగి ఉండేది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి స్టేడియాల్లో ప్రేక్షకుల ఎంట్రీని నిషేధించారు.

ఐపీఎల్ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయడం ద్వారా డిస్నీ స్టార్ ఇండియాకు 2,500 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ మొత్తాన్ని ఆర్జించింది. టీవీల్లో అడ్వర్టయిజ్‌మెంట్లను ప్రసారం చేయడం ద్వారా 2,250 కోట్ల రూపాయలు, హాట్‌స్టార్ ద్వారా మరో 250 కోట్ల రూపాయల ఆదాయం ఈ బ్రాడ్ క్యాస్టర్‌కు సమకూరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ టాప్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్-2019తో పోల్చుకుంటే.. ఈ సారి వచ్చిన ఆదాయం మరింత ఎక్కువ.

IPL 2020 : Disney Star India generates Rs 2500 Cr revenue from advertising

ఐపీఎల్-2019లో 2,200 కోట్ల రూపాయలు ఆ బ్రాడ్ క్యాస్టర్‌కు రాగా ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగింది. 300 కోట్ల రూపాయలను అదనంగా ఆర్జించింది. టోర్నమెంట్ ఆరంభానికి ముందే 18 స్పాన్సర్లతో ఎండార్స్‌మెంట్ పొందింది డిస్నీ స్టార్ ఇండియా. మొత్తంగా 117 వాణిజ్య ప్రకటలను ప్రసారం చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డ్రీమ్-11, ఫోన్‌ పే, బైజూస్, వీఐ, అమేజాన్ కో స్పాన్సర్లతో పాటు ఐటీసీ ఫుడ్స్, పాలీక్యాబ్, డయాజియో, పీ అండ్ జీ, కోకా కోలా, హీరో, ఫేస్‌బుక్, కేపీ గ్రూప్, డైలీహంట్, సామ్‌సంగ్, క్రెడ్, ఏఎంఎఫ్ఐ వంటి అసోసియేట్ స్పాన్సర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Recommended Video

IPL 2020 Final : I Should've Sacrificed My Wicket For In-Form Suryakumar Yadav - Rohit Sharma

కరోనా వైరస్ వల్ల స్టేడియాల్లో ప్రేక్షకులను అనుమతించకపోవడం, భారత్‌లో టోర్నమెంట్‌ను నిర్వహించకపోవడం వల్ల ఈ జారి వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. 2019 ఐపీఎల్ సీజన్ కంటే కూడా ఈ సారి వ్యూవర్‌షిప్ భారీగా నమోదైంది. అంచనాలకు మించిన వ్యూవర్‌షిప్ లభిచందని డిస్నీస్టార్ యాజమాన్యం అంచనా వేసినట్లు ఆ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు వేసిన అంచనాలకు మించి 25 శాతం అధికంగా వ్యూవర్‌షిప్‌ను నమోదు చేసినట్లు అఫీషియల్ బ్రాడ్ క్యాస్టర్ వెల్లడించినట్లు తెలిపింది. దానికి అనుగుణంగా ఆదాయం కూడా పెరిగినట్లు అంచనా వేసింది.

English summary
The 13th edition of the Indian Premier League (IPL 2020) has generated 2500 Cr of advertising revenues for Star India (Both Television and Hotstar combine) according to various industry experts and sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X