వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ఈ కోచ్‌లే అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ అందించారు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఆల్‌రౌండ్ ‌షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్‌కు ఇది ఓవరాల్‌గా ఐదో ఐపీఎల్ కప్ కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించడం విశేషం. యూఏఈలో అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్‌లో నిర్వహించిన ఈ లీగ్.. గత సీజన్లతో పోలిస్తే విజయవంతమైంది.

ఐపీఎల్ 13వ సీజన్‌ ఆసాంతం అంచనాలకు మించి అలరించిన ఆటగాళ్లు అవార్డులను దక్కించుకున్నారు. వీరందరికీ నగదు బహుమతి అందజేశారు. మరోవైపు ఐపీఎల్ టోర్నీలో ఓ జట్టు టైటిల్ సాధించాలంటే.. కోచ్ పాత్ర ఎంతో కీలకం. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ టైటిల్స్ గెలిచిన కోచ్‌ల జాబితాను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్ధనే, చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. జయవర్ధనే, ఫ్లెమింగ్ ఖాతాలో మూడు టైటిల్స్ ఉన్నాయి. ట్రెవర్ బేలిస్ (2-కేకేఆర్), షేన్ వార్న్ (1-ఆర్‌ఆర్), డారెన్ లెమాన్ (1-డెక్కన్), జాన్ రైట్ (1-ముంబై), రికీ పాంటింగ్ (ముంబై), టామ్ మూడీ (ఎస్‌ఆర్‌హెచ్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

IPL 2020: Do you know the coaches who have won the most IPL finals?

కోచ్‌ల జాబితా:

మహేళ జయవర్ధనే (3-ముంబై)

స్టీఫెన్ ఫ్లెమింగ్ (3-సీఎస్కే)

ట్రెవర్ బేలిస్ (2-కేకేఆర్),

షేన్ వార్న్ (1-ఆర్‌ఆర్),

డారెన్ లెమాన్ (1-డెక్కన్),

జాన్ రైట్ (1-ముంబై),

రికీ పాంటింగ్ 1-(ముంబై),

టామ్ మూడీ (1-ఎస్‌ఆర్‌హెచ్)

ఐపీఎల్ విజేతల జాబితా:

ఎమర్జింగ్‌ ప్లేయర్ ‌(రూ.10లక్షలు): దేవ్‌దత్‌ పడిక్కల్‌ (బెంగళూరు)

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్ ‌(రూ.10లక్షలు): జోఫ్రా ఆర్చర్‌ (రాజస్థాన్‌)

సూపర్‌ స్ట్రైకర్ ‌(రూ.10లక్షలు): పొలార్డ్ ‌(ముంబై)

మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్ ‌((రూ.10లక్షలు): ట్రెంట్‌ బౌల్ట్‌ (ముంబై)

పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్ ‌(రూ.10లక్షలు): ట్రెంట్‌ బౌల్ట్ ‌(ముంబై)

పర్పుల్‌ క్యాప్‌ (రూ.10లక్షలు, అత్యధిక వికెట్లు): రబాడ (ఢిల్లీ)

ఆరెంజ్‌ క్యాప్‌ (రూ.10లక్షలు, అత్యధిక పరుగులు): కేఎల్‌ రాహుల్‌ (పంజాబ్‌)

ఫెయిర్‌ ప్లే అవార్డు (రూ.10లక్షలు): ముంబై ఇండియన్స్‌

గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ద సీజన్ (రూ.10లక్షలు)‌: రాహుల్‌ (పంజాబ్‌)

అత్యధిక సిక్సర్లు (రూ.10లక్షలు): ఇషాన్‌ కిషన్ ‌(ముంబై)

English summary
IPL 2020: Here is the list of Team Coaches winning most IPL final. Mumbai Indians and Chennai Super Kings Coaches Mahela Jayawardene, Stephen Fleming in top list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X