వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MI vs DC:ఆ ప్లేయర్లను వదులుకున్న ముంబై.. ఇప్పుడు వారే టైటిల్ ఫేవరెట్స్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరింది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్‌లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఫస్ట్ టైమ్ ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ఫైనల్ ముంగిట ముంబై ఇండియన్స్‌ను 'రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)'సెంటిమెంట్ కలవరపెడుతుంది. అదేంటంటే.. ఆర్‌సీబీ వదులుకున్న ఆటగాళ్లు ఆ మరుసటి సీజన్‌లో తాము ప్రాతినిథ్యం వహించిన జట్లకు టైటిళ్లు అందించారు.

అవును.. 2017లో షేన్ వాట్సన్‌ను కోహ్లీసేన వదిలించుకోగా.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆ సీజన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌తో జరిగి ఫైనల్లో సూపర్ సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. 2018లో క్వింటన్ డికాక్‌ను ఆర్‌సీబీ వదులుకో.. 2019లో ముంబై తరఫున బరిలోకి దిగిన ఈ సౌతాఫ్రికా క్రికెటర్ సూపర్ పెర్ఫామెన్స్‌తో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

IPL 2020 Finals:Players given up by MI performing well for other teams, a worry for Rohit team

ఇక 2019లో బెంగళూరు మార్కస్ స్టోయినిస్, హెట్‌మైర్‌లను రిలీజ్ చేయగా.. ఆ ఇద్దరు ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆడుతూ ఆ జట్టును ఫైనల్‌కు చేర్చారు. గత రెండు సీజన్లు మాదిరే ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ముంబైకి ఓటమి తప్పదు. ఈ సెంటిమెంటే కాకుండా లీప్ ఇయర్ సెంటిమెంట్ కూడా ముంబైని కలవరపెడుతుంది. ప్రతీ లీప్ సంవత్సరంలో ఐపీఎల్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. ప్రారంభ సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ అందుకోగా.. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్.. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా చాంపియన్లుగా నిలిచాయి. ఈ లెక్కన 2020లో ఢిల్లీ తొలి టైటిల్ ముద్దాడాలి. ఈ లెక్కలన్నీ సరిచేస్తూ ముంబై టైటిల్ నిలబెట్టుకుంటుందా? లేక ఢిల్లీకి దాసోహం అవుతుందా? ఏం జరుగుతుందో చూడాలి.!

English summary
Royal Challengers Bangalore (RCB)' sentiment upsets Mumbai Indians ahead of final against Delhi Capitals. Players who quit RCB presented titles to the teams they represented the following season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X