వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL చరిత్రలో అత్యధిక డకౌట్ల టాప్ టెన్ జాబితా...రోహిత్ శర్మ స్థానం ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది ఐపీఎల్‌ చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఒకటి రెండు మ్యాచులు వన్‌సైడ్‌ వార్ అన్నట్లుగానే కొనసాగగా మరికొన్ని మ్యాచులు మాత్రం టీవీలో చూస్తున్న ప్రేక్షకులను చివరి బాల్ వరకు అలాగే కూర్చోబెట్టాయి. అంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఐపీఎల్ అంటేనే సిక్సులు, బౌండరీలు, రికార్డులు రివార్డులు. ఎప్పటిలాగే ఈ సీజన్‌ కూడా అదే ఊపుతో కొనసాగుతోంది. ఎన్నో రికార్డులు ఈ ఐపీఎల్‌లో నమోదయ్యాయి. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే అందులో అత్యధికంగా డకౌట్లు అయిన 10 మంది బ్యాట్స్‌మెన్ గురించి తెలుసుకుందాం.

రికార్డులకు కేరాఫ్‌గా ఐపీఎల్

రికార్డులకు కేరాఫ్‌గా ఐపీఎల్

గత 12 ఏళ్లుగా ఐపీఎల్ క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. తొలి బంతి నుంచి చివరి బంతి వరకు మిస్ కాకుండా ప్రేక్షకులు ఈ సారి ఐపీఎల్‌ను తిలకిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా ఈ క్యాష్ రిచ్ గేమ్ నిలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 8 జట్లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ముందుగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు అన్ని జట్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయి. ఆ తర్వాత ఫైనల్స్‌లో గెలిచి టైటిల్ కొట్టాలని భావిస్తాయి. ఇక టీట్వంటీ అంటేనే పరుగులు వికెట్లు. 20 ఓవర్లలో ఏ రకంగా బ్యాట్స్‌మెన్ విధ్వంసాన్ని సృష్టిస్తారో తెలుస్తుంది. అదే సమయంలో వారి విధ్వంసానికి అడ్డుకట్ట బౌలర్లు ఏ విధంగా వేస్తారో చూడటం మజా అనిపిస్తుంది.

పరుగులు రాబట్టే క్రమంలో డకౌట్లు

పరుగులు రాబట్టే క్రమంలో డకౌట్లు

ఇక ఐపీఎల్‌లో చాలామంది బ్యాట్స్‌మెన్‌లు బాగా ఆడారు. కొందరైతే అట్టర్ ఫ్లాప్ అయ్యారు. భారీగా వారిపై ఫ్రాంచెజీలు వెచ్చించి కొనుగోలు చేయగా వారు మాత్రం పేలవమైన ప్రదర్శన ఇస్తున్నారు. ఇలాంటి వారిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే పరుగులు రాబట్టే క్రమంలో డకౌట్‌గా వెనుదిరుగుతున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో చాలామంది బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు అదే సమయంలో డకౌట్లుగా నిలిచిన వారూ లేకపోలేదు. అలాంటి వారిలో అజింక్యా రహానే, రోహిత్ శర్మ, గౌతం గంభీర్, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఆరోన్ ఫించ్‌లాంటి టాప్ ప్లేయర్లు ఎక్కువ సార్లు డకౌట్ అయిన టాప్ 20 బ్యాట్స్‌మెన్ జాబితాలో ఉన్నారు. అయితే టాప్ టెన్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

డకౌట్ల అగ్రస్థానంలో హర్భజన్

డకౌట్ల అగ్రస్థానంలో హర్భజన్


విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, ఏబీ డెవీలియర్స్, యువరాజ్ సింగ్, లాంటి స్టార్ ప్లేయర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరు కూడా పలుమార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే ఎక్కువ సార్లు డకౌట్ అయిన టాప్ టెన్ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐపీఎల్‌కు ఆడే విదేశీ ఆటగాళ్లు ఎవరూ లేరనేది ఇక్కడ ఆసక్తికర విషయం. ఇక ఐపీఎల్‌లో 13 సార్లు అత్యధికంగా డకౌట్‌ అయి అగ్రస్థానంలో నిలిచాడు హర్భజన్ సింగ్. ప్రస్తుతం 12 సార్లు డకౌట్ అయి ఏడవ స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ. ఇక పార్థివ్ పటేల్ 13 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో నిలిచాడు. ఆపై మనీష్ పాండే అంబటి రాయుడు, గౌతం గంభీర్‌లు వరుసగా 4వ స్థానం, 5వస్థానం, 6వ స్థానంలో నిలిచారు. వీరంతా 12 సార్లు డకౌట్‌ అయ్యారు. మూడవ స్థానంలో పీయూష్ చావ్లా ఉండగా 11 సార్లు డకౌట్ అయి అజింక్యా రహానే 8వ స్థానంలో ఉన్నాడు. 10 సార్లు డకౌట్ అయి అమిత్ మిశ్రా 9వ స్థానంలో ఉండగా ... 10 సార్లు డకౌట్ అయి 10వ స్థానంలో నిలిచాడు మన్‌దీప్

English summary
In IPL there is no overseas batsman who found place in the most number of duck outs list. Harbhajan stood first in the list with 13 times duck to his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X