వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020 :ప్లే ఆఫ్స్ రేసులో ఎప్పుడూ ఇలా జరగలేదు..13 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సక్సెస్‌ఫుల్‌గా స్టార్టై.. తుది దశకు కూడా చేరుకుంది. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ 13 ఏళ్ల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు 8 మ్యాచ్‌లు గెలిస్తే ముందడుగు వేసిన జట్లు.. ఈ సారి 7 విజయాలతోనే సరిపెట్టుకున్నాయి. ఒక టీమ్‌కు మించి మరో జట్టు అద్భుత విజయాలందుకోవడంతో టోర్నీ రేసులో నిలిచే జట్లు ఏవో ఆఖరి మ్యాచ్ వరకు
చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్ ఫలితంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఇతర జట్ల భవితవ్యం తేలనుంది.

ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ మాత్రమే 18 పాయింట్లతో ప్లేఆఫ్‌కి అర్హత సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్లేఆఫ్ రేసు నుంచి ఎప్పుడో వైదొలిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ని ఓడించి.. తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది. ఇక ఆ తర్వాత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఆ జట్టుని ఇంటిబాట పట్టించి తన ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. దాంతో.. పంజాబ్, చెన్నై, రాజస్థాన్ రూపంలో మూడు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూపంలో నాలుగు జట్లు మిగిలిన మూడు ప్లేఆఫ్ బెర్తుల కోసం పోటీపడనున్నాయి.

IPL 2020: Here is the scenario after RR and KingsXI Punjab exit

అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు జరిగే మ్యాచ్‌‌లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది.
ఓడిపోయిన జట్టు కూడా రేసులో ఉన్నప్పటికీ.. మంగళవారం జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఫలితంపై ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే.. ఆ జట్టు మూడో స్థానంలో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అవుతుంది. అప్పుడు కోల్‌కతా, ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్‌లో ఓడిన జట్టు నాలుగో బెర్తు కోసం పోటీపడనున్నాయి. ఈ రెండింటిలో మెరుగైన రన్‌రేట్‌ ఏ జట్టుకి ఉంటే అది ప్లేఆఫ్‌కి చేరుంది. ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం ముంబై చేతిలో ఓడితే మాత్రం కోల్‌కతా, ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్‌లో ఓడిన జట్టు కూడా సులువుగా ప్లేఆఫ్‌‌కు చేరుకుంటాయి.

ఇక సోమవారం జరిగే ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్‌లో ఇరు జట్లు 20 పరుగుల వ్యత్యాసంతో ఓడవద్దు. ఆఖరి బంతి వరకు పోటీనిస్తే మెరుగైన రన్‌రేట్‌తో ఇరు జట్లకు అవకాశం ఉంటుంది. అప్పుడు సన్‌రైజర్స్ గెలిచినా.. కోల్‌కతా ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. 13 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచిన ఆర్‌సీబీ, ఢిల్లీ, కేకేఆర్ వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ గెలిస్తే మెరుగైన రన్ రేట్ కారణంగా మూడో స్థానానికి వెళ్తుంది. అప్పుడు బెంగళూరు- ఢిల్లీ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు కోల్‌కతా‌ మధ్య పోటీ నెలకొంటుంది. కాబట్టి ప్రస్తుతం కేకేఆర్ కన్నా మెరుగ్గా ఉన్న బెంగళూరు, ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో ఫలితాన్ని ఆఖరి బంతి వరకు తీసుకెళ్తే ఇరు జట్లకు అవకాశం ఉంటుంది.

English summary
The excitement for the playoffs qualification in the Indian Premier League (IPL) 2020 continues as four teams are still fighting out for three spots despite only two matches left to be played
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X