వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లేఆఫ్ సీన్ ఇదీ: మూడు జట్ల భవిష్యత్ సన్‌రైజర్స్ చేతిలో: డెసిషన్ మేకర్‌గా: ఇక నెట్ రన్‌రేట్

|
Google Oneindia TeluguNews

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో మరో అంకం ఆదివారం నాటితో ముగిసింది. ఒకే రోజు మూడు జట్లు ప్లేఆఫ్ రేస్ నుంచి అవుట్ అయ్యాయి. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితేమిటనేది ఇదివరకే స్పష్టంకాాగా.. ఆ జట్టు చేతిలో ఓడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్..కోల్‌కత నైట్ రైడర్స్ దెబ్బకు మట్టి కరిచిన రాజస్థాన్ రాయల్స్.. తమ చివరి మ్యాచ్‌లను ఆడేశాయి. టోర్నమెంట్ నుంచి వైదొలిగాయి. ఇక మిగిలినవి అయిదు జట్లు. ప్లేఆఫ్ వెళ్లాల్సింది నాలుగు టీమ్‌లే. ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడే ఆ ఒక్కటీ ఏదనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది.

Recommended Video

IPL 2020 Playoffs Race : MI Spot Confirmed But Top-Four Race Wide Open | CSK VS KKR
ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య..

ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య..

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వం వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సాయంత్రం తలపడబోతున్నాయి. ఈ రెండింట్లో ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంటుంది. ఈ రెండింటి అకౌంట్‌లో 14 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్ చేరడానికి ఇంకో రెండు పాయింట్లు అవసరం. ఆ రెండు పాయింట్ల కోసం ఈ సాయంత్రం పోరాడబోతున్నాయి. గెలిచిన టీమ్.. ఎలాంటి ఈక్వేషన్లు లేకుండా నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. ఓడిన టీమ్‌కు ఇప్పటికిప్పుడు ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

సన్ రైజర్స్ గెలిస్తే..

సన్ రైజర్స్ గెలిస్తే..

ప్లేఆఫ్‌లో నిలవాలీ అంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో మంగళవారం ఆడబోతోంది వార్నర్ సేన. అన్ని విభాగాల్లోనూ తన కంటే బలమైన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సీజన్‌ లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. ఇందులో గెలిస్తే సన్ రైజర్స్ ప్లేఆఫ్ రేస్‌లో నిలుస్తుంది. అదే సమయంలో ఢిల్లీ కేపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆ జట్లు సాధించే నెట్ రన్‌రేట్ ప్రభావం చూపుతుంది.

హైదరాబాద్ గెలుపు.. నెట్ రన్‌రేట్..

హైదరాబాద్ గెలుపు.. నెట్ రన్‌రేట్..

హైదరాబాద్ టీమ్ భారీ తేడాతో గెలిచి.. తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరచుకోగలిగితే.. దానివల్ల ప్లేఆఫ్ రేస్ నుంచి వైదొలగే ప్రమాదాన్ని ఢిల్లీ కేపిటల్స్ లేదా రాయల్ ఛాలెంజర్స్, నైట్ రైడర్స్‌ ఎదుర్కొంటాయి. సన్ రైజర్స్ గెలవడం, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిపోయే జట్టు సాధించే నెట్ రన్‌రేట్.. ప్లేఆఫ్‌లోని 3, 4 స్థానాలను ఖాయం చేస్తుంది. ఈ 3, 4 స్థానాల కోసం ఢిల్లీ లేదా బెంగళూరు, కోల్‌కత, హైదరాబాద్ పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ ఓడితే... ఈక్వేషన్లతో పెద్దగా పని ఉండదు. కోల్‌కతకు దారి ఇచ్చినట్టవుతుంది.

ఇదీ ఈక్వేషన్..

ఇదీ ఈక్వేషన్..

ఉదాహరణకు- గేమ్-1లో ఢిల్లీ కేపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి..160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిదనుకుంటే.. 21 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించాల్సి ఉంటుంది. లేదా తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్దేశించే 160 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. గేమ్-2లో హైదరాబాద్ జట్టు ముంబైపై విజయాన్ని సాధించితే.. కోల్‌కత నైట్ రైడర్స్ ప్లేఆఫ్ నుంచి వైదొలగుతుంది. ముంబై ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ ఓడిపోతే..ఈక్వేషన్లతో పెద్దగా పని ఉండదు. హైదరాబాద్ కంటే రెండు పాయింట్లు ఎక్కువే సాధించిన కోల్‌కత ప్లేఆఫ్ చేరుకుంటుంది.

English summary
Kolkata Knight Riders' emphatic 60-run win has pushed them close to qualification, while the result margin of the Delhi Capitals-Royal Challengers Bangalore game on Monday becomes hugely important. How Sunrisers Hyderabad can make the IPL playoffs in IPL 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X