• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధోనీ ఏజ్ బార్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కామెంట్స్: భజ్జీకి తగిలిన సెగ: నిజం బయటికి

|

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొంటోన్న వరుస ఓటములు.. విమర్శకుల నోళ్లకు పని చెప్పాయి. టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వైపు వేళ్లు లేస్తున్నాయి. ఈ పరాజయాలకు అతణ్నే బాధ్యుడిని చేస్తున్నాయి. ధోనీలో చురుకుదనం తగ్గిందని కొందరంటోంటే.. అది వయస్సు మళ్లడం ద్వారా వచ్చిందంటూ తాళింపులు వేస్తున్నారు. ధోనీ అలసిపోతున్నాడని, ఇంతకుముందులా చురుకైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నాడనీ అంటున్నారు. ఘాటుగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

వయస్సు నంబర్ మాత్రమే..

వయస్సు నంబర్ మాత్రమే..

ఈ పరిస్థితుల్లో ధోనీకి మద్దతుగా నిలిచాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ధోనీకి వయస్సు పెరిగిందనే మాట నిజమే అయినప్పటికీ.. అది అతని గేమ్‌ను ఏ మాత్రం ప్రభావం చూపబోదని అన్నారు. ఈ మేరకు అతను ఓ ట్వీట్ చేశాడు. ఎక్కడా ధోనీ పేరు ఎత్తలేదు. శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ డీహైడ్రేషన్‌కు గురి కావడాన్ని ఆధారంగా చేసుకుని ఇర్ఫాన్ పఠాన్ ఈ ట్వీట్ చేశాడు. కొందరికి వయస్సు పెరగడం అనేది కేవలం ఓ నంబర్ మాత్రమేనని చెప్పాడు. అదే వయస్సు.. మరికొందరికి జట్టులో చోటు కోల్పోవడానికి కారణమైందని వ్యాఖ్యానించాడు.

హర్భజన్‌ ఆగ్రహానికి కారణం..

హర్భజన్‌ ఆగ్రహానికి కారణం..

అతను ఈ ట్వీట్‌.. హర్భజన్ సింగ్‌కు మంటెక్కించినట్టుంది. వెంటనే రిప్లయ్ ఇచ్చాడు. ఇర్పాన్ పఠాన్‌తో తాను 10000000 శాతం ఏకీభవిస్తున్నానని చెప్పుకొచ్చాడు. సెటైర్లు వేశాడు. హర్భజన్ సింగ్‌కు ఆగ్రహం తెప్పించడానికి కారణం లేకపోలేదు. హర్భజన్ సింగ్ టీమిండియాకు ఆడట్లేదు. అలాగనీ రిటైర్‌మెంట్‌నూ ప్రకటించలేదు. 2016లో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యాన్ని వహించాడు భజ్జీ. ఆ తరువాత జట్టులో చోటు కోల్పోయాడు. యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్ వంటి యువ స్పిన్నర్లతో టీమిండియా మొత్తం నిండిపోయింది. వారు ఎక్కడా నిరాశ పర్చట్లేదు. నిలకడగా రాణిస్తున్నారు.

ఇర్ఫాన్‌తో ఏకీభవిస్తున్నానంటూ సెటైర్లు..

ఇర్ఫాన్‌తో ఏకీభవిస్తున్నానంటూ సెటైర్లు..

స్పిన్ విభాగం బలంగా ఉండటంతో హర్భజన్ సింగ్‌కు పిలుపు రాలేదు. అయినప్పటికీ.. ఈ పంజాబ్ టర్బొనేటర్ నిరాశ చెందట్లేదు. జట్టులో చోటు దక్కుతుందనే ఆశతో ఉన్నాడు. ఆ దిశగా కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో అతను సభ్యుడు. ఈ సీజన్‌లో ఆడట్లేదు. వయస్సు పెరిగిందనే కారణంతోనే కొందరికి జట్టులో చోటు దక్కలేదంటూ ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్స్.. తనను ఉద్దేశించినట్టుగా హర్భజన్ సింగ్ భావించాడు. అందుకే- ఇర్ఫాన్ పఠాన్‌తో తాను 10000000 శాతం ఏకీభవిస్తున్నానని సెటైర్లు వేశాడు.

కారణం అది కాదంటూ.. వివరణ..

కారణం అది కాదంటూ.. వివరణ..

ఇర్ఫాన్ పఠాన్ కూడా జట్టులో చోటు కోల్పోవడానికి అదే వయస్సు కారణమైందని పరోక్షంగా చురకలు అంటించినట్టయింది. తనకు వయస్సు మితిమీరిందనే కారణంతో సెలెక్టర్లు తనను టీమిండియా ఎంపిక చేయట్లేదని తాను అనుకోవట్లేదని హర్భజన్ సింగ్ చెప్పాడు. చాలాకాలంగా తాను డొమెస్టిక్ క్రికెట్‌ను ఆడట్లేదని చెప్పాడు. నాలుగైదేళ్లుగా తాను ఐపీఎల్‌లో మెరుగ్గా రాణిస్తున్నానని, వికెట్లను పడగొడుతున్నానని అన్నాడు. నిజంగా వయస్సు పెరిగిన ప్రభావం తన మీద ఉండి ఉంటే.. ఐపీఎల్‌లో ఎలా ఆడగలుగుతున్నానని చెప్పాడు.

English summary
Former India cricketer Irfan Pathan and Harbhajan Singh’s latest tweets are raising a number of eyebrows with fans suggesting that both of them took a dig at MS Dhoni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X