• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు ధోనీ భార్య ఎమోషనల్ మెసేజ్: ఇట్స్ జస్ట్ ఎ గేమ్..

|

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అవమానకరంగా వెనుదిరుగుతోంది. ప్లేఆఫ్ దశకు చేరే అవకాశాలను కోల్పోయిన ధోనీ సేన.. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తరువాత స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోంది. ఇప్పటికే ఆ జట్టు 12 మ్యాచ్‌లను ఆడింది. ఇక రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండింట్లోనూ విజయం సాధించినప్పటికీ.. ఫలితం ఉండదు. ప్లేఆఫ్ ద్వారాలు మూసుకుపోయాయి ధోనీసేనకు.

పీక్ స్టేజ్‌లో ఐపీఎల్: ప్లేఆఫ్ షెడ్యల్ ఇదే. ఫైనల్ అక్కడే: లీగ్ దశలో ఇక హైఓల్టేజ్ మ్యాచ్‌లుపీక్ స్టేజ్‌లో ఐపీఎల్: ప్లేఆఫ్ షెడ్యల్ ఇదే. ఫైనల్ అక్కడే: లీగ్ దశలో ఇక హైఓల్టేజ్ మ్యాచ్‌లు

ధోనీ అభిమానులకు పెను విషాదం..

మూడుసార్లు టైటిల్ విజేతగా, అయిదుసార్లు రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ప్లేఆఫ్ రేస్‌ నుంచి అవుట్ కావడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో ఆడిన ప్రతీసారీ ధోనీసేన ప్లేఆఫ్‌కు చేరుకుంది. 2010, 2011, 2018ల్లో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. 2008, 2012, 2013, 2015, 2019ల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి ఆ పరిస్థితులు లేవు. ఇప్పటిదాకా డజను మ్యాచ్‌లను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. ఎనిమిదింట్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఎనిమిది పాయింట్లే. చివరి రెండు మ్యాచ్‌లల్లో గెలిచినా ప్లేఆఫ్‌కు చేరుకోలేదు.

 షాక్‌లో ధోనీ ఫ్యాన్స్..

షాక్‌లో ధోనీ ఫ్యాన్స్..


తాము ప్రాణప్రదంగా భావించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్ దశకు చేరుకోకుండానే వైదొలగడం మహేంద్రసింగ్ ధోనీ అభిమానులను విషాదంలో ముంచెత్తింది. దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. చెన్నై టీమ్ అభిమానులు ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోవట్లేదు. టోర్నమెంట్ ఆరంభంలో టైటిల్ హాట్ ఫేవరెట్‌గా గుర్తింపు పొందిన తమ జట్టు ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుముఖం పడుతుందని ఏ మాత్రం ఊహించలేకపోయామని చెబుతున్నారు.

ఊరడింపుగా సాక్షిధోనీ పోస్ట్..

ఊరడింపుగా సాక్షిధోనీ పోస్ట్..

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఊరడింపుగా ధోనీ భార్య సాక్షి తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఓ ఇంగ్లీష్ లిటరేచర్ పోస్ట్ అది. `ఇట్స్ జస్ట్ ఎ గేమ్. యు విన్ సమ్..యు లాస్ట్ సమ్..అంటూ సాగే సుదీర్ఘమైన ఇంగ్లీష్ పొయెట్‌ను ఆమె పోస్ట్ చేశారు. ఒకరు గెలిచారంటే.. మరొకరు ఓడినట్టేనని అన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్‌ లేదా ఏ రంగంలోనైనా గెలుపోటములు అనేవి అత్యంత సహజమని చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌ను ఓ గేమ్‌గా మాత్రమే తీసుకోవాలని ఆమె అభిమానులను కోరుతున్నారు. గెలవడాన్ని ఆస్వాదించిన వారు..ఓటమినీ అదే స్థితిలో స్వీకరించాల్సి ఉంటుందని ఆమె ఈ కవిత రూపంలో వివరించారు.

చెన్నై అవకాశాలను దెబ్బకొట్టిన రాజస్థాన్..

చెన్నై అవకాశాలను దెబ్బకొట్టిన రాజస్థాన్..

అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రికార్డు స్థాయి స్కోర్‌ను ఛేదించి అవతలపడేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలవడం.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బకొట్టింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఉంటే.. ధోనీ సేన తలరాత మరోలా ఉండేదేమో. ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే కొట్టేసింది. తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి ఎగబాకింది.

English summary
The MS Dhoni-led side Chennai Super Kings missed out on a playoff spot for the first time in the IPL history. After CSK's fate was sealed, Dhoni's wife Sakshi took to Instagram to post a heart-warming poem for all the CSK fans. "It's just a Game..." on her timeline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X