• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

KKR vs RR: దేవుడు ఆదేశించాడు.. కోల్‌కతా అమలు చేసింది: ఇయాన్ మోర్గాన్

|

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ 60 పరుగులతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఆ జట్టు.. రాజస్థాన్‌ను మాత్రం ఇంటికి పంపించింది. కానీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇంకా ఖాయం కాలేదు. లీగ్‌లో ముందంజ వేసేందుకు ఆ జట్టు రెండు రోజులు నిరీక్షించాలి. చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాలతో ముడిపడిన భవిష్యత్తు కోసం ఎదురుచూడాలి. ఈ నేపథ్యంలోనే అంతా దేవుడి చేతుల్లోనే ఉందని కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తమ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.

'191 పరుగుల స్కోర్‌ సరిపోతుందని భావించా. ప్రతీ ఒక్కరూ వికెట్‌ బాగుందని చెప్పారు. అయితే, 10 నుంచి 15 ఓవర్ల మధ్య వికెట్లు కోల్పోయాం. ఇక మేం ఇన్నింగ్స్‌ను ముగించిన విధానం అద్భుతం. ప్లే ఆఫ్స్‌తో పనిలేకుండా ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలనుకున్నాం. అదే మమ్మల్ని గెలిపిస్తుందని భావించాం. తేమ ప్రభావం ఊహించిందే. రసెల్‌ని సరైన సమయంలో దించడం ద్వారా పరిస్థితులు మరో స్థాయికి వెళ్లాయి. పాట్‌కమిన్స్‌ ఆదిలోనే విజృంభించాడు. మ్యాచ్‌ గెలవాలంటే వికెట్లు తీయడం ఒక్కటే మార్గం. రాజస్థాన్‌ లాంటి జట్టు ఎంత బలమైనదో తెలుసు. వాళ్లని త్వరగా ఔట్‌ చేయాలి. అలాంటి ఆలోచనా దృక్పథం ఉండటం మాకెంతో అవసరం. శివమ్ మావి కమ్ బ్యాక్ చేయడం స్పెషల్. అలాగే రన్‌రేట్‌ గురించి కూడా అవగాహన ఉంది. కానీ, మొదట గెలుపొందడమే అన్నింటికన్నా ముఖ్యం. ఇకపై ఏం జరిగినా దేవుడి చేతుల్లోనే ఉంది. ఈ లీగ్ తర్వాత ఫ్యామిలీతో గడుపుతాను' అని మోర్గాన్‌ చెప్పుకొచ్చాడు.

IPL 2020: Its all Gods grace,KKR captain Eoin Morgan says after win over Rajasthan Royals

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68), రాహుల్ త్రిపాఠి(39) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131పరుగులే చేసి ఓటమిపాలైంది. జోస్ బట్లర్(35), రాహుల్ తెవాటియా(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. శివం మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు. నాగర్ కోటికి ఒక వికెట్ దక్కింది.

English summary
KKR skipper Eoin Morgan left KKR's fate in the hands of cricketing gods after helping his team keep their slender IPL play-off hopes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X