• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధోనీ..వరెస్ట్: ఆ డెసిషన్‌పై మనోళ్ల మనసులో మాట..జమైకన్ స్ప్రింటర్ నోట: ఓటమికి అతనే కారణం

|

షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపరకు ఎక్కడా బ్రేక్ పడట్లేదు. మరో దారుణ ఓటమి తన ఖాతాలో ఆ జట్టు ఖాతాలో చేరింది. ప్లేఆఫ్ అవకాశాలను పోగొట్టుకుంటోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ధోనీ సేన ముందడుగు పడటం దాదాపు కష్టం. లీగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లేఆఫ్ చేరాలంటే.. ఆడబోయే ప్రతీ మ్యాచ్‌నూ గెలిచి తీరాల్సి ఉంటుంది.. అదీ భారీ తేడాతో. అప్పుడే నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది.

 చివరి ఓవర్‌లో..

చివరి ఓవర్‌లో..

షార్జా స్టేడియంలో ఆదివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ కేపిటల్స్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ వీర విజృంభణ.. చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ పించ్ హిట్టింగ్ ముందు నిలవలేకపోయింది.. తేలిపోయింది. 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేపిటల్స్ అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 19.5 ఓవర్లలో 185 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో 17 పరుగులను చేయాల్సి ఉన్న దశలో ఢిల్లీ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రెచ్చిపోయి ఆడాడు. మూడు సిక్సర్లను బాదాడు.

క్రిటిక్స్ టార్గెట్ వారిద్దరే..

క్రిటిక్స్ టార్గెట్ వారిద్దరే..

చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం అనంతరం విమర్శలకు తమ నోటికి పని చెప్పారు. క్రిటిక్స్ టార్గెట్.. చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. వారిద్దరినీ టార్గెట్‌గా చేసుకుని బౌనర్లను సంధిస్తున్నారు. చివరి ఓవర్‌ను రవీంద్ర జడేజా చేతికి అప్పగించడం పట్ల ఘాటు విమర్శలు ఎదురవుతున్నాయి. ధోనీ వంటి కేప్టెన్ నుంచి అలాంటి నిర్ణయం వెలువడుతుందని తాము ఏ మాత్రం ఊహించలేదని అంటున్నారు. కేప్టెన్‌గా ధోనీ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం మరొకటి ఉండబోదని, అపజయానికి అదే కారణమనీ మండిపడుతున్నారు.

జమైకన్ స్ప్రింటర్ కూడా..

జమైకన్ స్ప్రింటర్ యోహాన్ బ్లేక్ సైతం ధోనీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాడు. ధోనీ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం వల్లే ఆ జట్టు ఓడిపోయిందని అంటున్నాడు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను చేతులారా పోగొట్టుకోవడానికి అదే కారణమైందని తేల్చేస్తున్నాడు. రవీంద్ర జడేజాకు చివరి ఓవర్ అప్పగించడాన్ని ఎవరూ సమర్థించబోరని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ డ్వేన్ బ్రావో ఏమయ్యాడని ప్రశ్నించాడు. బ్రావో చేతికి చివరి ఓవర్‌ను అప్పగించి ఉంటే ఫలితం మరోలా ఉండేదనీ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

సెంచరీతో చెలరేగి..

సెంచరీతో చెలరేగి..

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్ సెంచరీని నమోదు చేశాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఐపీల్-2020 సీజన్‌లో ఇదే తొలి సెంచరీ. మిగిలిన బ్యాట్స్‌మెన్లెవరూ రాణించ లేదు. అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ తమ స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. వరుసగా వికెట్లను పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఖాయమే అని భావించారు. పైగా చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి రావడంతో ఢిల్లీకి ఓటమి తప్పదనీ అంచనా వేశారు. అక్షర్ పటేల్ అడ్డుపడ్డాడు. చివరి ఓవర్‌లో మూడు సిక్సులను కొట్టి.. జట్టుకు విజయాన్ని అందించాడు.

English summary
Jamaican sprinter Yohan Blake slams Chennai Super Kings Captain MS Dhoni for giving Ravindra Jadeja the last over against Delhi Capitals. Blake furious as he thought Dwayne Bravo was the best option to bowl the final over. He stated that this was the worst captaincy decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X