• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ బీమర్ స్పీడ్ ఎంతో తెలుసా? వికెట్ కీపర్ సైతం అందుకోలేనంత వేగం: తగిలి వుంటే.. ఖేల్ ఖతం

|

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్తా.. క్రమంగా ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. ఊహించినట్టే- ఈ ఐపీఎల్ సీజన్‌లో ఓ వింత పోకడ తెరమీదికి వచ్చింది. బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడానికి బౌలర్లు ప్రమాదకర వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. బీమర్లతో బెంబేలెత్తించేస్తున్నారు. అత్యంత ప్రమాదకరంగా బీమర్లు పడుతున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ నవదీప్ షైనీ రెండు వేర్వేరు మ్యాచుల్లో రెండు బీమర్లను బ్యాట్స్‌మెన్లపైకి సంధించాడు. మరుసటి రోజే మరో బౌలర్ ఆ జాబితాలో చేరాడు.

డేంజరస్ బీమర్: ఒకే బౌలర్ నుంచి రెండుసార్లు: ప్రమాదకరంగా: బ్యాట్స్‌మెన్‌ కట్టడికి వ్యూహమా?

హార్ధిక్ పాండ్యాపై బీమర్..

ఎమిరేట్స్‌ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్ మధ్య మంగళవారం రాత్రి మ్యాచ్‌లో మరో బీమర్ పడింది. రాజస్థాన్ రాయల్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దీన్ని సంధించాడు. క్రీజులో పాతుకుపోయి, స్వేచ్ఛగా షాట్లను ఆడుతోన్న ముంబై ఇండియన్స్ ఆల్‌రైండర్ హార్దిక్ పాండ్యాను నియంత్రించడానికి ఆర్చర్ ఈ బీమర్‌ను బౌల్ చేశాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్ 19వ ఓవర్‌ మొదటి బంతిని బీమర్‌గా సంధించాడతను. దాని వేగం 152 కిలోమీటర్లుగా రికార్డయింది. అదే వేగంతో వికెట్ కీపర్ జోస్ బట్లర్ ముందు పిచ్ అయింది. అతను కూడా దాన్ని అందుకోలేకపోయాడంటే స్పీడ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తప్పించుకునే క్రమంలో..

తప్పించుకునే క్రమంలో..

హై ఫుల్‌టాస్‌గా ఆర్చర్ చేతి నుంచి వెలువడిన ఈ బంతి నిప్పులు చెరుగుతూ బ్యాట్స్‌మెన్ మీదికి దూసుకెళ్లింది. అంచనా వేసిన దాని కంటే ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చిందా బాల్. భుజాల కంటే ఎత్తులో రావడంతో దాన్ని అడ్డుకోలేకపోయాడు హార్ధిక్ పాండ్య. తప్పించుకునే క్రమంలో బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. క్రీజులో కూర్చుండిపోయాడు. అదే వేగంతో తన ముందు ల్యాండ్ అయిన ఆ బంతిని బట్లర్ అందుకోలేకపోయాడు. ఆశ్చర్యానికి గురవుతూ గ్రౌండ్ మీదే కూర్చున్నాడు. వికెట్ కీపర్‌ను దాటుకున్న ఆ బాల్.. మెరుపు వేగంతో బౌండరీ లైన్‌ను టచ్ చేసింది. బీమర్ వేయడం పట్ల ఆర్చర్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. సారీ చెప్పాడు.

అదే ఓవర్‌లో మరో బౌన్సర్..

అదే ఓవర్‌లో మరో బౌన్సర్..

అదే ఓవర్ నాలుగో బంతిలో ఆర్చర్ వేసిన ఓ స్లో బౌన్సర్.. క్రీజులో ఉన్న సూర్యకుమార్ యాదవ్ హెల్మెట్‌ను బలంగా తాకింది. ఆర్చర్ వేసిన బౌన్సర్‌ను హుక్ షాట్ కోసం ప్రయత్నించిన యాదవ్.. కనెక్ట్ కాలేకపోయాడు. దీనితో ఆ బాల్ నేరుగా అతని హెల్మెట్‌ను తాకింది. దీనితో కొద్దిసేపు నొప్పితో విలవిల్లాడిపోయాడతను. హెల్మెట్‌ను తీసి పక్కన పడేశాడు. రెండు చేతులతో తలను పట్టుకుని నిల్చుని పోయాడు. డాక్టర్‌ను పిలిపించుకుని ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. ఆ తరువాత తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్‌గా మలిచాడు.

పాండ్యాను ప్రశంసించిన స్టువర్ట్ బ్రాడ్..

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్.. హార్ధిక్ పాండ్యాను ప్రశంసించాడు. ఆర్చర్ నుంచి వెలువడిన బీమర్‌ నుంచి సమర్థవంతంగా తప్పించుకోగలిగాడని చెప్పాడు. అలాంటి బంతులను వేయాలని ఏ బౌలర్ కూడా అనుకోడని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ టీమ్.. 193 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 136 పరుగులకు ఆలౌట్ అయింది. 70 పరుగులతో ఓపెనర్ జోస్ బట్టర్ ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

English summary
Rajasthan Royal's bowler Jofra Archer bowls a 152 kmph beamer to Mumbai Indians batsman Hardik Pandya. The first ball of the 18th over. That was lethal beamer slipped from Archer's hand, even Jos Buttler was surprised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X