వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీసీసీఐలో మళ్లీ రాజకీయాలు?: టీమిండియాలో టాలెంట్‌కు చోటు లేదా?: ఆ ఐపీఎల్ స్టార్‌కు నో బెర్త్

|
Google Oneindia TeluguNews

ముంబై: క్రికెట్ ఆడే దేశాల్లోకెల్లా బాగా రిచ్‌ అనే పేరుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు. బీసీసీఐలో రాజకీయాలు కూడా ఎక్కువేనని ఆరోపిస్తున్నారు అభిమానులు. క్రికెట్‌లో కూడా రాజకీయాలు, కులం చొరబడ్డాయని ఆరోపిస్తున్నారు. ఇదివరకు అంబటి రాయుడు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలే మరోసారి తలెత్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కులం అనే ప్రాతిపదిక మీదే అంబటి రాయుడికి భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించలేదంటూ అభిమానులు అప్పట్లో విరుచుకుపడ్డారు. అలాంటి ఆరోపణలు, విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి.

సూర్యకుమార్ యాదవ్‌కు చోటేదీ?


తాజాగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వెన్నెముక సూర్యకుమార్ యాదవ్‌కు భారత క్రికెట్ జట్టులో చోటు దక్కకపోవడం పట్ల అభిమానులు భగ్గుమంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణిస్తోన్నప్పటికీ.. అతనికి జాతీయ జట్టులో బెర్త్ కల్పించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. #JusticeForSuryakumarYadav అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నప్పటికీ.. అతని ప్రతిభను బీసీసీఐ సెలెక్టర్లు గుర్తించట్లేదని వాపోతున్నారు.

ఐపీఎల్ టోర్నీలో నిలకడగా..

సూర్యకుమార్ యాదవ్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే.. అభిమానుల ఆగ్రహంలో, అసహనం వ్యక్తం చేయడంలో తప్పు లేదనిపిస్తుంది. 2018 సీజన్ నుంచీ అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్-2018లో 512 పరుగులు, ఐపీఎల్-2019లో 424 పరుగులు సాధించాడు. ఈ రెండు సీజన్లలో అతని బ్యాటింగ్ యావరేజ్.. 36.57, 32.61గా నమోదైంది. ఐపీఎల్-2020 సీజన్‌లో ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లను ఆడిన సూర్యకుమార్ యాదవ్ 283 రన్స్ చేశాడు. ఈ మూడు సీజన్లలో 1219 పరుగులు అతని అకౌంట్‌లో ఉన్నాయి. ఓ బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నాడనడానికి డేటాతో సహా సాక్ష్యాలను చూపిస్తున్నారు అభిమానులు.

ఐపీఎల్‌ను మాత్రమే ప్రాతిపదికగా..

ఐపీఎల్‌ను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించట్లేదనడానికీ వీలులేని పరిస్థితి ఏర్పడింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ షైనీ, దీపక్ చాహర్, సంజు శాంసన్‌, శుభ్‌మన్ గిల్.. వీరంతా ఐపీఎల్ ప్రొడక్టే. వారిని ఐపీఎల్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ జట్టులోకి తీసుకున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను ఎందుకు పక్కన పెట్టారనేది అభిమానుల ప్రశ్న. ఇదివరకు ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో అంబటి రాయుడిని తీసుకోకపోవడానికి కులం కారణమని, ఇప్పుడూ అదే తరహా పరిస్థితులు బీసీసీఐలో కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు ఫ్యాన్స్.

మూడు ఫార్మట్లకూ వేర్వేరుగా..

ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. టీ20, వన్డే, టెస్టుల కోసం ప్రత్యేకంగా జట్లను ఎంపిక చేసింది. టీ20 కోసం విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేసింది.

వన్డే, టెస్టుల్లో..


భారత వన్డే టీమ్‌లో విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, శార్దుల్ ఠాకుర్‌లను తీసుకున్నారు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, హనుమ విహారీ, శుభ్‌మన్ గిల్, వృద్ధీమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్‌లకు చోటు కల్పించారు.

English summary
There were reports that Suryakumar, who has been in stellar form in white ball cricket since last year, will finally break into the T20I squad. But that wasn't to be. Suryakumar, who has scored 283 runs in 10 innings so far, has been a consistent performer for MI this season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X