• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సునీల్ నరైన్ రీఎంట్రీ: బౌలింగ్ యాక్షన్‌ ఓకే: వార్నింగ్ లిస్ట్‌ నుంచి క్లియర్: కోల్‌కత కదనోత్సాహం

|

అబుధాబి: కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 మ్యాచుల్లో ఆడబోతున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ ఎదుర్కొనబోయే తదుపరి మ్యాచ్‌లకు అతను అందుబాటులోకి రానున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌కు వెన్నెముకగా చెప్పుకొనే ఈ వెస్టిండీస్ క్రికెటర్.. జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం పట్ల టీమ్ మేనేజ్‌మెంట్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఐపీఎల్ కమిటీ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని కోల్‌కత ఫ్రాంఛైజీ, మేనేజ్‌మెంట్ స్వాగతిస్తోంది.

బౌలింగ్ యాక్షన్‌పై ఓకే..

బౌలింగ్ యాక్షన్‌పై ఓకే..

సునీల్ నరైన్ సందేహాస్పదంగా బౌలింగ్ చేస్తున్నాడనే కారణంతో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ అతన్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. బౌలింగ్ యాక్షన్‌ను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించింది. ఫలితంగా- కొన్ని మ్యాచ్‌లకు సునీల్ నరైన్ దూరం అయ్యాడు. అనంతరం తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోవడానికి, మరింత మెరుగు పర్చుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. ఆశించిన ఫలితాన్ని సాధించాడు. సస్పెన్షన్ కాలంలో సునీల్ నరైన్ బౌలింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని కోల్‌కత మేనేజ్‌మెంట్.. ఈ కమిటీకి అందజేసింది.

సంతృప్తికరంగా..

సంతృప్తికరంగా..

టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, ఐసీసీ మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్, ఐసీసీ మాజీ అంపైర్ కే హరిహరన్, బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌లతో కూడిన ఐపీఎల్ సస్పెక్ట్ బౌలింగ్ బౌలింగ్ యాక్షన్ కమిటీ.. ఈ వీడియో ఫుటేజీలను మరో దఫా పరిశీలించింది. సంతృప్తిని వ్యక్తం చేసింది. స్లో మోషన్‌లో తాము ఈ ఫుటేజీని పరిశీలించామని, బంతిని బౌల్ చేసే సమయంలో సునీల్ నరైన్ ఎల్‌బో బెండ్ మీదుగా చేతిని లేపడం.. ఐసీసీ పరిధికి లోబడే ఉన్నట్లు గుర్తించినట్లు కమిటీ వెల్లడించింది. దీనితో అతని బౌలింగ్‌పై తాము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నామని, వార్నింగ్ లిస్ట్ నుంచి పేరును తొలగిస్తున్నామని ప్రకటించింది.

ఇక ముందు కూడా

ఇక ముందు కూడా

ఈ వీడియో ఫుటేజీల్లో కనిపించిన విధంగానే అతను ఐపీఎల్ టోర్నమెంట్లలో బౌలింగ్ చేయాల్సి ఉంటుందని కమిటీ ఆదేశించింది. దీనికి భిన్నంగా బౌలింగ్ చేస్తే. మరోసారి నిషేధం వేటును ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. దీనితో సునీల్ నరైన్.. ఐపీఎల్-2020 సీజన్‌లో రీఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో అందుబాటులో లేడు. తదుపరి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి.

  IPL 2020 : KKR spinner Sunil Narine Suspect Bowling Action Once Again | KXIP vs KKR || Oneindia
  కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై

  కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై

  ఈ నెల 10వ తేదీన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ అనుమానాస్పదంగా బౌలింగ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ కీలకమైన రెండు వికెట్లను పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ప్రత్యేకించి- 18, 20వ ఓవర్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ల దూకుడుకు కళ్లెం వేయగలిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసిన సునీల్.. 28 పరుగులు ఇచ్చాడు. నికొలస్ పూరన్, మన్‌దీప్ సింగ్‌లను పెవిలియన్ పంపించగలిగాడు. అదే సమయంలో- అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఉల్లాస్ గాంధీ, క్రిస్ గెఫెనీ.. ఈ మేరకు అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేశారు.

  English summary
  In what comes as a big boost for Kolkata Knight Riders, Sunil Narine has been cleared by the IPL's Suspect Bowling Action Committee and his name has been taken off the suspect action warning list, an IPL media release stated on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X