వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కత నైట్ రైడర్స్‌గా దినేష్ కార్తీక్ పనికిరాడట: కొత్త పేరును సజెస్ట్ చేసిన టీమిండియా మాజీ పేసర్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీ పోరును తలపించింది. రెండు జట్లూ విజయం కోసం కొదమ సింహాల్లా పోరాడాయి. కోల్‌కత బౌలర్లను చీల్చి చెండాడుతూ 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఢిల్లీ కేపిటల్స్‌కే విజయం వరించింది. స్కోరుబోర్డుపై కొండంత టార్గెట్ ఉన్నప్పటికీ.. కోల్‌కత నైట్ రైడర్స్ బెదరలేదు. దాన్ని ఛేదించడానికి శ్రమించింది. చివరి బంతి వరకూ పోరాడింది. మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చివేసింది.

మోర్గాన్ షో..

మోర్గాన్ షో..

నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులను చేయగలిగింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. దాన్ని అందుకునే క్రమంలో కేకేఆర్ బ్యాట్స్‌మెన్లు చేసిన పోరాటం అభిమానులు ఆకట్టుకుంది. ఈ క్రమంలో కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్, ఇంగ్లాండ్ టీమ్ కేప్టెన్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లో 44 పరుగులు చేశాడతను ఇందులో ఒక ఫోర్, అయిదు సిక్సర్లు ఉన్నాయి. మోర్గాన్ ఆడుతున్నంత సేపూ ఈ మ్యాచ్‌లో గెలుస్తుందనే నమ్మకం కోల్‌కత నైట్ రైడర్స్ అభిమానుల్లో కలిగింది. 19వ ఓవర్‌లో జట్టు స్కోరు 200 పరుగుల వద్ద మోర్గాన్ అవుట్ కావడంతో ఢిల్లీ కేపిటల్స్ ఊపిరి పీల్చుకుంది.

దినేష్ కార్తీక్‌పై విమర్శలు..

దినేష్ కార్తీక్‌పై విమర్శలు..

అదలావుంచితే- కోల్‌కత నైట్ రైడర్స్ పరాజయం పాలుకావడం.. ఆ జట్టు కేప్టెన్ దినేష్ కార్తీక్‌పై విమర్శలకు తావిచ్చినట్టయింది. బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం, ఢిల్లీ కేపిటల్స్ బ్యాట్స్‌మెన్లు భారీ షాట్లతో చెలరేగిపోతున్నప్పటికీ.. వారికి అడ్డుకట్ట వేయడానికి పక్కా ప్రణాళికలను రచించడంలో విఫలం అయ్యాడనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బౌలింగ్‌లో వైవిధ్యం చూపించకపోవడం వల్ల ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు స్వేచ్ఛగా, యథేచ్ఛగా షాట్లను ఆడారనీ అంటున్నారు. ఏ ఒక్క బౌలర్‌ను కూడా వారు లెక్కచేయపోవడానికి కారణం..అదేనని చెబుతున్నారు.

బౌలింగ్‌లో భిన్నత్వం లేదు..

బౌలింగ్‌లో భిన్నత్వం లేదు..

టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దినేష్ కార్తీక్‌పై ఒత్తిడి ఉందని, దానికి అతను అవలీలగా తలొగ్గుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వంటి ధనాధన్ మ్యాచుల్లో బౌలర్లను సరిగ్గా వినియోగించుకుంటేనే ఏ జట్టయినా విజయం సాధిస్తుందని చెప్పాడు. శనివారం రాత్రి నాటి మ్యాచ్‌లో అదే కొరవడిందని, అందుకే- ఢిల్లీ కేపిటల్స్ రికార్డు స్కోరును సాధించారని అంచనా వేశాడు. ఈ ఓటమికి జట్టు కేప్టెన్ దినేష్ కార్తీక్ నైతిక బాధ్యతను వహించాల్సి ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నాడు.

దినేష్ కార్తీక్ కంటే.. మోర్గాన్ బెటర్..

దినేష్ కార్తీక్ కంటే.. మోర్గాన్ బెటర్..

దినేష్ కార్తీక్ కంటే.. ఇవాన్ మోర్గాన్ జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరించడం బెటర్ అని శ్రీశాంత్ చెప్పాడు. ఇవాన్ మోర్గాన్.. విన్నింగ్ కేప్టెన్ అని కితాబిచ్చాడు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఇంగ్లాండ్ జట్టుకు ప్రపంచకప్‌ను అందించిన ఘనత అతినికి సొంతమని వ్యాఖ్యానించాడు. మోర్గాన్ కేప్టెన్సీలో ఇంగ్లాండ్ టీమ్.. అనేక ఘన విజయాలను అందుకుందని, పలు సిరీస్‌లల్లో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లతో సరితూగే శక్తిసామర్థ్యాలు మోర్గాన్‌కు ఉన్నాయని అన్నాడు. కేకేఆర్ ఫ్రాంఛైజీ కేప్టెన్సీని మారుస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు.

English summary
Former India pacer S Sreesanth has said that Eoin Morgan and not Dinesh Karthik should be captaining Kolkata Knight Riders. Sreesanth suggests a new captain for KKR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X