వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాట్‌తో రెడీ టు ఫైట్: కోహ్లీని పేపర్ కేప్టెన్‌గా: ముంబై స్టార్ బ్యాట్స్‌మెన్ సాహసం: డిస్ లైక్

|
Google Oneindia TeluguNews

ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ ముగిసిన తరువాత కూడా.. దానికి సంబంధించిన వేడి ఇంకా చల్లారట్లేదు. మరింత రాజుకుంటూనే ఉంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోన్న టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ.. ముంబై ఇండియన్స్ స్కిప్పర్ రోహిత్ శర్మ అభిమానుల మధ్య ఘర్షణ వైఖరి కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ మరీ సోషల్ మీడియా వేదికగా విమర్శలను సంధించుకుంటున్నారు. మెమెస్‌లను వదలుతున్నారు.

విరాట్ కోహ్లీని పేపర్ కేప్టెన్‌గా

విరాట్ కోహ్లీని పేపర్ కేప్టెన్‌గా

విరాట్ కోహ్లీని పేపర్ కేప్టెన్‌గా అభివర్ణిస్తూ రూపొందించిన ఓ మెమె ప్రస్తుతం సంచలనాలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. రోహిత్ సెల్వ ఆర్ఎఫ్‌సీ అనే ట్విట్టర్‌ అకౌంట్‌లో ఆ మెమె పోస్ట్ అయింది. విరాట్ కోహ్లీని పేపర్ కేప్టెన్‌గా భావిస్తూ దాన్ని పోస్ట్ చేశారు. టీమిండియా సెలెక్టర్లు సమర్థుడైన రోహిత్ శర్మను కాదని, విరాట్ కోహ్లీని కేప్టెన్‌గా చేశారని, అతను ఓ పేపర్ కేప్టెన్‌గా తయారయ్యాడనే అర్థాన్ని ఇచ్చే మెమె. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు అయిదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆవిర్భవించగా.. కోహ్లీ కేప్టెన్సీలోని ఆర్సీబీ ఒక్కసారి కూడా ఆ స్థాయికి చేరుకోలేదని పేర్కొన్నారు.

 లైక్ కొట్టిన సూర్యకుమార్..

లైక్ కొట్టిన సూర్యకుమార్..

ఈ మెమెకు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ లైక్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీమిండియా స్కిప్పర్‌గా విరాట్ కోహ్లీ కంటే.. రోహిత్ శర్మే బెటర్ ఆప్షన్ అనే సందేశాన్ని అతను పంపించినట్టయింది. అనంతరం- ఇది కాస్తా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. తోటి ఐపీఎల్ టీమ్ ప్లేయర్.. విరాట్ కోహ్లీ టీమిండియా కేప్టెన్‌ స్థాయికి తగడంటూ కథనాలు వెల్లువెత్తాయి. వివాదాలకు కేంద్రబిందువు కాకూడదనే ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్.. డిస్ లైక్ చేశాడు.

ఐపీఎల్‌లో స్లెడ్జింగ్..

ఐపీఎల్‌లో స్లెడ్జింగ్..


ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో పాతుకునిపోయి స్వేచ్ఛగా, ధాటిగా భారీ షాట్లను ఆడటం కోహ్లీకి మంటెక్కించినట్టుంది. తన అసహనాన్ని అతను ఎంతో సేపు దాచుకోలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించాడు. అదే వేడి ఇప్పుడూ వారిద్దరి మధ్య కొనసాగుతోందనే విషయాన్ని ఈ వ్యవహారం స్పష్టం చేసినట్టయింది.

మ్యాచ్‌లో ఉద్రిక్తత..

మ్యాచ్‌లో ఉద్రిక్తత..

ఐపీఎల్-2020 సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. అన్ని జట్ల బౌలర్లపైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. సూర్యకుమార్ యాదవ్‌పై ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కోహ్లీ అతణ్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం, క్రీజ్‌లో ఉన్న సూర్యకుమార్ పక్కకు వచ్చి నిల్చోవడం, యాదవ్ అతణ్ని ఏ మాత్రం ఖాతరు చేయకపోవడం వంటి పరిణామాలు సంభవించాయి.

English summary
Mumbai Indians Star batsman Suryakumar Yadav Likes Controversial Meme Trolling as ‘Paper Captain’ Team India Captain Virat Kohli. The controversial post showcased Rohit standing alone against BCCI selectors, haters and most significantly ‘paper captain’ Virat Kohli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X