• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

MI vs CSK match: సెంచరీ కొట్టిన ధోనీ: గ్రాండ్ విక్టరీతో న్యూ మైల్‌స్టోన్: ఓ చెత్త రికార్డుకూ బ్రేక్

|

సెంచరీ కొట్టిన ధోనీ. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ అసలు ఖాతానే తెరవలేదు. అయినా సెంచరీ బాది పారేశాడు ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఏ టీమ్ కేప్టెన్ కూడా అందుకోని అరుదైన రికార్డు అది. అలాంటి రికార్డును తన పేరు మీదే లిఖించుకున్నాడీ జార్ఖండ్ డైనమేట్. ఐపీఎల్-2020 సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌ నుంచే రికార్డుల వేటను మొదలు పెట్టాడు. సీజన్ ముగిసే సరికి ఇంకెన్ని రికార్డులను కొల్లగొట్టేస్తాడోననే ఉత్కంఠతో రేకెత్తించాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఘనతనూ సాధించాడు.

అసలు ఏంటీ రికార్డ్

అసలు ఏంటీ రికార్డ్

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కేప్టెన్‌గా వందో విజయాన్ని అందుకున్నాడు ధోనీ. మహీ కేప్టెన్సీలో చెన్నై ఐపీఎల్‌లో ఇప్పటిదాకా వంద విజయాలను నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. ఈ గ్రాండ్ విక్టరీతో ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే వందో విజయాన్ని అందుకుంది.

పుణే టీమ్‌ను కలుపుకుంటే..

పుణే టీమ్‌ను కలుపుకుంటే..

ఓవరాల్‌గా చూసుకుంటే.. కేప్టెన్‌గా ధోనీ 105 సార్లు తాను సారథ్యాన్ని వహించిన జట్టుకు గెలుపు రుచిని చూపించాడు. 2016 సీజన్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌కు ధోనీ కేప్టెన్సీ వహించాడు. అప్పట్లో పుణే టీమ్ అయిదు మ్యాచ్‌లల్లో విజయం సాధించింది. మొత్తం 10 సీజన్లలో ప్లే ఆఫ్‌కు చేరిన టీమ్‌గా కూడా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును సాధించింది. మూడుసార్లు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ మూడుసార్లు కూడా ధోనీ కేప్టెన్సీలోనివే.

వందో క్యాచ్ కూడా..

వందో క్యాచ్ కూడా..

ఇదే మ్యాచ్‌లో ధోనీ మరోో మైల్‌స్టోన్‌ను నెలకొల్పాడు. వంద క్యాచ్‌లను అందుకున్నాడు. వికెట్ కీపర్‌గా 96, ఫీల్డర్‌గా మెరుపు క్యాచ్‌లను పట్టాడు. శనివారం నాటి మ్యాచ్‌లో ఇద్దరు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపించాడు. జట్టు స్కోరు 136 పరుగుల వద్ద ఉన్నప్పుడు కృనాల్ పాండ్య అవుట్ అయ్యాడు. లుంగి ఎంగిడి సంధించిన బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు కృనాల్. మెరుపువేగంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కుడిచేతి వైపు గాల్లోకి ఎగురుతూ ధోనీ క్యాచ్ పట్టాడు.

పొలార్డ్ క్యాచ్..మరో హైలైట్

పొలార్డ్ క్యాచ్..మరో హైలైట్

14 బంతుల్లో ఒక బౌండరీ, ఒక సిక్స్‌తో 18 పరుగులతో జోరు మీదున్న కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేశాడు ధోనీ. జట్టు స్కోరు 151 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధోనీ పట్టిన క్యాచ్‌తో పొలార్డ్ అవుట్ అయ్యాడు. అప్పటికి ఇంకా రెండు ఓవర్లు మిగిలే ఉన్నాయి. భారీ షాట్లు ఆడే పొలార్డ్.. క్రీజ్‌లో ఉండి ఉంటే ముంబై.. స్కోర్‌బోర్డు పరుగులెత్తి ఉండేదే. అలాంటి సమయంలో ధోనీ.. పొలార్డ్‌ను అవుట్ చేశాడు. ఇది అతని వందో క్యాచ్.

అయిదు వరుస ఓటముల తరువాత..

అయిదు వరుస ఓటముల తరువాత..

ముంబై ఇండియన్స్‌పై కొనసాగుతూ వచ్చిన ఓ చెత్త రికార్డును కూడా చెన్నై సూపర్ కింగ్స్ చెరిపేసుకుంది. ఐపీఎల్‌లో వరుసగా అయిదు తొలి మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓటమి చవి చూసింది చెన్నై. ముంబైని ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలు కావడానికి బ్రేక్ వేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే రికార్డులను బద్దలు కొట్టాడు మహీ.

English summary
Veteran Indian cricketer MS Dhoni added another feather to his hat as he became the first captain in the history of Indian Premier League to lead a franchise to 100 wins in the tournament. Dhoni achieved the feat after his team defeated rival Mumbai Indians in the IPL 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X