వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కరకు రాని స్టార్ ఆల్‌రౌండర్: అట్టర్ ఫ్లాప్: 10 సార్లు డకౌట్: షో కంటిన్యూ: రేటెంతో తెలుసా?

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లనేసరికి కొంతమంది క్రికెటర్ల పేర్లు ఠక్కుమని గుర్తకొస్తాయి. వారు కొట్టే షాట్లు మైమరిపింపజేస్తాయి. ఆ క్రికెటర్ల బ్యాటింగ్..మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. ఐపీఎల్‌లో ప్రతి ఆటగాడు కూడా ధారాళంగా పరుగులు సాధించడం సహజమే అయినప్పటికీ.. ఆ పరుగులను రాబ్టటే విధానం, బ్యాటింగ్ స్టైల్ ఆసక్తికరంగా ఉంటుంది. టీవీ ముందు అతుక్కుపోయేలా చేస్తుంది. రెప్పవాల్చకుండా చూడాలనిపిస్తుంటుంది. ఆ కేటగిరీకి చెందిన బ్యాట్స్‌మెన్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకడు. ఈ సారి అతను అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

మెరిసిన ప్రీతిజింతా: 10 నిమిషాల్లో ఎన్ని వేరియేషన్‌లో: డబుల్ సూపర్ ఓవర్‌..విన్నర్మెరిసిన ప్రీతిజింతా: 10 నిమిషాల్లో ఎన్ని వేరియేషన్‌లో: డబుల్ సూపర్ ఓవర్‌..విన్నర్

మరో డకౌట్

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఖాతాలో తాజాగా మరో సున్నా చేరింది. ఆదివారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యాడు. సున్నాకే వెనుదిరిగాడు. రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్న అతను.. చాహర్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో కుదురుకుని ఉండి ఉంటే..బహుశా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్లి ఉండేది కాదేమో. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అతను విఫలమౌతున్నాడు. జట్టుకు అవసరం అనుకున్న ప్రతీసారీ.. ఆశించిన స్థాయిలో కాదు కదా.. నామమాత్రంగా కూడా ఆడట్లేదు.

ఐపీఎల్‌లో 10 సున్నాలు..

ఐపీఎల్ సీజన్ అన్నింట్లోకి కలిపి మ్యాక్స్‌వెల్ ఇప్పటిదాకా పదిసార్లు డకౌట్ అయ్యాడు. ఆ మాటకొస్తే.. ఇదో రికార్డు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన అతను.. ఏ ఒక్క దాంట్లో కూడా రాణించలేకపోయాడు. 1, 5, 13 (నాటౌట్),11,11, 7,10 (నాటౌట్), 0.. ఇదీ అతని స్కోర్. ఇప్పటికే సగం టోర్నమెంట్ పూర్తయింది. ఇక ముందైనా రాణిస్తాడే నమ్మకం టీమ్ మేనేజ్‌మెంట్‌కే కాదు.. అభిమానుల్లోనూ కలగట్లేదు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆడబోయే తరువాతి మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్ ఆడతాడా? లేదా? అనేది అనుమానమే. 10.75 కోట్ల రూపాయలను పంజాబ్ ఫ్రాంఛైజీ అతనిపై పెట్టుబడి పెట్టింది.

కలిసి రావట్లేదా..

నిజానికి మ్యాక్స్‌వెల్ మరీ అంత నాసిరకం బ్యాట్స్‌మెన్ ఏమీ కాదు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు. భారీ షాట్లను ఆడగలడు. ప్రత్యర్థి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాక్కొనే శక్తిసామర్థ్యాలు అతనికి ఉన్నాయి. ఆస్ట్రేలియా తరఫున బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మ్యాజిక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐపీఎల్‌కు వచ్చేసరికి అతనిలో తెలియని భయం ఆవిహిస్తున్నట్టు కనిపిస్తోంది. ఐపీఎల్ మొత్తం సీజన్లలో పెద్దగా రాణించిన మ్యాచ్‌లు లేవు. ఐపీఎల్ సీజన్లలో ఇప్పటిదాకా ఆరు అర్ధసెంచరీలు మాత్రమే అతని పేరు ఉన్నాయి. 2017 సీజన్‌లో మాత్రమే అత్యధికంగా 310 పరుగుల స్కోర్ సాధించాడు.

English summary
Kings XI Punjab batsman Glenn Maxwell has been woeful with the bat in IPL 2020 having scored only 58 runs in eight innings and Sunday was no different for the Australian cricketer as he got out for a duck during his side’s clash against Mumbai Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X