వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీ..అలసిపోయాడా? ఐపీఎల్‌కూ గుడ్‌బై? ప్రాణంగా భావించే జెర్సీ..ఆ బ్యాట్స్‌మెన్‌కు గిఫ్ట్

|
Google Oneindia TeluguNews

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. మరో ఓటమిని మూటగట్టుకుంది. టోర్నమెంట్‌కు ముందు టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సింహాల ఆటతీరు గతి తప్పింది. రిథమ్ మారింది. ఒక్కసారి పరాజయాల బాట పట్టిన తరువాత.. ఇక బౌన్స్ బ్యాక్ కాలేకపోయింది. తాజాగా నమోదు చేసిన ఈ ఓటమితో.. ఈ మెగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యే తొలి జట్టుగా తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్నట్టయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరింది.

Recommended Video

IPL 2020: MS Dhoni Gave His No.7 Jersey To Jos Butler, Why | CSK vs RR | Oneindia Telugu

చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆశలన్నీ నీరుగారినట్టే..


ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలోో సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైన తీరు.. క్రికెట్ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్.. విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. నాసిరకం క్రికెట్‌ను ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన.. 20 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐపీఎల్-2020 సీజన్‌లో ఇప్పటిదాకా ఇదే అతి తక్కువ స్కోరు. ఫాస్ట్ బౌలర్ జోస్ బట్లర్, స్పిన్నర్లు రాహుల్ తెవాతియా, శ్రేయాస్ గోపాల్‌ల బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయింది. పరుగులు తీయడానికి శ్రమించింది.

ప్రారంభ ఓవర్లలో ఓ మోస్తరుగా ఉన్నా..

126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్లపై చెన్నై బౌలర్లు ప్రారంభంలో ప్రతాపం చూపించారు. వరుస ఓవర్లలో ముగ్గురిని పెవిలియన్ దారి పట్టించారు. ఓపెనింగ్ బౌలర్ దీపక్ చాహర్, హేజిల్ వుడ్‌ చెలరేగిపోయారు. ఓపెనర్ బెన్‌స్టోక్స్, రాబిన్ ఊతప్ప, సంజు శాంసన్‌ను వెంటవెంటనే అవుట్ చేశారు. బ్యాట్స్‌మెన్లపై ఆధిపత్యాన్ని సాధించారు. అది ఎంతో సేపు నిలవలేదు. సంజు శాంసన్ అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్..స్టీవ్ స్మిత్ మరో వికెట్ పడకుండా కాపాడుకోగలిగారు. లక్ష్యం పరిమితంగా ఉండటంతో ఎక్కడా తడబడలేదు.

ధోనీపైనే ఫోకస్..

ఈ ఓటమి తరువాత అందరి దృష్టీ చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మీదే నిలిచింది. చెన్నై వరుస పరాజయాలపై ధోనీ ఏం చెబుతాడా? అనే ఆసక్తి నెలకొంది. ఆశ్చర్యకరంగా మ్యాచ్ ముగిసిన వెంటనే.. ధోనీ తన జెర్సీని జోస్ బట్లర్‌కు బహుమతిగా అందజేశాడు. ఈ జెర్సీని ధరించడానికి అతను అర్హుడని వ్యాఖ్యానించాడు. ధోనీ జెర్సీ నంబర్ 7. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనూ అతను అదే నంబర్ జెర్సీని ధరించేవాడు. ఐపీఎల్‌లోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాడు. సోమవారం రాత్రి నాటి మ్యాచ్ ముగిసిన తరువాత..దాన్ని బట్లర్‌కు బహుమతిగా అందించడం చర్చకు దారి తీసింది.

ఐపీఎల్‌కు కూడా..

ఐపీఎల్‌కు కూడా..

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మట్ల నుంచీ అతను వైదొలిగాడు. ఈ ఏడాదే వన్డే మ్యాచ్‌ల నుంచి కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ సారి ఐపీఎల్ నుంచి కూడా వైదొలగే అవకాశాలు లేకపోలేదనే సంకేతాన్ని ధోనీ.. పరోక్షంగా పంపించాడా? అనే అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమౌతున్నాయి. ధోనీ.. తన ఏడో నంబర్ జెర్సీని ప్రాణంగా భావిస్తాడని, అలాంటి దాన్ని బట్లర్‌కు బహుమతిగా ఇవ్వడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌కు కూడా ధోనీ గుడ్‌బై చెబుతాడని భావిస్తున్నారు.

English summary
Jos Buttler was the architect of the victory for the Royals who slammed an unbeaten 70 to get the team over the line in a tricky run-chase of 126 runs. The England cricketer got the best gift after the match with the CSK skipper MS Dhoni gifting him his jersey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X