• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తుఫాన్ ముందు ప్రశాంతత: భార్య ఒడిలో కునుకు తీస్తోన్న హార్డ్ హిట్టర్: రెచ్చిపోతే..చుక్కలే

|

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తొలిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఉత్కంఠభరితంగా తుదిపోరు కొనసాగబోతోంది. మరోసారి ఛాంపియన్‌గా అవతరించడానికి ముంబై ఇండియన్స్..మొట్టమొదటిసారిగా ఫైనల్‌లో ప్రవేశించి, కప్‌ను కొట్టేసిన జట్టుగా నిలవడానికి ఢిల్లీ కేపిటల్స్ పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై ముంబై జట్టు ఆధిపత్యాన్ని కనపర్చినప్పటికీ.. ఫైనల్ పోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తిరేపుతోంది.

ఏడు కోట్లమంది ఎవరిని ఎన్నుకున్నారో: సైలెంట్ ఫోర్స్: మహిళలు, యువత ఓటుబ్యాంకే కీలకంఏడు కోట్లమంది ఎవరిని ఎన్నుకున్నారో: సైలెంట్ ఫోర్స్: మహిళలు, యువత ఓటుబ్యాంకే కీలకం

ప్లేఆఫ్‌లో ఢిల్లీని మట్టి కరిపించిన ముంబై..

ప్లేఆఫ్‌లో ఢిల్లీని మట్టి కరిపించిన ముంబై..

ఐపీఎల్-2020 ప్లేఆఫ్ దశలో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగిపోయి ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీమ్ 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను మాత్రమే కోల్పోయిందంటే.. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, కీరన్ పొల్లార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. ఇలా లెక్కించుకుంటూ పోతే.. అందరూ సమర్థులే. భారీ స్కోరును సాధించే సత్తా ఉన్నవారే. కొండంత లక్ష్యాన్ని కూడా సునాయాసంగా అందుకోగలరు.

ధీటుగా బౌలర్లు..

ధీటుగా బౌలర్లు..

ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం బ్యాటింగ్ లైనప్‌తో ఏ మాత్రం తీసిపోదు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న జస్‌ప్రీత్ బుమ్రా సంధించే యార్కర్లకు అవతలి జట్టు బ్యాట్స్‌మెన్ల వద్ద సమాధానం ఉండదు. కొత్త బంతితో వికెట్లను తీయగల సమర్థుడు ట్రెంట్ బౌల్ట్. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్ బ్యాట్స్‌మెన్ల దూకుడుకు కళ్లెం వేయగలరు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఢిల్లీ కేపిటల్స్ సమవుజ్జీగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. స్థిరత్వం ఉండట్లేదు. నిలకడలేమి ఆ జట్టును వేధిస్తోంది.

తుఫాన్ ముందు ప్రశాంతత..

తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా మారుతుంటుందని అంటుంటారు. ముంబై ఇండియన్స్ హార్డ్ హిట్టర్ కీరన్ పొల్లార్డ్ ప్రస్తుతం అలానే కనిపిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఎలాంటి ఆందోళనకు గురి కావట్లేదతను. ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. భార్య జెన్నా అలీతో సరదాగా గడుపుతున్నాడు. దుబాయ్ హోటల్‌లో పొల్లార్డ్ జట్టుతో కలిసి ఉంటున్నాడు. భార్య ఒడిలో తలపెట్టిన కీరన్ పొల్లార్డ్ కునుకు తీస్తోన్న ఓ ఫొటోను ముంబై ఇండియన్స్ జట్టు తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ష్.. కామ్ బిఫోర్ ద ఫైనల్ మ్యాచ్ ఆన్ నవంబర్ టెన్త్ అనే క్యాప్షన్‌ను యాడ్ చేసింది.

అంచనాలకు మించి రాణిస్తోన్న..

అంచనాలకు మించి రాణిస్తోన్న..

ఈ సీజన్‌లో లీగ్ దశలో కొన్ని మ్యాచ్‌లకు కీరన్ పొల్లార్డ్ సారథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. కేప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా వైదొలగిన మ్యాచ్‌లకు పొల్లార్డ్ కేప్టెన్సీగా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 15 మ్యాచ్‌లను ఆడిన పొల్లార్డ్.. 259 పరుగులు చేశాడు. కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 190.44గా ఉంది. పొల్లార్డ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 60. బ్యాటింగ్ యావరేజ్ 64.75. ఇవి చాలు అతను ఏ రేంజ్‌లో ఆడుతున్నాడో తెలియజేయడానికి. ఫైనల్ మ్యాచ్‌లో అతణ్ని కట్టడం చేయడం పైనే ముంబై ఇండియన్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

English summary
Mumbai Indians, defending Indian Premier League champions, took to Instagram on Saturday to share a picture of their West Indies all-rounder Kieron Pollard chilling with his wife Jenna Ali ahead of the summit clash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X