వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాట్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వైఫల్యాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించిన ఫ్యాన్స్.. తాజాగా పెటర్నీటి లీవ్‌తో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదని, అయితే అదే సమయంలో జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తండ్రి చనిపోయినప్పటికీ ఒంటి చేత్తో జట్టును గెలిపించిన విరాట్.. ఇప్పుడిలా తన బిడ్డ కోసం జట్టును వదిలేసి రావడం బాలేదని కామెంట్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నట్లు బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. కోహ్లీ సతీమణి, నటి అనుష్క శర్మ డెలివరీ తేదీ జనవరిలో ఉండటంతో, ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు అతను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. విరాట్ అభ్యర్థనను మన్నించిన బీసీసీఐ పెటర్నటీ లీవ్‌ మంజూరు చేసింది. దాంతో తొలి టెస్ట్ అనంతరం విరాట్ స్వదేశానికి రానున్నాడు. కోహ్లీ లేకుండానే భారత్ తదుపరి మూడు టెస్ట్‌లు ఆడనుంది.

IPL 2020: Netizens troll Virat for skipping three tests against Australia

అయితే జట్టు ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత జీవితం కోసం కోహ్లీ ఇలా చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీతో పోలిక పెడుతూ కోహ్లీ వ్యవహారశైలిని విమర్శిస్తున్నారు. దేశం తరఫున ఆడటం కంటే వ్యక్తిగత విషయాలకే కోహ్లి ప్రాధాన్యం ఇస్తున్నాడని, కానీ ధోనీ మాత్రం జీవా(ధోని కూతురు) జన్మించిన సమయంలో భార్యాపిల్లలను వదిలి జట్టును ముందుకు నడిపించాడని గుర్తు చేస్తున్నారు. 2015 ప్రపంచకప్‌ టోర్నీ జరుగుతున్న సమయంలో ధోని సతీమణి సాక్షి జీవాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్‌ వార్మప్‌ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు(ఫిబ్రవరి 6న) జీవా జన్మించింది. ఆ సమయంలో.. ఇండియాలో ఉండకపోవడం వల్లే మీరు మీ తొలి సంతానానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలకు దూరమవుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ''అదేం లేదు. ప్రస్తుతం నేను దేశం తరఫున జాతీయ జట్టును ముందుకు నడిపించే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను. వేరే విషయాల గురించి అంతగా ఆలోచించడం లేదు. ప్రపంచకప్‌ ఆడటం చాలా ముఖ్యం'అంటూ అప్పట్లో మహీ సమాధానమిచ్చాడు.

తన తండ్రి చనిపోయినపుడు జట్టును గెలిపించేందుకు బాధను పంటిబిగువన భరించిన కోహ్లీ, ఇప్పుడు మాత్రం ఎందుకో అలా ఆలోచించలేకపోతున్నాడని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతని నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే.. ''బాగుంది.. ఇదొక పెద్ద వార్తే. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు తర్వాత, తన బిడ్డను చూసుకునేందుకు కోహ్లీ ఇండియాకు వస్తున్నాడు. మోడర్న్‌ ప్లేయర్‌‌కు ప్రొఫెషన్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ముఖ్యమే. అయితే కోహ్లీ లేకుంటే జట్టు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది''అని ట్వీట్‌ చేశాడు.

English summary
Twitter Brutally Trolls Virat Kohli After He Decides To Skip Last Three Tests in Australia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X