వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SRH vs RCB మ్యాచ్ చుట్టూ వివాదం: ఆ డెసిషన్‌పై సీనియర్ల షాక్: అంపైర్ల తీరుపై డౌట్స్

|
Google Oneindia TeluguNews
IPL 2020: no ball controversy in Sunrisers Hyderabad and during the match against RCB

షార్జా: విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చిన మ్యాచ్‌ చుట్టూ మరో వివాదం కమ్ముకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పిదాలు ఉన్నాయంటూ బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సమయంలోనే.. మరో కాంట్రవర్సీ చెలరేగింది. అది కూడా అంపైరింగ్‌పైనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంపైర్ తీసుకున్న నిర్ణయంపై కొందరు మాజీ క్రికెటర్లు.. యంగ్ బౌలర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా వారంతా రియాక్ట్ అయ్యారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో సన్ రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అంపైర్ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్ 10వ ఓవర్‌ను బెంగళూరు బౌలర్ ఇసురు ఉడన వేశాడు. ఆ ఓవర్ మూడోబంతిని ఉడన.. స్లోవర్‌గా సంధించాడు. దాన్ని కేన్ విలియమ్సన్ ఎదుర్కొన్నాడు. హై ఫుల్‌టాస్ రూపంలో వచ్చిన బాల్ అది. ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. ఒక పరుగు తీశాడు.

నడుము కంటే ఎత్తుకు.. భుజాల కింట కాస్త దిగువకు ఆ బాల్ దూసుకుని వచ్చింది. దాన్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. నడుముకంటే ఎక్కువ ఎత్తుకు, దాదాపుగా భుజాల వరకు దూసుకొచ్చినప్పటికీ.. దాన్ని నో బాల్‌గా అంపైర్ ప్రకటించకపోవడాన్ని కేన్ విలియమ్సన్ అసహనం వ్యక్తం చేశాడు. టర్బొనేటర్ హర్బజన్ సింగ్, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. నో బాల్‌గా అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. అంపైర్ స్పందించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

English summary
No ball controversy in Sunrisers Hyderabad and during the match against Royal Challengers Bangalore at Sharjah. The incident happened during the 10th over of the Sunrisers' chase when Kane Williamson was facing Isuru Udana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X