• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇప్పటికే ఎక్కవగా ఉన్నా...ఇక నావల్ల కాదు: ఈ సారి బిగ్‌బాష్ లీగ్‌‌కు స్టీవ్ స్మిత్ గుడ్‌బై

|

అబుదాబి: మరికొంత కాలం బయో బబుల్‌ వాతావరణంలో ఉండేందుకు ఇష్టపడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ ఈ ఏడాది బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) నుంచి తప్పుకున్నాడు. గత గస్టు నుంచి బయో బుడగలో ఉంటున్న స్మిత్‌.. బిగ్‌బాష్‌ తర్వాతి సీజన్‌లో తాను ఆడబోనని‌ తాజాగా ప్రకటించాడు. బయో బుడగలో ఎక్కువ రోజులు గడపడం కష్టమని పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించాడు. స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్‌, ప్యాట్ కమిన్స్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు గత ఆగస్టు నుంచి బయో బబుల్‌లోనే ఉంటున్నారు. ముందుగా ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లి అక్కడి నుంచి యూఏఈ చేరుకున్నారు. ఆగస్టు నుంచి ఇంటికి దూరంగా ఉండటంతో మానసికంగా ఒత్తిడి కలుగుతోందని స్మిత్‌ అంటున్నాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన స్మిత్‌.. 'నిజాయితీగా చెప్పాలంటే.. బిగ్‌బాష్‌ ఆడే అవకాశమే లేదు' అని అన్నాడు. స్మిత్‌ స్పష్టం చేసినా.. వార్నర్‌, కమిన్స్‌ బిగ్‌బాష్‌ ఆడడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. యూఏఈలో జరుగుతున్న టీ20 లీగులో స్మిత్ రాజస్థాన్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

IPL 2020: Not willing to stay anymore in Bio-bubble, Steve Smith says he will skip BBL 2020

'బయో బుడగలో ఉండటం ఇదే కొత్త. ఇలాంటి వాతావరణం ఇంకెంత కాలం ఉంటుందో తెలియదు. అంతా అనిశ్చితిగా ఉంది. మానసికంగా సానుకూలంగా ఉండటంతో కోచ్‌లు, మేనేజర్లతో నిరంతరం మాట్లాడుతున్నాం. సెలక్షన్‌కు సంబంధించిన ప్రశ్నలు కచ్చితంగా వస్తాయని తెలుసు. ఎందుకంటే బుడగకు కొద్దికాలం దూరమై మళ్లీ వస్తే.. మన స్థానంలో ఉన్నవారు అలాగే ఉంటే ఎవరికి చోటివ్వాలన్న సందేహాలైతే ఉంటాయి. ఏదేమైనప్పటికీ బుడగ వాతావరణం నుంచి సాధారణ స్థితికి చేరుకోవాలంటే కాస్త సమయం పట్టేలా ఉంది' అని స్టీవ్ స్మిత్‌ పేర్కొన్నాడు.

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ అదరగొట్టింది. అబుదాబి వేదికగా కింగ్స్ ల=ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్ (99; 63 బంతుల్లో, 6×4, 8×6) విధ్వంసం సృష్టించాడు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్‌ 17.3 ఓవర్లలోనే 3వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌ (50; 26 బంతుల్లో, 6×4, 3×6), సంజు శాంసన్‌ (48; 25 బంతుల్లో, 4×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో రాజస్థాన్‌ 12 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది.

English summary
Rajasthan Royals captain Steve Smith ruled out of Big Bash League 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X