వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: విరాట్ కోహ్లీ అలా వేస్తే.. హైదరాబాద్ ఆటగాడు రశీద్ ఖాన్ ఇలా వేశాడు..వైరల్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి చలాకీగా, మరోసారి దూకుడుగా, ఇంకొసారి గమ్మత్తుగా ప్రవర్తిస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు. ఈ సీజన్లో ఇతర ఆటగాళ్ల శైలిని కూడా అనుకరిస్తూ అభిమానులను అలరించాడు. ఇక ఎప్పటిలాగే ఐపీఎల్ 2020లో తన ఆటతో అభిమానులను అలరిస్తోన్న కోహ్లీ.. మైదానం వెలుపల కూడా ఫ్యాన్స్‌ను నవ్వులో ముంచెత్తుతున్నాడు. తాజాగా విరాట్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తనతో పాటు ఏబీ డివిలియర్స్, దేవదత్ పడిక్కల్, మొహ్మద్ సిరాజ్ నిలబడి ఉన్న ఫొటోను విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ఫొటో తనకు స్కూల్ డేస్‌ను గుర్తు చేసిందని పేర్కొన్నాడు. 'ఈ ఫొటో నా స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తోంది. ఒకే క్లాస్‌కు చెందిన నలుగురు స్టూడెంట్స్. ఏబీ డివిలియర్స్ అనే పిల్లాడు మాత్రమే హోం వర్క్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ఇబ్బందుల్లో ఉన్నామని మిగతా ముగ్గురికీ తెలుసు' అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ ఫొటోను కోహ్లీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్టు చేశాడు.

IPL 2020: Rashid Khan reply over Virat Kohlis tweet garners many likes

విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై క్రికెటర్లు అందరూ స్పందిస్తున్నారు. కోహ్లీ ట్వీట్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఫన్నీగా స్పదించాడు. 'టీచర్ మనకు హోం వర్క్ ఇచ్చిందనే విషయమే సిరాజ్‌కు తెలీదు' అని సరదాగా సెటైర్ వేశాడు. బెంగళూరు స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా సరదాగా స్పందించాడు. 'హోం వర్క్ చెక్ చేస్తారనే నేను క్లాస్‌కు వెళ్లడం ఎగ్గొట్టా' అని ట్వీట్ చేశాడు. నేనెప్పుడూ హోం వర్క్ టైంకు పూర్తి చేసేవాడినని పడిక్కల్ పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీకి సంబందించిన మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత మ్యాచులో కేకేఆర్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ చెదిస్తోంది. 13వ ఓవర్ల తర్వాత బెంగళూరు విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రసిద్ క్రిష్ణ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతికి విరాట్ కోహ్లీ 2 పరుగులు తీశాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. రెండో బంతి యార్కర్ పడగా.. పరుగేమి రాలేదు. ఒక పరుగు చేస్తే బెంగళూరు గెలిచినట్లే. అయితే మూడో బంతిని ఎదుర్కొన్న కోహ్లీ.. కీపర్ వెనకాలకు షాట్ ఆడాడు. ఒక పరుగు పూర్తి చేసిన కోహ్లీ.. మరో పరుగు కోసం పరుగులు పెట్టాడు. అవతలి బ్యాట్స్‌మన్‌ గుర్‌కీరత్‌మన్‌ సింగ్‌ కూడా పరుగు తీశాడు.

English summary
Kohli's tweet mentioning his school days goes viral, while SRH Rashid Khan tweets that Siraj had forgotten his homework.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X