• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వుయ్ కెన్..వుయ్ విల్..వుయ్ మస్ట్: గెలుపు కాంక్ష రగిల్చేలా: ధోనీసేన ప్లేఆఫ్ ఆశలపై ఆ ఆల్‌రౌండర్‌

|

అబుధాబి: అద్భుతాలకు, అస్థిరత్వానికి మారుపేరు క్రికెట్. ఏ క్షణమైనా అద్భుతాలు చోటు చేసుకోవచ్చు. ఫలితాలు తారుమారు కావచ్చు. దానికి కావాల్సింది..గెలవాలనే స్ఫూర్తి. గెలిచి తీరాలనే పట్టుదల..విజయాన్ని అందుకోవలనే అకాంక్ష. ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో అలాంటి అద్భుతాలే సాక్షాత్కరిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉండాల్సిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్.. హ్యాట్రిక్ విజయాలను సాధించడం దీనికి అద్దం పడుతోంది. వరుసగా మూడు విజయాలను అందుకున్న ఆ జట్టు అయిదో స్థానానికి ఎగబాకింది. మరో రెండు మ్యాచ్‌లను గెలిస్తే.. టాప్-3లో చోటు దక్కించుకుంటుంది.

పంజాబ్‌కు భిన్నంగా చెన్నై

పంజాబ్‌కు భిన్నంగా చెన్నై

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు పూర్తి భిన్నంగా ఉంటోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్-2020 టోర్నమెంట్ ఆరంభంలో టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది ధోనీ సేన. తొలి మ్యాచ్‌లో తడబడినప్పటికీ.. విజయాన్ని అందుకుంది. బోణీ చేసింది. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వరుసగా పరాజయాలు పలకరించాయి. కట్ట కట్టుకుని మీద పడ్డాయి. దీనితో చెన్నై టీమ్ కోలుకోలేక కుదేల్ అవుతోంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లను ఆడిన ఆ జట్టు ఏడింట్లో ఘోరంగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరింది. చివరి మ్యాచ్‌లో మరీ దారుణంగా 125 పరుగులే చేయగలిగింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అదే అత్యల్ప స్కోరు.

ప్లేఆఫ్ చేరాలంటే.

ప్లేఆఫ్ చేరాలంటే.

చెన్నై సూపర్ కింగ్స్ ఈ మెగా టోర్నమెంట్ ప్లే ఆఫ్ దశకు చేరితే. అదీ ఓ అద్భుతమే అవుతుంది. ఆడబోయే నాలుగు మ్యాచ్‌లనూ గెలిచి తీరాల్సిందే. ఇక చెన్నై టీమ్ వద్ద మరో ఆప్షన్ లేదు. ఆ గెలుపు మామూలుగా ఉండకూడదు. భారీ విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది. మిగిలిన జట్ల గెలుపోటములు కూడా చెన్నై సూపర్ కింగ్స్‌పై ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి ఈక్వేషన్స్ లేకుండా ప్లే ఆఫ్ చేరే పరిస్థితి మాత్రం చెన్నైకి లేదు. చెన్నై అలాంటి స్థితిలో ఉందా? అంటే అదీ లేదు. నాలుగు మ్యాచుల్లో ఏ ఒక్కటి ఓడినా తిరుగుముఖమే.

గెలుపు కాంక్ష రగిలించేలా..

గెలుపు కాంక్ష రగిలించేలా..

ఈ పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆసక్తి రేపుతోంది. తన టీమ్‌మేట్స్‌లో గెలుపు కాంక్షను రగిలించేలా కనిపిస్తోందా పోస్ట్. వుయ్ కెన్ విన్, వుయ్ మస్ట్ విన్.. వుయ్ విల్ విన్.. అనే పోస్టర్‌ను రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పిడికిలి బిగించిన చేతులను ముద్రించిన ఈ పోస్టర్.. తోటి క్రికెటర్లలో స్ఫూర్తి నింపడానికా అన్నట్లుగా ఉంది. దానికి అనుగుణంగానే స్లోగన్ప్ ఉన్నాయి. ఐపీఎల్-2020 సీజన్‌లో ఇంకో చెన్నై సూపర్ కింగ్స్ మరో నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. వాటిపైనే అందరి దృష్టీ నిలిచింది.

డీసెంట్‌గా జడేజా

డీసెంట్‌గా జడేజా

ఈ సీజన్‌లో రవీంద్ర జడేజా నిలకడగా రాణిస్తున్నాడు. అటు బౌలింగ్, ఆటు బ్యాటింగ్‌లో నిలకడను ప్రదర్శిస్తున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తోన్న ఈ గుజరాతీయుడు భారీ షాట్లను ఆడుతున్నాడు. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లను ఆడిన అతను 194 పరుగులు చేశాడు. నాలుగు వికెట్లను పడగొట్టాడు. 164.40 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. బ్యాటింగ్ సగటు 48.50గా ఉంది. అతని అత్యధిక స్కోరు 50. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో.. అతని గణాంకాలు మరింత మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు.

English summary
Chennai Super Kings allrounder Ravindra Jadeja took to his official Instagram account and posted a story with the text, “We can win, We will win and We must win.” He still believes in the team to go Play Off, and has posted an inspirational story on his Instagram account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X