బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IPL 2020: కొత్త వ్యాపారంలోకి రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు..ఏంటో తెలుసా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త బిజినెస్‌ను ప్రారంభించింది. ఇ-గేమింగ్‌లో అడుగు పెట్టింది. కొత్తగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. ఇ-గేమింగ్ ప్లాట్‌ఫామ్‌పై సుదీర్ఘకాలం పాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికోసం కొన్ని గేమింగ్ కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోబోతోంది. ఇందులో భాగంగా- గేమ్జోప్ అనే గేమింగ్ కంపెనీతో ఒప్పందాన్ని కుదర్చుకుంది. మరిన్ని గేమింగ్ కంపెనీలతో భాగస్వామ్యం కాబోతోంది.

ప్రస్తుతం ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆర్సీబీ యాప్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఇ-గేమింగ్ మొబైల్ అప్లికేషన్స్‌ను కొత్తగా రూపొందించబోతోంది. ఏడాదిలో నెలన్నర రోజుల పాటు మాత్రమే ఐపీఎల్ షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రమే తమ జట్టు క్రికెట్ ప్రేమికుల ముందుకు వస్తుందని, మిగిలిన రోజులు అభిమానులకు దూరంగా ఉంటుందని చెప్పారు. ఆ లోటును భర్తీ చేయడానికి తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధిపతి రాజేష్ మీనన్ వెల్లడించారు.

 IPL 2020: Royal Challengers Bangalore comesup with new e-gaming on their mobile app

ఇక ఇ-గేమింగ్ రూపంలో ఏడాది పొడవునా అభిమానులను ఆలరించేలా మొబైల్ యాప్‌ను రూపొందించామని ఐపీఎల్ కొనసాగుతున్నప్పుడు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా తమ జట్టు క్రికెటర్లతో అభిమానులు ఇ-గేమింగ్, మొబైల్ యాప్ ద్వారా టచ్‌లో ఉండొచ్చని పేర్కొన్నారు. ఇ-గేమింగ్ కోసం తాము గేమ్జోప్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చకున్నట్లు రాజేష్ మీనన్ చెప్పారు. ఐపీఎల్-2020 సీజన్‌లో జట్టు అద్భుతంగా ఆడుతోందంటే.. దానికి కారణం అభిమానుల ప్రోత్సహామేనని, అందుకే వారికి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను కల్పించడానికి తాము ఇ-గేమింగ్ ప్లాట్‌ఫామ్‌పై అడుగు పెట్టామని అన్నారు.

English summary
The Indian Premier League (IPL) franchise Royal Challengers Bangalore (RCB) has launched e-gaming on their mobile application as part of a long-term business strategy for the platform as part of a long-term business strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X