వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీ..సో కాల్డ్ లెజెండ్: ఒక్క ఘటనతో విలన్: పరువు పోయినట్టేనా? చెన్నై సూపర్ కింగ్స్ బ్యాన్ కోసం

|
Google Oneindia TeluguNews

దుబాయ్: సమకాలీన క్రికెట్‌లో టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న పేరు అసాధారణమైనది. క్రికెట్ లెజెండ్‌గా ఆయనను అభివర్ణిస్తుంటారు అభిమానులు. సచిన్ టెండుల్కర్ రిటైర్‌మెంట్ తరువాత.. ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏకైక క్రికెటర్ అతనొక్కడే. ఆపత్కాలంలో జట్టును ఆదుకునే ఆపద్బాంధవుడిగా ఆరాధిస్తుంటారు. తన వ్యూహాలతో ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించే సత్తా ధోనీకి ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఒక్క ఘటనతో విలన్‌గా మారిపోయాడేంటీ?

ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కేప్టెన్సీ పట్ల అపారమైన ప్రేమాభిమానాలను కురిపిస్తుంటారు. అలాంటి ధోనీ ప్రస్తుతం విలన్‌గా కనిపిస్తున్నాడు అభిమానుల కంటికి. స్పోర్టివ్ ఏదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ధోనీ వ్యవహరించిన తీరు పట్ల మండిపడుతున్నారు.

స్పోర్టివ్‌నెస్ లేదా?

కేప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీ అంపైర్‌‌ను శాసించే స్థాయికి దిగజారాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రీడాస్ఫూర్తిని ఏ మాత్రం చాటుకోలేకపోయాడని, అడ్డదారుల్లో మ్యాచ్‌ను గెలవడానికీ వెనుకాడబోడనే అపవాదును ధోనీ మూటగట్టుకుంటున్నాడు. క్రికెట్ మ్యాచుల్లో అంపైర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. అందులో తిరుగులేదు. అలాంటి అంపైర్.. తీసుకునే నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేసేలా ధోనీ ప్రవర్తించాడని అంటున్నారు.

వైడ్ యార్కర్‌గా

సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 11 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన సమయంలో బౌలింగ్ దిగాడు శార్దుల్ ఠాకూర్. 19వ ఓవర్ రెండో బంతిని వైడ్ యార్కర్‌గా వేశాడు. దానితో ఓ పరుగు హైదరాబాద్ స్కోరుబోర్డులో చేరింది. ఆ తరువాతి బంతిని కూడా బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వేయడానికి ప్రయత్నించాడు. అదీ వైడ్ యార్కర్‌గానే మారింది. క్రీజ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రషీద్ ఖాన్ దాన్ని అందుకోలేకపోయాడు. వైడ్ లైన్ మీదుగా వెళ్తోన్న బంతిని ఆడటానికి ప్రయత్నించాడతను. కనెక్ట్ కాలేదు.

వైడ్ ఇచ్చి ఉంటే..

దీనితో స్టెయిట్ అంపైర్ పాల్ రీఫెల్.. ఆ బంతిని వైడ్‌గా ప్రకటించబోయాడు. రెండు చేతులను బార్లా చాపబోయాడు. అదే సమయంలో ధోనీ గట్టిగా అరిచాడు. అది వైడ్ కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వికెట్ల వెనకల నుంచి ధోనీ పిచ్ వద్దకు వచ్చాడు. శార్దుల్ ఠాకూర్‌
అతనితో జత కలిశాడు. అది వైడ్ కాదని చెప్పాడు. దీనితో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వైడ్ సిగ్నల్ ఇవ్వలేదు. నిజానికి- అది వైడ్ బాల్. రీప్లే ఈ విషయం స్పష్టంగా కనిపించింది. వైడ్ బాల్‌ను నిర్ధారించడానికి ఉద్దేశించిన ట్రామ్‌ లైన్‌ అవతలి వైపు నుంచి ఆ బాల్ దూసుకెళ్లడం రీప్లేలో కనిపించింది.

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాన్ కోసం..

ఆ బంతిని వైడ్‌గా ప్రకటించి ఉన్నప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ గెలుపుపై పెద్దగా ప్రభావం పడబోయేది కాదనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తమౌతున్నాయి. 11 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో టెయిలెండర్లు ఆడుతున్నందున.. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు సాధ్యం కాకపోవచ్చనీ, అలాంటి సందర్భంగా ధోనీ.. ఒక్క వైడ్ కోసం అంపైర్‌ను ప్రభావితం చేయడం సరికాదని అంటున్నారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్ నుంచి శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Chennai Super Kings’ skipper MS Dhoni has found himself at the receiving end of criticism for his conduct during the clash last night between Chennai Super Kings and Sunrises Hyderabad. The game ended up on a controversial note. The on-field umpire Paul Reiffel was about to give a wide however he changed his decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X