• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPL 2020: ధోనీని విమర్శిస్తున్న వేళ... కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమన్నారంటే..?

|

మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ధూం ధాం మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపాలైంది. అయితే ధోనీ ఉండి కూడా మ్యాచ్ గెలవకపోవడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. ఈ క్రమంలోనే ధోనీపై కొన్ని విమర్శలు వస్తున్న సమయంలో అతనికి అండగా నిలిచారు జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. ధోనీ చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అంతేకాదు తిరిగి ధోనీని ఫినిషర్‌గా చూసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పి ధోనీకి మద్దతుగా నిలిచాడు స్టీఫెన్ ఫ్లెమింగ్.

మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తుండగా ధోనీ మాత్రం ఓ ప్రయోగం చేశామని మాత్రం చెప్పుకొచ్చాడు. అయితే ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం సరైనదే అని ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆ స్టార్ క్రికెట్ మైదానంలో అడుగుపెడుతున్నాడని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. ధోనీ బరిలోకి దిగే సరికి 14వ ఓవర్ జరుగుతోందని ఆ సమయం చాలా క్లిష్టమైన సమయమని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. ధోనీ తిరిగి ఝూలు విదిల్చడానికి మరికొంత సమయం పడుతుందని అది ఎంతో దూరంలో లేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ తమ జట్టు కెప్టెన్‌ పై కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. మొదట్లో కాస్త తడబడ్డా చివరికి వచ్చేసరికి ధోనీ బాదిన సిక్సులే నిదర్శనం అని ఆ వేడి ఇంకా తగ్గలేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు.

IPL 2020: Stephen Fleming backs Dhoni after CSK loss, says hes coming after a long break

ఇక జట్టు ప్రదర్శనపై మాట్లాడిన స్టీఫెన్... ఓవరాల్‌గా చెన్నై జట్టు మంచి ఆటతీరును కనబర్చిందని అన్నారు. ఫాఫ్ డూప్లెసిస్ తన ఫామ్‌ను కొనసాగించాడని ఈ మాజీ కివీస్ ఆటగాడు కితాబిచ్చాడు. బ్యాటింగ్ ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉందన్న స్టీఫెన్ ఫ్లెమింగ్... రానున్న మ్యాచుల్లో చెన్నై రాణిస్తుందని చెప్పాడు. ఇదిలా ఉంటే చివరి ఓవర్లో 38 పరుగులు కావాల్సి ఉండగా ధోనీ మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. అయితే ధోనీకంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్‌లను ముందుగా ప్రమోట్ చేయడం అది ఆటలో వ్యూహమే అని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. ఇతరులకు ఛాన్స్ ఇద్దామనే అలా చేశామని వెల్లడించాడు.

చెన్నై జట్టు భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆశలు కోల్పోయిందని ఆ సమయంలో కరన్ దూకుడును ప్రదర్శించి తిరిగి ఆశలను సజీవం చేశాడని చెప్పిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. కరన్ పవర్ ఏంటో చూపాడన్నాడు. ఇక తొలిమ్యాచ్ ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఆ దూకుడును కొనసాగించాలన్న ఉద్దేశంతోనే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసినట్లు చెప్పాడు స్టీఫెన్ ఫ్లెమింగ్. ఎందుకంటే చెన్నై జట్టులో మంచి సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని చెప్పాడు. తమకున్న వనరులను చాలా వ్యూహాత్మకంగానే వినియోగించుకున్నామని చెప్పాడు స్టీఫెన్ ఫ్లెమింగ్.

English summary
MS Dhoni walked out to bat at No. 7, which had the cricket world talking, but Fleming called it a sensible move considering Dhoni is coming into the IPL without much cricket behind him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X