• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిక్చర్ క్లియర్: సన్‌రైజర్స్‌కు డూ ఆర్ డై: ఎగరేసుకెళ్లడానికి రెడీగా నైట్ రైడర్స్: షార్జాలో ఎలా?

|

షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 చివరిదశకు వచ్చేసింది. ఇంకొక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసిపోతుంది. అలాగే- ప్లేఆఫ్‌కు చేరే నాలుగో జట్టు ఏదనేది తేలిపోతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్‌లో అడుగు పెట్టేశాయి. నాలుగో టీమ్ ఏదనేది.. ఈ సాయంత్రం షార్జా స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో స్పష్టమౌతుంది. ఈ స్థానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ పోటీ పడుతున్నాయి.

గెలిస్తేనే.. నిలిచేది..

గెలిస్తేనే.. నిలిచేది..

ఈ చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు గెలిస్తేనే.. నేరుగా ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. లేదంటే ఆ అవకాశాన్ని కోల్‌కత నైట్ రైడర్స్ ఎగరేసుకెళ్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నైట్ రైడర్స్, సన్ రైజర్స్ జట్లు నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కత ఖాతాలో 14 పాయింట్లు, సన్ రైజర్స్ అకౌంట్‌లో 12 పాయింట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌తో షార్జాలో ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే.. 14 పాయింట్లను అందుకుంటుంది. పాయింట్ల సమానంగా ఉన్నప్పటికీ.. నైట్ రైడర్స్‌తో పోల్చుకుంటే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్నందున.. సన్ రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.

ముంబైపై గెలవడమే అసలు పరీక్ష

ముంబైపై గెలవడమే అసలు పరీక్ష

చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్ రైజర్స్ ఎలా గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్‌ కంటే బలంగా ఉంది ముంబై. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పకడ్బందీగా ఉంది. నిప్పులు చెరిగే బంతులను సంధించగల బౌలర్లు ఉన్నారు. పిడుగుల్లాంటి షాట్లను ఆడగల బ్యాటింగ్‌ వీరులతో నిండి ఉందా టీమ్. రోహిత్ శర్మ లేనప్పటికీ.. అతని స్థానాన్ని కీరన్ పొలార్డ్ భర్తీ చేశాడు. క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి హిట్లర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ఆల్‌రైండర్లతో తొణికసలాడుతోందా టీమ్. ఈ సీజన్‌లో సమష్టిగా రాణిస్తోంది. అన్నింటి కంటే ముందే ప్లేఆఫ్‌లో పాగా వేసింది.

మిడిలార్డర్ బలహీనం..

మిడిలార్డర్ బలహీనం..

ముంబై ఇండియన్స్‌తో పోల్చుకుంటే.. సన్ రైజర్స్ కాస్త బలహీనమే. మిడిలార్డర్ చెప్పుకోదగ్గ బలంగా లేదు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో లేదా వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే మినహాయిస్తే మిడిలార్డర్‌లో నిలదొక్కుకుని భారీ షాట్లను ఆడే బ్యాట్స్‌మెన్ లేడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కొత్త కుర్రాడు అబ్దుల్ సమద్‌‌కు భారీ షాట్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ.. అతను తడబడుతున్నాడు. టెయిలెండర్లలో జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ దూకుడుగా ఆడగలరు. వారు ఎంత సేపు క్రీజ్‌లో నిలదొక్కుకుంటారనే దాని మీదే టీమ్ ఆధారపడి ఉంది. చిన్న స్టేడియం షార్జాలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ల దూకుడును ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.

హెడ్ టు హెడ్.. సన్ రైజర్స్ గుడ్

హెడ్ టు హెడ్.. సన్ రైజర్స్ గుడ్

ఇప్పటిదాకా ఐపీఎల్‌లో సన్ రైజర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచుల్లో రెండు జట్లూ సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటిదాకా మొత్తం 15 సార్లు ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి. ఇందులో ముంబై-8, హైదరాబాద్ ఏడుసార్లు విజయం సాధించాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న ముంబై మీద ఏడుసార్లు విజయం సాధించడమంటే మాటలు కాదు. గుడ్ ట్రాక్ రికార్డ్ ఉన్నట్టే లెక్క. ఐపీఎల్-2020లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఇదివరకు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

English summary
Sunrisers Hyderabad had to topple the top-three teams to make the playoffs. Having seen off the Delhi Capitals and the Royal Challengers Bangalore, SRH now run into the table-topping Mumbai Indians in the last league fixture of IPL 2020. If they win, they go to the playoffs on net run-rate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X