• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPL 2020: ఐపీఎల్ ముందు వంటలక్క బిగ్ బాస్ ఢమాల్.. తొలి మ్యాచ్ వ్యూయర్షిప్ వావ్..!

|

ఓ వైపు ఐపీఎల్.. మరోవైపు వంటలక్క సీరియల్, ఇంకోవైపు బిగ్ బాస్ రియాల్టీ షో. ఈ మూడు టీవీల్లో చూడాల్సి రావడంతో పోటీ బాగా పెరిగింది. అయితే ఈ మూడింటి మధ్య ఐపీఎల్ ఫుల్ స్వింగ్‌తో నెగ్గుకొచ్చింది. ఈ విషయం బార్క్ రేటింగ్స్ ద్వారా తెలుస్తోంది.

సరికొత్త రికార్డు

సరికొత్త రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఎప్పటిలా కాకుండా ఈ సారి మరింత ఆసక్తిగా సాగుతోంది. ఇందుకు కారణం కోవిడ్‌తో ప్రేక్షకులు స్టేడియంలోకి అనుమతించక పోవడమే. ప్రేక్షకులు భౌతికంగా లేకపోతేనేమీ... ఆ ఎఫెక్ట్ మాత్రం టీవీల్లో చూస్తున్న వీక్షకులకు కల్పించారు నిర్వాహకులు. ఒక్క ప్రేక్షకులు, చీర్ గర్ల్స్ మాత్రమే లేరు.. మిగితావన్నీ అంటే అదే ఫుల్ లెంగ్త్‌ ఫన్‌తో ఈ సారి ఐపీఎల్ సాగుతోంది. ఇక సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇటు అభిమానులు అటు స్పోర్ట్స్ లవర్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఎంతలా అంటే ఆ ఒక్కరోజే దాదాపు 20 కోట్ల మంది వీక్షించారట. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా మంగళవారం రోజున ట్వీట్ చేశారు.

20 కోట్ల మంది వీక్షించారట

బార్క్ విడుదల చేసిన రేటింగ్స్ ప్రకారం ఐపీఎల్ 13వ సీజన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందన్నారు. ఏకంగా 20 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను తిలకించారని షా ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌ ప్రారంభ మ్యాచ్‌కు ఎప్పుడూ ఇంతటి వ్యూయర్షిప్ లేదని ట్వీట్ చేస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, డిస్నీప్లస్ హాట్ స్టార్‌కు థ్యాంక్స్ చెప్పారు జైషా.

 హాట్ స్టార్ పై 8.1 మిలియన్ మంది..

హాట్ స్టార్ పై 8.1 మిలియన్ మంది..

సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తోంది స్టార్ స్పోర్ట్స్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఇదిలా ఉంటే గురువారం రోజున ఐపీఎల్ వ్యూయర్షిప్‌ను బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్‌ బార్క్ అధికారికంగా విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఇక ఇంతటి భారీ వ్యూయర్షిప్ ఐపీఎల్‌కు ఇచ్చినందుకు ఐపీఎల్ కూడా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అంతకుముందు మలేషియాకు చెందిన లెట్స్ ఓటీటీ అనే డిజిటల్ మీడియా సంస్థ మరో రిపోర్టును ఇచ్చింది. డిస్నీ హాట్‌స్టార్‌లపై 8.1 మిలియన్ మంది ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను వీక్షించినట్లు తెలిపింది.

 బిగ్‌ బాస్, వంటలక్కలు ఢమాల్

బిగ్‌ బాస్, వంటలక్కలు ఢమాల్

ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సాయంత్రం 7:30 గంటలు కాగానే ప్రతి ఇళ్లు కార్తీక దీపం అనే సీరియల్‌కు అతుక్కు పోతుంది. వంటలక్కకు విపరీతమైన అభిమానులున్నారు. అంతెందుకు ఈ మధ్యే తన సీరియల్ చూసేందుకు ఓ అభిమానికి వంటలక్క ఏకంగా టీవీనే ఇంటికి పంపింది. ఇక రాత్రి 9:30 గంటలకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఉంది. ఇక గతవారానికి బిగ్‌ బాస్ షోకు అత్యధిక టీఆర్పీలు వచ్చినట్లు స్వయంగా నాగార్జునే ఆదివారం రోజు ప్రకటించగా ఇంటి సభ్యులందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా బొమ్మ ఐపీఎల్ వైపు మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
The opening match of the Dream11 Indian Premier League on September 19 garnered a viewership of 20 crore people, setting a ‘new record’, Jay Shah, Secretary, Board of Control for Cricket in India (BCCI), tweeted on Tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X