• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPL 2020:హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేయండి ..ఐసీసీకి సచిన్ విజ్ఞప్తి

|

ముంబై: ఆట ఏదైనా గాయాలు సహజమే. అయితే క్రికెట్‌లో మాత్రం వీటి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. గాయం కారణంగా కొన్నిసార్లు ఆటకు దూరమైన సందర్భాలు ఉంటే.. మరికొన్ని సార్లు ఏకంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బౌలర్‌ విసిరిన బంతి హెల్మెట్‌ ‍కింద.. మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్‌.. రెండు రోజులు ఆసుపత్రిలో పోరాడి మరణించాడు. అది క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. గతేడాది ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో భారత ఆటగాడు రిషబ్ పంత్ (కాంకషన్) కూడా స్వల్పంగా గాయపడ్డాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కూడా భారత ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్ గాయపడ్డాడు. అక్టోబర్‌ 24వ తేదీన కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న విజయ్‌.. పరుగు తీసే క్రమంలో పంజాబ్ ఆటగాడు నికోలస్‌ పూరన్‌‌ విసిరిన త్రో అతని మెడకు బలంగా తగిలింది. దీంతో విజయ్‌ తీవ్రమైన గాయంతో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే అదృష్టవశాత్తు అతను హెల్మెట్‌ ధరించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.

IPL 2020: Wearing Helmet should be mandatory, Sachin requests ICC after Vijayshankars incident

ఆపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన విజయ్ శంకర్ ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగాడు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ కారణంగా విజయ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అయితే విజయ్ మెడకు బంతి బలంగా తగలడంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ స్పందించాడు. ఐసీసీ రూల్స్ మార్చాలని కోరాడు. బంతి వేసేది స్పిన్నరైనా, పేసర్ అయినా.. బ్యాట్స్‌మన్‌ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించే నిబంధనను తీసుకురావాలని ఐసీసీని ట్విట్టర్ వేదికగా క్రికెట్ దేవుడు కోరాడు.

'క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాళ్లు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌కు వస్తే బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌ ధరించడం.. స్పిన్నర్‌ బౌలింగ్‌కు వస్తే తీసేయడం చేస్తున్నారు. కానీ ఈ పద్దతిని మార్చాలి. బంతి వేసేది స్పిన్నరైనా, ఫాస్ట్‌ బౌలరైనా.. బ్యాట్స్‌మన్‌ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించే నిబంధనను తీసుకురావాలి. హెల్మెట్‌ ఆటగాళ్లకు రక్షణగా నిలుస్తుంది. ఈ నిబంధనను తప్పనిసరి చేయకపోతే ఆటగాళ్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఇకపై స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ ఏదైనా సరే హెల్మెట్‌ తప్పనిసరి ధరించాలనే నిబంధనను తీసుకురావాలని ఐపీసీని విజ్ఞప్తి చేస్తున్నా' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

English summary
IPL 2020: Batting legend Sachin Tendulkar asks ICC to make helmet mandatory after Sunrisers Hyderabad's batsman Vijay Shankar's incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X