వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోల్డ్ కలర్‌లో మెరిసిపోయిన ఆల్ట్రోజ్ కారు ఎవరికి దక్కిందంటే..? సన్‌రైజర్స్‌కూ ప్రైజ్‌మనీ

|
Google Oneindia TeluguNews

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టోర్నమెంట్ మ్యాచ్‌లు నడుస్తోన్న సమయంలో క్రికెటర్ల పెర్‌ఫార్మెన్స్‌తో పాటు వ్యూవర్స్ దృష్టిని ఆకర్షించింది.. ఆల్ట్రోజ్ కారు. స్టేడియంలో ఓ వైపు డెకరేట్ చేసిన డయాస్‌పై గోల్డ్ కలర్‌లో మెరిసిపోతూ కనిపించిన ఆ కారును ఎవరు దక్కించుకున్నారనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్-2020 సీజన్ ఫైనల్ మ్యాచ్ ముగియడంతో నెటిజన్ల ఫోకస్.. ఆ కారు మీదే పడింది. దాన్ని ఎవరు సొంతం చేసుకున్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఆ కారున బీసీసీఐ ఎవరికి ఇచ్చింది? ఎందుకు ఇచ్చిందంటూ సెర్చ్ చేస్తున్నారు.

Recommended Video

IPL Final : Will Rohit Sharma Make It 5 For Mumbai Indians ? | Mi vs Dc | Oneindia Telugu
విన్నర్ ప్రైజ్ మనీ ఇదీ..

విన్నర్ ప్రైజ్ మనీ ఇదీ..

ఐపీఎల్-2020 టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్‌కు భారీ ప్రైజ్‌మనీ దక్కింది. దాని విలువ 20 కోట్ల రూపాయలు. రన్నరప్‌‌గా నిలిచిన ఢిల్లీ కేపిటల్స్‌కు 12 కోట్ల 50 లక్షలను ఇచ్చారు. ప్లే ఆఫ్‌ దశలో ఓడిపోయిన రెండు జట్లకు కూడా ఈ సారి ప్రైజ్‌మనీని ప్రకటించారు. ప్లేఆఫ్‌లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు 6,37,50,000 చొప్పున ప్రైజ్‌మనీని ఇచ్చారు. ప్లేఆఫ్ దశలో ముంబై ఇండియన్స్ , ఢిల్లీ కేపిటల్స్ చేతుల్లో ఈ రెండు జట్లూ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

కంప్లీట్ అవార్డ్ లిస్ట్..

కంప్లీట్ అవార్డ్ లిస్ట్..

టోర్నమెంట్ ముగిసిన వెంటనే.. వేర్వేరు కేటగిరీల్లో బెస్ట్ పెర్మార్మెన్స్‌గా నిలిచిన ప్లేయర్‌కు అవార్డులను ప్రకటించడాన్ని బీసీసీఐ ఆనవాయితీగా పెట్టుకుంది. ప్రత్యేక పరిస్థితులే అయినప్పటికీ.. ఈ సారి కూడా దాన్ని కొనసాగించింది. అత్యధిక పరుగులను సాధించిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్, అందరి కంటే ఎక్కువ వికెట్లను పడగొట్టిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ కింద అవార్డులను అందజేసింది.

అవార్డుల్లోనూ ముంబై టాప్..

అవార్డుల్లోనూ ముంబై టాప్..

ఆ లిస్ట్ ప్రకారం ఆరెంజ్ క్యాప్-కేఎల్ రాహుల్ (14 ఇన్నింగ్స్‌ల్లో 670 పరుగులు), పర్పుల్ క్యాప్- కగిసో రబడా (17 ఇన్నింగ్స్‌ల్లో 30 వికెట్లు), ఎమర్జింగ్ ప్లేయర్ఆఫ్ ది ఇయర్ అవార్డ్- దేవదత్ పడిక్కల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఫెయిర్ ప్లే అవార్డ్-ముంబై ఇండియన్స్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్- కేఎల్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), మోస్ట్ సిక్సెస్ అవార్డ్- ఇషాన్ కిషాన్ (ముంబై ఇండియన్స్-30 సిక్స్‌లు), పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-ట్రెంట్ బౌల్ట్ (ముంబై ఇండియన్స్-పవర్ ప్లేలో 16 వికెట్లు), మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్-జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్) అవార్డులు దక్కాయి.

ఆల్ట్రోజ్ కారు ఎవరికి దక్కిందంటే..?

ఆల్ట్రోజ్ కారు ఎవరికి దక్కిందంటే..?

ఈ సీజన్‌లో బెస్ట్ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఇచ్చే అవార్డు ఇది. దీన్ని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొల్లార్డ్ దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో అతని స్ట్రైక్ రేటు 191.42. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ కేటగిరీలో కీరన్ పొలార్డ్ టాప్‌లో నిలిచాడు. అవార్డు కింద ఈ కారును అందుకున్నాడు. మొత్తం 12 ఇన్నింగుల్లో పొల్లార్డ్ 268 పరుగులు చేశాడు. కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్‌కే చెందిన హార్దిక్ పాండ్యా సూపర్ స్ట్రైకర్ రేట్ కోసం పొల్లార్డ్‌తో పోటీ పడ్డాడు.13 ఇన్నింగుల్లో 281 పరుగులు చేసిన హార్ధిక్ స్ట్రైక్ రేటు 178.98. రెండో స్థానంలో నిలిచాడతను.

టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయిన ఢిల్లీ..

టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయిన ఢిల్లీ..

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్), రిషభ్ పంత్( 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) రాణించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ (3/30) ఢిల్లీ పతనాన్ని శాసించగా.. కౌల్టర్ నీల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

English summary
BCCI organized a grand presentation ceremony after the IPL 2020 final ended. Along with the Orange Cap, Purple Cap, and the Best Emerging Player of the Season award. Tata Altroz was one of the sponsors of IPL 2020 in the UAE. Tata Altroz Super Striker of the Season awards goes to Kieron Pollard with Strike Rate of 191.42
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X