• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తుస్సు మంటోన్న యంగ్ గన్స్: ఉడుకు నెత్తురు అప్పుడే చల్లారిందా: ఆ త్రయంపై డౌట్స్: ఉన్నట్టుండి

|

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020కు మరో పేరు కూడా ఉంది. ఇండియన్ ప్రొడక్ట్ లీగ్ అని పిలుస్తుంటారు. యంగ్ క్రికెటర్లను తయారు చేసే ఫ్యాక్టరీగా ఐపీఎల్‌కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న క్రికెటర్లందరూ ఐపీఎల్ ప్రొడక్టే. శిఖర్ ధావన్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్.. ఇలా జాతీయ జట్టు మొత్తం ఐపీఎల్ అందించిన ఆరితేరిన క్రికెటర్లతో తొణికిసలాడుతోంది. అదే లైన్‌లో ఇంకా చాలామంది యంగ్ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ధోనీ..అలసిపోయాడా? ఐపీఎల్‌కూ గుడ్‌బై? ప్రాణంగా భావించే జెర్సీ..ఆ బ్యాట్స్‌మెన్‌కు గిఫ్ట్ధోనీ..అలసిపోయాడా? ఐపీఎల్‌కూ గుడ్‌బై? ప్రాణంగా భావించే జెర్సీ..ఆ బ్యాట్స్‌మెన్‌కు గిఫ్ట్

జాతీయ జట్టుకు తొలి గడప.. ఐపీఎల్..

జాతీయ జట్టుకు తొలి గడప.. ఐపీఎల్..


ఐపీఎల్ సీజన్‌లో మెరుగ్గా రాణించితే.. జాతీయ జట్టులో ఖాయం అనే నమ్మకం వర్ధమాన క్రికెటర్లలో బలంగా నాటుకునిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. ఒక్కో ఐపీఎల్ ఫ్రాంఛైజీలో వేర్వేరు దేశాలకు చెందిన క్రికెటర్లు ఉండటం, వారికి బౌలింగ్ చేసే విధానం.. వారి నుంచి బుల్లెట్లలా దూసుకొచ్చే బంతులను ధీటుగా ఎదుర్కొనడం వంటి వైవిధ్య వాతావరణంలో తమ ప్రతిభను చాటుకోగలిగితే.. జాతీయ జట్టులో చోటు దక్కడం సులభమనే అభిప్రాయం యంగ్ క్రికెటర్లలో ఉంది. టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి ఐపీఎల్‌ను తొలి గడపగా భావిస్తుంటారు.

ఆ త్రయం..ఘోరంగా విఫలం..

ఆ త్రయం..ఘోరంగా విఫలం..

అలాంటి ఐపీఎల్‌ను సద్వినియోగం చేసుకోవడంలో కొంతమంది యంగ్ క్రికెటర్స్ ఘోరంగా విఫలమౌతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభంలో అద్భుతంగా రాణించిన వారు.. మ్యాచ్‌లు కొనసాగుతున్న కొద్దీ శక్తి సామర్థ్యాలను కోల్పోతున్నారు. అంచనాలను తలకిందులు చేస్తున్నారు. మొదట్లో దూకుడుగా ఆడుతూ.. టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయమంటూ ప్రశంసలు అందుకున్న క్రికెటర్లు.. ఇప్పుడు బోర్లా పడుతున్నారు. జాతీయ జట్టులో ఆడిన అనుభవం ఉన్న పృథ్వీ షా, సంజు శాంసన్, శుభ్‌మన్ గిల్ వంటి కొందరు క్రికెటర్లు తమ ప్రతిభను చాటుకోవడానికి అందివచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది.

వరుస డకౌట్లు..

వరుస డకౌట్లు..

ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఉన్నట్టుండి ఫామ్‌ను కోల్పోయాడు. ఈ ఐపీఎల్ ఆరంభంలో గర్జించిన అతను.. ఇప్పుడు తుస్సుమంటున్నాడు. పృథ్వీ షా ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్‌లను ఆడాడు. 202 పరుగులు చేశాడు. ఇందులో సగానికి పైగా రన్స్ ఆరంభ మ్యాచ్‌లల్లో వచ్చినవే. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడతను. 5, 64, 66, 42,19,19, 4, 0, 0.. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా పృథ్వీ షా చేసిన స్కోర్. ఆరంభంలో విజృంభించిన అతను ఒక్కసారిగా చల్లారిపోయాడు. ఫామ్‌ను కోల్పోయాడు. ఏ క్రికెటరైనా సీజన్ మధ్యలో ఫామ్‌ను కోల్పోవడం ఆశ్చర్యకరమే.

 టీ20 జట్టులో చోటు ఖాయం అనుకునే సమయంలో..

టీ20 జట్టులో చోటు ఖాయం అనుకునే సమయంలో..

మరో యంగ్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌దీ ఇదే దారి. వరుసగా అతను విఫలమౌతున్నాడు. పృథ్వీ షా తరహాలోనే ఆరంభంలో ధాటిగా ఆడిన అతను ప్రస్తుతం పరుగులు తీయడానికి నానా తంటాలు పడాల్సి పడుతున్నాడు. 74, 85, 8, 4, 0, 5, 26, 25, 9, 0.. ఇదీ అతని స్కోర్ కార్డ్. తొలి రెండు మ్యాచ్‌లో గర్జించిన్ ఈ మలయాళీ యంగ్ గన్.. క్రమంగా చల్లారింది. టీ20 జాతీయ జట్టులో స్థానం ఖాయం అనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిలకడలేమిని ప్రదర్శిస్తున్నాడతను. ఇక ముందు జరిగే మ్యాచ్‌లల్లో అతని ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

  IPL 2020: No Spark In Youngsters says MS Dhoni, Slammed over ‘Outrageous’ Comment | CSK vs RR
  శుభ్‌మన్ గిల్‌దీ అదే దారి..

  శుభ్‌మన్ గిల్‌దీ అదే దారి..

  మరో యంగ్ క్రికెటర్.. శుభ్‌మన్ గిల్‌దీ అదే పరిస్థితి. ఆరంభ మ్యాచ్‌లల్లో అదరగొట్టిన అతని ప్రదర్శన ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతోన్న గిల్.. అనవసరపు షాట్లను కొట్టి అవుటవుతున్నాడు. కుదురుకున్నాడనుకునే లోపే పెవిలియన్ దారి పడుతున్నాడు. బ్యాటింగ్ యావరేజ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పృథ్వీ షా, సంజు శాంసన్‌లతో పోల్చుకుంటే మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఆ ఇద్దరిలాగే నిలకడలేమిని ఎదుర్కొంటున్నాడు శుభ్‌మన్ గిల్. అది అతని పాలిట అశుభంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

  English summary
  IPL 2020: It's been a strange season for India's next-gen stars, especially the likes of Shubman Gill, Prithvi Shaw and Sanju Samson as the trio has flattered to deceive in the UAE
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X