చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IPL auction: మరో ఫాస్ట్ బౌలర్‌పై ఏకంగా రూ.15 కోట్లు: ఎవరతను? ఏ టీమ్‌లో చేరాడు?

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట పీక్స్‌కు చేరుకుంది. చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్.. వేదికగా సాగుతోన్న ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో విదేశీ ఆటగాళ్లు కోట్ల కొద్దీ రేటుకు అమ్ముడుపోతోన్నారు. అదే రేంజ్‌లో కొందరు అన్ క్యాప్డ్ క్రికెటర్లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ క్రిస్ మోరిస్‌ను రికార్డు స్థాయిలో 16 కోట్ల 25 లక్షల రూపాయలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- మరో ఫాస్ట్ బౌలర్‌పై అదే రేంజ్‌లో ఖర్చు పెట్టింది. బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకుంది.

IPL auction: మరో ఫాస్ట్ బౌలర్‌పై ఏకంగా రూ.15 కోట్లు: ఎవరతను? ఏ టీమ్‌లో చేరాడు?IPL auction: మరో ఫాస్ట్ బౌలర్‌పై ఏకంగా రూ.15 కోట్లు: ఎవరతను? ఏ టీమ్‌లో చేరాడు?

ఆ బౌలర్.. కైలే జెమిసన్. 25 సంవత్సరాల న్యూజీలాండ్ ఫాస్ట్ బౌలర్. అతణ్ని 15 కోట్ల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి పించ్ హిట్టర్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్ విభాగం తేలిపోతోండటంతో ఈ సారి దాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ. అందుకే- మెరికెల్లాంటి నాణ్యమైన బౌలర్ల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడట్లేదు.

IPL 2021 auctions: New Zealand bowler Jamieson sold to RCB at 15cr

16.25 కోట్ల రూపాయలతో ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్‌ను పంజాబ్ జట్టు సొంతం చేసుకోగా.. అదే రేంజ్‌లో.. ఈ సారి ఆర్సీబీ 15 కోట్ల రూపాయలకు జెమిసన్‌ను సొంతం చేసుకుంది. పోటీనిచ్చింది. ఇప్పటిదాకా జట్టు ఆటగాళ్లకు అత్యధిక వేతనాన్ని చెల్లించే జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది. టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీకి ఆర్సీబీ 17 కోట్లను సంవత్సరానికి చెల్లిస్తోంది. అతని తరువాత రెండో స్థానంలో జెమిసన్ చేరాడు. జెమిసన్‌కు 15 కోట్ల రూపాయల వేతనాన్ని చెల్లించబోతోంది. మూడో స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాలుగోో స్థానంలో ఏబీ డివిలియర్స్ ఉన్నారు. మ్యాక్స్‌కు 14.25 కోట్లు, ఏబీడీకి 11.5 కోట్ల రూపాయలను చెల్లిస్తోంది.

English summary
Kyle Jamieson sold to Royal Challengers Bangalore at 15cr. He is the 4th player of IPL 2021 auctions to get bids of above Rs 10 Crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X