• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దినదిన గండం: ధోనీసేనలో కరోనా: పేలిన బయోబబుల్: ఐపీఎల్‌ను కమ్మేసిన వైరస్: మ్యాచ్ డౌట్

|

న్యూఢిల్లీ: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ దినదిన గండంగా మారుతోంది. దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐపీఎల్‌నూ వదిలి పెట్టట్లేదు. ఒక్కొక్కరుగా క్రికెటర్లు, సపోర్టింగ్ టీమ్ వైరస్ బారిన పడుతున్నారు. క్వారంటైన్ల పాలవుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఏకంగా టోర్నమెంట్‌ను అర్ధాంతరంగా రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. భారత క్రికెట్ కంట్రో్ బోర్డు (BCCI) దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌కు

చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌కు

టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌లో తాజాగా కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీనితో బుధవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. షెడ్యూల్ ప్రకారం.. ఈ మ్యాచ్ దేశ రాజధానిలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ వేదికగా 7:30కు ఆరంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను ముంబైలోని వాంఖెడే స్టేడియానికి తరలించాలంటూ ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ప్రతిపాదించింది.

ముంబై కాకపోతే..

ముంబై కాకపోతే..

ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ ఇదివరకే పూర్తయింది. తొలి దశ మ్యాచ్‌లన్నీ చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం, వాంఖెడేల్లో ముగిశాయి. రెండో దశలో ఫిరోజ్ షా కోట్లా సహా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియాలను వేదికగా మార్చారు. ఇప్పుడు మళ్లీ ముంబైలో మ్యాచ్‌లను నిర్వహించాల్సి రావడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా.. అనేది తేలాల్సి ఉంది. ముంబై స్టేడియం అందుబాటులో లేకపోతే.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లేదా కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకునే అవకాశం ఉంది. ఆ రెండు నగరాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున.. వాయిదా వేయొచ్చని అంటున్నారు.

హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌పై

హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌పై

ఈ సాయంత్రం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌పై కరోనా ప్రభావం పడకపోవచ్చు. ఈ రెండు జట్లల్లో ఎవరూ బయో సెక్యూర్ బబుల్‌ను బ్రేక్ చేయలేదు. రెండు జట్ల ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్, సపోర్టింగ్ టీమ్.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ మ్యాచ్ కొనసాగుతాయని రెండు జట్ల ఫ్రాంఛైజీలు తెలిపాయి. బుధవారం నాటి చెన్న సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నిర్వహణ అనుమానమే.

ఇప్పటికే నైట్‌రైడర్స్‌లో కరోనా

ఇప్పటికే నైట్‌రైడర్స్‌లో కరోనా

ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్‌ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. మీడియం పేసర్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. దీనితో సోమవారం కోల్‌కత నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్‌ను బీసీసీఐ వాయిదా వేసింది.

ఇక మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. వాయిదాలు వేసుకుంటూ వెళ్లడం వల్ల నిర్దేశిత షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు అవసరమౌతాయని, రిజర్వ్ డేల్లో మ్యాచ్‌లను నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ ముందుకు సాగుతుందా? లేద అనే అనుమానాలు సైతం నెలకొన్నాయి.

English summary
With Chennai Super Kings bowling coach L Balaji once again testing positive for COVID-19, the team is set to isolate and Wednesday's game between CSK and Rajasthan Royals is set to be postponed in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X